Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, July 16, 2020

AP Media bulletin: Details of today's Covid-19 cases.


AP Media bulletin: Details of today's Covid-19 cases
30-09-20
అమరావతి: ఏపీలో కరోనా కేసుల తీవ్రత కాస్త తగ్గుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 71,806 నమూనాలను పరీక్షించగా 6,133 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,93,484కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 48 మంది కరోనాతో మృతిచెందారు.
చిత్తూరు జిల్లాలో 8 మంది, ప్రకాశం 6, తూర్పుగోదావరి 5, కృష్ణా 5, విశాఖపట్నం 5, అనంతపురం 4, గుంటూరు 4, పశ్చిమగోదావరి 4, కడప 3, కర్నూలు 2, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 5,828కి చేరింది. 24 గంటల వ్యవధిలో 7,075 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 58,445 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 58,06,558 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

29-09-20
అమరావతి: ఏపీలో కరోనా వైరస్‌ ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24గంటల్లో 68,429 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 6,190 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. తాజాగా మరో 35 మంది ప్రాణాలు కోల్పోగా.. 9,836 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై అధికారులు బులిటెన్‌ విడుదల చేశారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 57,34,752 శాంపిల్స్‌ పరీక్షించగా.. 6,87,351 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 6,22,136 మంది కోలుకోగా.. 5,780 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 59,435 క్రియాశీల కేసులు ఉన్నాయి.
కొవిడ్‌ బారిన పడి తాజాగా ప్రకాశం జిల్లాలో ఎనిమిది మంది మృత్యువాతపడగా.. చిత్తూరు జిల్లాలో ఆరుగురు, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో నలుగురు చొప్పున, విశాఖలో ముగ్గురు, నెల్లూరు, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరేసి ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు, ఉభయ గోదావరి జిల్లాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలలో 991 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. పశ్చిమగోదావరి జిల్లాలో 907 కేసులు వచ్చాయి.

28-09-20
అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 66,121 నమూనాలను పరీక్షించగా 5,487 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,81,161కి చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో 7,210 మంది కరోనా నుంచి కోలుకోగా.. చికిత్స పొందుతూ 37 మంది మృతిచెందారు.
ప్రకాశం జిల్లాలో 7 మంది, చిత్తూరు 6, కృష్ణా 5, తూర్పుగోదావరి 4, గుంటూరు 4, కడప 3, పశ్చిమగోదావరి 3, అనంతపురం 2, విశాఖపట్నం 2, నెల్లూరు జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 5,745కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా 56,66,323 నమూనాలను పరీక్షించినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు.

27-09-20
అమరావతి: ఏపీలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. ఒక్కరోజు వ్యవధిలో 76,416 నమూనాలను పరీక్షించగా.. 6,923 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 6,75,674కి చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 7,796 మంది కరోనా నుంచి కోలుకోగా.. 45 మంది మృతిచెందారు.
ప్రకాశం జిల్లాలో 8 మంది, కృష్ణా 6, గుంటూరు 5, తూర్పుగోదావరి 4, పశ్చిమగోదావరి 4, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ముగ్గురేసి చొప్పున.. చిత్తూరు 2, విజయనగరం జిల్లాలో ఒకరు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 5,708కి చేరింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 56,00,202 నమూనాలను పరీక్షించారు.

25-09-20
అమరావతి: ఏపీలో కరోనా కేసుల తీవ్రత మళ్లీ కాస్త తగ్గుముఖం పట్టింది. 24 గంటల వ్యవధిలో 69,429 నమూనాలను పరీక్షించగా 7,073 మందికి కొవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,61,458కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో 8,695 మంది కోలుకోగా.. 48 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో 8 మంది, ప్రకాశం 8, అనంతపురం 6, కృష్ణా 5, పశ్చిమగోదావరి 5, కడప 3, నెల్లూరు 3, విశాఖపట్నం 3, తూర్పుగోదావరి 2, గుంటూరు 2, కర్నూలు 2, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 5,606కి చేరింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 54,47,796 నమూనాలను పరీక్షించినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు.

24-09-20
అమరావతి: ఏపీలో తగ్గినట్లే కనిపించిన కరోనా కేసుల తీవ్రత మళ్లీ పెరుగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 76,000 పరీక్షలు నిర్వహించగా 7,855 మంది కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 6,54,385కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 8,807 మంది కరోనా నుంచి కోలుకోగా.. 52 మంది  మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో 8 మంది, అనంతపురం 6, గుంటూరు 6, కృష్ణా 5, ప్రకాశం 5, విశాఖపట్నం 5, తూర్పుగోదావరి 4, కడప 3, కర్నూలు 3, పశ్చిమగోదావరి 3, విజయనగరం 2, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 5,558కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 53,78,367 నమూనాలను పరీక్షించారు.

23-09-20
అమరావతి: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఒక్కరోజు వ్యవధిలో 72,838 నమూనాలను పరీక్షించగా 7,228 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,46,530కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 45 మంది కరోనాకు చికిత్స పొందుతూ మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో 7 మంది, ప్రకాశం 7, కృష్ణా 5, తూర్పుగోదావరి 4, విశాఖపట్నం 4, పశ్చిమగోదావరి 4, అనంతపురం 3, కడప 3, నెల్లూరు 3, గుంటూరు 2, కర్నూలు 2, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 5,506కి చేరింది.
24 గంటల వ్యవధిలో 8,291 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 70,357 యాక్టివ్‌ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 5,70,667 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 53,02,367 నమూనాలను పరీక్షించినట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.

22-09-20

21-09-20
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 56,569 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 6,235 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 51,60,700 శాంపిల్స్‌ పరీక్షించగా.. 6,28,854 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో ఇప్పటి వరకు 5,48,926 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 5410 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 74,518 మంది బాధితులు వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది.

20.09.20
అమరావతి: ఏపీలో కరోనా కేసుల తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. ఒక్క రోజు వ్యవధిలో 70,455 నమూనాలను పరీక్షించగా.. 7,738 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనాబారిన వారి సంఖ్య 6,25,514కి చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 57 మంది కరోనాతో మృతిచెందారు. కృష్ణా జిల్లాలో 8 మంది, అనంతపురం 7, చిత్తూరు 7, ప్రకాశం 6, విశాఖపట్నం 6, తూర్పుగోదావరి 4, కర్నూలు 4, కడప 3, శ్రీకాకుళం 3, పశ్చిమగోదావరి 3, గుంటూరు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 5,349కి చేరింది. ఒక్కరోజులో 10,608 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 78,836 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 51,04,131 నమూనాలను పరీక్షించినట్లు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది.

19-09-20

18-09-20
అమరావతి: ఏపీలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 74,710 నమూనాలను పరీక్షించగా.. 8,096 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 6,09,558కి చేరింది. 24 గంటల్లో 69 మంది కరోనాతో మృతిచెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది. కడప జిల్లాలో 8, చిత్తూరు 7, కృష్ణా 7, తూర్పుగోదావరి 6, గుంటూరు 6, విశాఖపట్నం 6, అనంతపురం 5, నెల్లూరు 5, శ్రీకాకుళం 5, పశ్చిమగోదావరి 4, ప్రకాశం 3, విజయనగరం 3, కర్నూలు జిల్లాలో ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 5,244కి చేరింది. 24 గంటల వ్యవధిలో 11,803 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా.. 84,423 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 49,59,081 నమూనాలను పరీక్షించారు.

17-09-20
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ సంఖ్య 6లక్షలు దాటేసింది. గడిచిన 24గంటల్లో 77,492 శాంపిల్స్‌ పరీక్షించగా.. 8702 మంది కొవిడ్‌ బారిన పడగా.. 72 మంది ప్రాణాలు కోల్పోయారు.  తాజాగా మరో 10,712 మంది కోలుకొని డిశ్చార్జి అయినట్టు వైద్యశాఖ అధికారులు బులెటిన్‌లో పేర్కొన్నారు. కొత్త కేసులతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,01,462కి చేరింది. వీరిలో 5,08,088 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 5177 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 88197 క్రియాశీల కేసులు ఉన్నాయి.
కరోనా బారినపడి మృతి చెందినవారిలో అత్యధికంగా చిత్తూరులో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. ప్రకాశం జిల్లాలో 10, కడపలో 6, గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఆరుగురు, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలో ఐదుగురు, అనంతపురం, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాలో నలుగురు, శ్రీకాకుళంలో ఇద్దరు, విజయనగరంలో ఒకరు మృత్యువాతపడ్డారు.

16-09-20
అమరావతి: ఏపీలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 75,013 నమూనాలను పరీక్షించగా 8,835 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 5,92,760కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 10,845 మంది కోలుకోగా.. 64 మంది మృతిచెందారు.  చిత్తూరు జిల్లాలో 9 మంది, నెల్లూరు 7, గుంటూరు 6, ప్రకాశం 6, అనంతపురం 5, కడప 5, కృష్ణా 4, తూర్పుగోదావరి 3, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 5,105కి చేరింది. ప్రస్తుతం 90,279 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 48,06,879 నమూనాలను పరీక్షించారు.

15-09-20
ఏపీలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 70,511 నమూనాలను పరీక్షించగా.. 8,846 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 5,83,925కు చేరుకుంది. 24 గంటల వ్యవధిలో 69 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందారు. ప్రకాశం జిల్లాలో 10 మంది, చిత్తూరు 9, అనంతపురం 6, తూర్పుగోదావరి 6, కృష్ణా 6, కడప 5, విశాఖపట్నం 5, గుంటూరు 4, నెల్లూరు 4, విజయనగరం 4, పశ్చిమగోదావరి 4, కర్నూలు 3, శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 5,041కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 47,31,866 నమూనాలను పరీక్షించారు. ప్రస్తుతం 92,353 యాక్టివ్‌ కేసులున్నాయి. ఒక్కరోజు వ్యవధిలో 9,628 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది.

14-09-20
అమరావతి: ఏపీలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా సగటున రోజుకు సుమారు 10వేల కేసులు వస్తుండగా.. ఈరోజు ఆ సంఖ్య తగ్గింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఒక్కరోజులో 61,529 నమూనాలను పరీక్షించగా 7,956 మందికి కరోనా  సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,75,079కి చేరింది. 24 గంటల వ్యవధిలో 60 మంది మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో 9 మంది, అనంతపురం 7, కర్నూలు 5, ప్రకాశం 5, విశాఖపట్నం 5, తూర్పుగోదావరి 4, కడప 4, కృష్ణా 4, శ్రీకాకుళం 4, విజయనగరం 4, పశ్చిమగోదావరి 4, నెల్లూరు 3, గుంటూరులో ఇద్దరు మరణించినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. తాజా మరణాలతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 4,972కి చేరింది. ప్రస్తుతం 93,204 యాక్టివ్‌ కేసులున్నాయి. గత 24 గంటల్లో 9,764 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 46,61,355 నమూనాలను పరీక్షించినట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.

13-09-20
అమరావతి: ఏపీలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 72,233 నమూనాలను పరీక్షించగా 9,536 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 5,67,123కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో కరోనాతో చికిత్స పొందుతూ 66 మంది మృతిచెందారు. అనంతపురంలో జిల్లాలో 7 మంది, నెల్లూరు 7, ప్రకాశం 7, కడప 6, విశాఖపట్నం 6, చిత్తూరు 5, తూర్పుగోదావరి 5, కృష్ణా 5, కర్నూలు 5, గుంటూరు 4, విజయనగరం 4, పశ్చిమగోదావరి 3, శ్రీకాకుళంలో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 4912కి చేరింది. 24 గంటల వ్యవధిలో 10,131 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 45,99,826 నమూనాలు పరీక్షించినట్లు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది. 95,072 యాక్టివ్‌ కేసులున్నట్లు తెలిపింది.

12-09-20
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో 76,465 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 9901 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో  67 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 45,27,593 శాంపిల్స్‌ పరీక్షించగా.. 5,57,587 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. వీరిలో ఇప్పటికే 4,57,008 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 4846 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఏపీలో 95,733 యాక్టివ‌ కేసులు ఉన్నాయి. గత 24గంటల్లో కొత్తగా 10,292 మంది డిశ్చార్జి అయ్యారు.

గోదావరి జిల్లాలో ఉగ్రరూపం
రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాల్లో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో 1398 పాజిటివ్‌ కేసులు రాగా.. పశ్చిమగోదావరి జిల్లాలో 1069 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో 1146, చిత్తూరు జిల్లాలో 932 చొప్పున కొత్త కేసులు వచ్చాయి.
రాష్ట్రంలో కొత్త మరణాలు ఇలా..
కడప జిల్లాలో కొత్తగా మరో తొమ్మిది మంది కరోనాకు బలికాగా.. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఎనిమిది మంది చొప్పున; నెల్లూరులో ఏడుగురు, గుంటూరులో ఆరుగురు, కృష్ణా, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతిచెందారు. అలాగే, పశ్చిమగోదావరి జిల్లాలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో ముగ్గురేసి చొప్పున, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మృతిచెందారు.
రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఇలా..

10-09-20
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఒక్కరోజు వ్యవధిలో 72,229 నమూనాలను పరీక్షించగా 10,175 మందికి కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 5,37,687కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనాతో చికిత్స పొందుతూ 68 మంది మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో 9 మంది, కడపలో 9, నెల్లూరు 9, కృష్ణా 7, ప్రకాశం 7, అనంతపురం 6, తూర్పుగోదావరి 5, పశ్చిమగోదావరి 5, శ్రీకాకుళం 4, విశాఖపట్నం 4, గుంటూరు 2, విజయనగరంలో ఒకరు మరణించినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతిచెందిన వారి సంఖ్య 4,702కి చేరింది. ఒక్కరోజులో 10,040 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 43,80,991 నమూనాలను పరీక్షించారు. ప్రస్తుతం 97,338 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

09-09-20
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 71,692 నమూనాలను పరీక్షించగా 10,418 మంది కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో కొవిడ్‌ సోకిన వారి సంఖ్య 5,27,512కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది.
24 గంటల్లో 74 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతూ మృతిచెందారు. కడప జిల్లాలో 9 మంది, నెల్లూరు 7, ప్రకాశం 7, విశాఖపట్నం 7, అనంతపురం 6, చిత్తూరు 6, గుంటూరు 6, పశ్చిమగోదావరి 6, కృష్ణా 5, కర్నూలు 5, శ్రీకాకుళం 5, విజయనగరం 3, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 4,634కి చేరింది. ఒక్కరోజులో 9,842 మంది కోలుకోగా.. 97,271 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 43,08,762 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించారు.

08-09-20
అమరావతి: ఏపీలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. ఒక్కరోజులో 70,993 నమూనాలను పరీక్షించగా 10,601 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 5,17,094కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 73 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందారు. గుంటూరు జిల్లాలో 10 మంది, అనంతపురం 8, చిత్తూరు 8, కడప 7, ప్రకాశం 7, నెల్లూరు 6, విశాఖపట్నం 6, తూర్పుగోదావరి 5, కృష్ణా 5, పశ్చిమగోదావరి 5, శ్రీకాకుళం 3, కర్నూలు 2, విజయనగరం జిల్లాలో ఒకరు మరణించారు. తాజా వివరాలతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మృతిచెందిన వారి సంఖ్య 4,560కి చేరింది. మరోవైపు ఇప్పటి వరకు 42,37,070 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 96,769 యాక్టివ్‌ కేసులున్నట్లు తెలిపింది.

07-09-20
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా సోకిన వారిన సంఖ్య 5లక్షలు దాటింది. ఒక్కరోజు వ్యవధిలో 58,187 నమూనాలను పరీక్షించగా 8,368 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకినవారి సంఖ్య 5,06,493కి చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 70 మంది మృతిచెందారు. ప్రకాశం జిల్లాలో 10 మంది, గుంటూరు 9, చిత్తూరు 8, కడప 7, పశ్చిమగోదావరి 7, కృష్ణా 5, నెల్లూరు 5, అనంతపురం 4, కర్నూలు 4, శ్రీకాకుళం 4, విశాఖపట్నం 4, తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 4,487కి చేరింది. మరోవైపు ఒక్కరోజులో 10,055 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 41,66,077 నమూనాలను పరీక్షించారు.

06-09-20
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వరుసగా 11వ రోజూ 10వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 72,573 నమూనాలను పరీక్షించగా 10,794 మంది కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. తాజా వివరాలతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4,98,125కి చేరింది.  ఈ మేరకు ఏపీ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 70 మంది మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో 9 మంది, అనంతపురంలో 8, గుంటూరు 8, ప్రకాశం 8, కడప 7, తూర్పుగోదావరి 5, విశాఖపట్నం 5, పశ్చిమగోదావరి 5, కృష్ణా 4, కర్నూలు 4, నెల్లూరు 4, శ్రీకాకుళం 2, విజయనగరంలో ఒకరు  మృతిచెందారు. తాజా మృతులతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 4,417కి చేరింది. ఒక్కరోజులో 11,915 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 99,689 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 41,07,890 నమూనాలను పరీక్షించినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు.

05-09-20
అమరావతి: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వరుసగా పదోరోజు కూడా పదివేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 69,623 శాంపిల్స్‌ని పరీక్షించగా.10,825 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,87,331కి చేరింది. తాజాగా 71 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 4347కి చేరింది. ఇవాళ 11,941 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది.  నెల్లూరులో 13 మంది, అనంతపురం, పశ్చిమగోదావరిలో జిల్లాల్లో 8 మంది, చిత్తూరులో ఏడుగురు, విజయనగరంలో ఆరుగురు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఐదుగురు, కృష్ణాలో నలుగురు, కడపలో ముగ్గరు, కర్నూలు, శ్రీకాకుళంలో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఒకరు చొప్పున మరణించారు. ఇప్పటి వరకు 3,82,104 మంది కరోనా నుంచి కోలుకున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 1,00,880 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది.

04-09-20
అమరావతి: ఏపీలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. వరుసగా తొమ్మిదో రోజూ 10వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 59,919 నమూనాలను పరీక్షించగా 10,776 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,76,506కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 76 మంది కరోనాతో మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో 9 మంది, ప్రకాశం 9, గుంటూరు 8, కడప 8, నెల్లూరు 8, తూర్పుగోదావరి 6, విశాఖపట్నం 6, పశ్చిమగోదావరి 6, కృష్ణా 5, శ్రీకాకుళం 4, అనంతపురం 3, కర్నూలు 2, విజయనగరంలో ఇద్దరు మరణించినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. ఒక్కరోజులో 12,334 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 39,65,694 నమూనాలను పరీక్షించారు. తాజా లెక్కలతో కలిపి 1,02,067 కరోనా యాక్టివ్‌ కేసులున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి

03-09-20
అమరావతి: ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. వరుసగా ఎనిమిదో రోజూ 10వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 62,225 నమూనాలను పరీక్షించగా వారిలో 10,199 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 4,65,730కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఒక్కరోజులో 75 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందారు. తూర్పుగోదావరి జిల్లాలో 10 మంది, చిత్తూరు 9, గుంటూరు 9, అనంతపురం 7, కృష్ణా 7, పశ్చిమగోదావరి 7, నెల్లూరు 6, కడప 5, కర్నూలు 4, శ్రీకాకుళం 4, ప్రకాశం 3, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. తాజా వివరాలతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 4, 200కి చేరుకుంది. మరోవైపు గత 24 గంటల్లో 9,499 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 39,05,775 నమూనాలను పరీక్షించారు.

02-09-20
అమరావతి: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 60,804 నమూనాలను పరీక్షించగా 10,392 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 4,55,531కి చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఒక్క రోజు వ్యవధిలో 72 మంది కరోనాతో మృతిచెందారు. నెల్లూరు జిల్లాలో 11 మంది, చిత్తూరు 10, పశ్చిమగోదావరి 9, ప్రకాశం 8, కృష్ణా 6, విశాఖపట్నం 6, అనంతపురం 4, తూర్పుగోదావరి 4, గుంటూరు 4, శ్రీకాకుళం 4, విజయనగరం 3, కడప 2, కర్నూలు జిల్లాలో ఒకరు మరణించారు. తాజా లెక్కలతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 4,125కి చేరింది. 24 గంటల్లో 8,454 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 38,43,550 నమూనాలను పరీక్షించారు. ప్రస్తుతం 1,03,076 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

01-09-20
అమరావతి: ఏపీలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. వరుసగా ఏడో రోజూ 10వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో 59,834 నమూనాలను పరీక్షించగా 10,368 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.  దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 4,45,139కి చేరింది. మరోవైపు 24 గంటల్లో 84 మంది మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో 14 మంది, పశ్చిమగోదావరి 11, తూర్పుగోదావరి 10, అనంతపురం 7, గుంటూరు 7, విశాఖపట్నం 7, నెల్లూరు 6, కడప 5, కృష్ణా 4, కర్నూలు 4, శ్రీకాకుళం 4, ప్రకాశం 3, విజయనగరం జిల్లాలో ఇద్దరు కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 4,053కి చేరింది. ఒక్కరోజులో 9,350 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 37,82,746 నమూనాలను పరీక్షించారు.

31-08-20
అమరావతి: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వరుసగా ఆరో రోజూ 10వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 56,490 నమూనాలను పరీక్షించగా 10,004 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,34,771కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 85 మంది మృతిచెందారు. నెల్లూరు జిల్లాలో 12 మంది, చిత్తూరు 9, ప్రకాశం 9, కడప 8, అనంతపురం 7, తూర్పుగోదావరి 7, గుంటూరు 7, పశ్చిమగోదావరి 7, కర్నూలు 6, విశాఖపట్నం 6, శ్రీకాకుళం 4, కృష్ణా 2, విజయనగరం జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 3,969కి చేరింది. ఒక్కరోజులో 8,772 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 37,22,912 నమూనాలను పరీక్షించారు.

30-08-20
అమరావతి: ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదో రోజూ 10వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో 63,077 నమూనాలను పరీక్షించగా 10,603 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 24 గంటల వ్యవధిలో 88 మంది మృతిచెందారు. నెల్లూరు జిల్లాలో 14 మంది, చిత్తూరు 12, కడప 9, అనంతపురం 7, పశ్చిమగోదావరి 7, తూర్పుగోదావరి 6, శ్రీకాకుళం 6, కృష్ణా 5, కర్నూలు 5, విజయనగరం 5, గుంటూరు 4, ప్రకాశం 4, విశాఖపట్నం జిల్లాలో నలుగురు మరణించారు. తాజా మరణాలతో మృతిచెందిన వారి సంఖ్య 3,884కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 36,66,422 నమూనాలను పరీక్షించారు. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 4,24,727కి చేరింది. వీటిలో 99,129 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరోవైపు అత్యధిక కేసులు తూర్పుగోదావరిలోనే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఆ జిల్లాలో 1090 మందికి కరోనా సోకగా.. అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 383 మంది వైరస్‌ బారిన పడ్డారు.


29-08-20
అమరావతి: ఏపీలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 10,548 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ప్రభత్వం బులిటెన్‌ విడుదల చేసింది. కరోనా కారణంగా ఇవాళ మరో 82 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా పాజిటివ్‌ కేసులతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4,14,164కి  చేరగా.. ఇప్పటి వరకు 3,796 మంది మరణించారు. గత 24 గంటల్లో 8,976 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం 3,12,687 మంది కరోనాను జయించి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 97,681 క్రియాశీల కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌లో వెల్లడించింది.
తాజాగా చిత్తూరు జిల్లాలో 15 మంది, నెల్లూరు జిల్లాలో 11, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో 8 మంది చొప్పున, అనంతపురం, గుంటూరు, కర్నూలు జిల్లాలో ఆరుగురు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఐదుగురు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నలుగురు, కడప, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మొత్తం 36,03,345 శాంపిళ్లను పరీక్షించినట్లు ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది.

28-08-20
అమరావతి: ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వరుసగా మూడో రోజూ 10వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 61,331 నమూనాలను పరీక్షించగా 10,526 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒక్కరోజులో 8,463 మంది కరోనా నుంచి కోలుకోగా.. 81 మంది మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో 10 మంది, కడప 9, నెల్లూరు 8, ప్రకాశం 8, పశ్చిమగోదావరి 8, తూర్పుగోదావరి 6, కర్నూలు 6, విశాఖపట్నం 6, అనంతపురం 5, కృష్ణా 5, శ్రీకాకుళం 5, గుంటూరు 4, విజయనగరంలో జిల్లాలో ఒక్కరు చొప్పున మరణించారు. దీంతో  మృతిచెందిన వారి సంఖ్య 3,714కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 35,41,321 నమూనాలను పరీక్షించారు. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 4,03,616కి చేరింది.


27-08-20
అమరావతి: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ 10వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 61,300 నమూనాలను పరీక్షించగా వారిలో 10,621 మందికి ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్‌ విడుదల చేసింది. ఒక్కరోజులో 92 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందారు. కర్నూలు జిల్లాలో 13 మంది, నెల్లూరు 11, తూర్పుగోదావరి 10, చిత్తూరు 9, కడప 7, పశ్చిమగోదావరి 7, అనంతపురం 6, ప్రకాశం 6, విశాఖపట్నం 6, గుంటూరు 5, కృష్ణా 4, శ్రీకాకుళం 4, విజయనగరం జిల్లాలో నలుగురు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 3,633కి చేరింది. గత 24 గంటల్లో 8,528 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 34,79,990 నమూనాలను పరీక్షించారు.

26-08-20
అమరావతి: ఏపీలో మరోసారి భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 61,838 నమూనాలను పరీక్షించగా రికార్డు స్థాయిలో 10,830 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,528 కేసులు.. అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 299 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 8,473 మంది కరోనా నుంచి కోలుకోగా.. 81 మంది చికిత్స పొందుతూ మృతిచెందారు. తూర్పుగోదావరిలో 11 మంది, ప్రకాశం 9, చిత్తూరు 8, కడప 8, అనంతపురం 6, పశ్చిమగోదావరి 6, కృష్ణా 5, కర్నూలు 5, నెల్లూరు 5, విశాఖపట్నం 5, విజయనగరం 5, గుంటూరు 4, శ్రీకాకుళం జిల్లాలో నలుగురు కరోనాతో మృతిచెందినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 3,541కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 34,18,690 నమూనాలను పరీక్షించగా 3,82,469 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. జిల్లాల వారీగా వివరాలు కింది బులెటిన్‌లో..

25-08-20
అమరావతి: ఏపీలో కరోనా వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తోంది. గడిచిన 24గంటల్లో 9,927 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,71,639కి పెరిగింది. వీరిలో 2,78,247 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 3,460 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 89,932 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా 64,351 నమూనాలను పరీక్షించగా.. 9927 మంది కరోనా బారినపడ్డారని, అదేసమయంలో 9419 మంది కోలుకొని డిశ్చార్జి అయినట్టు ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది. వైరస్‌ సోకిన బాధితుల్లో కొత్తగా 92మంది మృత్యువాతపడినట్టు తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 33,56,852 శాంపిల్స్‌ను పరీక్షించినట్టు వెల్లడించింది.
చిత్తూరులో 16 మంది మృతి
రాష్ట్రంలో తాజాగా నమోదైన 92 కొవిడ్‌ మరణాల్లో చిత్తూరులో అత్యధికంగా 16మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, అనంతపురంలో 11, కడపలో 10, ప్రకాశం 10, తూర్పుగోదావరి 8, పశ్చిమగోదావరి 8, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో చెరో ఆరుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, విజయనగరంలో ఒకరు చొప్పున మృత్యువాతపడ్డారు.



24-08-20
అమరావతి: ఏపీలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 54,463 నమూనాలను పరీక్షించగా 8,601 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దాని ప్రకారం ఒక్కరోజులో 86 మంది కరోనాతో మృతిచెందారు. నెల్లూరులో 10 మంది, ప్రకాశం 10, చిత్తూరు 8, కడప 8, శ్రీకాకుళం 7, విశాఖపట్నం 7, అనంతపురంలో 6, కృష్ణాలో 5, విజయనగరం 4, కర్నూలు 2, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కరు మరణించారు. ఒక్కరోజులో 8,741 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 32,92,501 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

23-08-20
అమరావతి: ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్‌ విడుదల చేసింది. దాని ప్రకారం 24 గంటల వ్యవధిలో 46,712 నమూనాలను పరీక్షించగా 7,895 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఒక్కరోజులో రాష్ట్ర వ్యాప్తంగా 93 మంది మృతిచెందారు. నెల్లూరులో 16 మంది, పశ్చిమగోదావరి 13, చిత్తూరు 11, కర్నూలు 10, ప్రకాశం 9, కడప 8, శ్రీకాకుళం 6, విశాఖపట్నం 5, తూర్పుగోదావరి 4, అనంతపురం 3, గుంటూరు 3, కృష్ణా 3, విజయనగరం జిల్లాలో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 3282కి చేరింది. ఇప్పటి వరకు 32,38,038 నమూనాలను పరీక్షించినట్లు రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

22-08-20

21-08-20
అమరావతి: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో (నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు) మొత్తం 9,544 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. 55,010 కరోనా పరీక్షలు నిర్వహించగా తాజా కేసులు నిర్ధారణ అయినట్లు అందులో పేర్కొన్నారు.
మరోవైపు కరోనాతో చికిత్స పొందుతున్న వారిలో ఈ ఒక్కరోజు వ్యవధిలో 91మంది మృతిచెందారు. చిత్తూరులో 16, పశ్చిమగోదావరి 13, నెల్లూరు 12, తూర్పుగోదావరి 11, అనంతపురం 8, కడప 7, విశాఖపట్నం 6, శ్రీకాకుళం 5, ప్రకాశం 4, గుంటూరు 3, కృష్ణా 3, కర్నూలులో ముగ్గురు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 3092కి చేరింది. గత 24 గంటల్లో 8,827 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

20-08-20
అమరావతి: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9,393 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 55,551 మందికి పరీక్షలు నిర్వహించగా ఈ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒక్కరోజులోనే 95 మంది కరోనాతో మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 3,001కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది.
చిత్తూరులో 16, ప్రకాశంలో 11, నెల్లూరులో 9, అనంతపురంలో 8, తూర్పుగోదావరిలో 8, పశ్చిమగోదావరిలో 8, కడపలో 7, గుంటూరులో 6, కర్నూలులో 6, విశాఖపట్నంలో 6, శ్రీకాకుళంలో 5, విజయనగరంలో 4, కృష్ణా జిల్లాలో ఇద్దరు మరణించారు. గత 24 గంటల్లో 8,846 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 30,74,847 కరోనా పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

19/08-20
అమరావతి: ఏపీలో కరోనా మహా విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో (నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు) 57,685 మందిని పరీక్షించగా 9,742 మందికి వైరస్‌ సోకినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,16,003కి చేరినట్టు బులెటిన్‌లో పేర్కొంది.
గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 86 మంది కొవిడ్‌తో మృతిచెందినట్లు తెలిపింది. చిత్తూరులో 15, నెల్లూరు 15, అనంతపురంలో 8, గుంటూరులో 5, ప్రకాశం 6, శ్రీకాకుళం 6, తూర్పుగోదావరి 5, విశాఖపట్నం 5, విజయనగరం 5, పశ్చిమగోదావరి 5, కడప 4, కృష్ణా 3, కర్నూలులో ఇద్దరు మృత్యువాత పడినట్లు బులెటిన్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 30,19,296 పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది.

18-08-20
అమరావతి: ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. తాజాగా మొత్తం కేసుల సంఖ్య 3 లక్షలు దాటేసింది. ఈ మేరకు  రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 9,652 కేసులు నమోదు కాగా..మొత్తం కేసుల సంఖ్య 3,06,261కి చేరింది. తాజాగా కరోనా మహమ్మారి కారణంగా 88 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,820కి చేరింది. మరోవైపు 2,18,311 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 85,130 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. గత 24 గంటల్లో 56,090 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు 28.61 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని పేర్కొంది.

17-08-20
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో రాష్ట్రంలో కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువైంది. గత 24 గంటల్లో (9am-9am) రాష్ట్రవ్యాప్తంగా 6,780 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,96,609కి చేరింది. గత 24 గంటల్లో 44,578 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకు మొత్తంగా 29.05లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 84,777 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 2,09,100 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అవ్వగా.. కొవిడ్‌తో తాజాగా 82 మంది మృతి చెందారు. మొత్తంగా 2,732 మంది మరణించారు.
ప్రకాశం జిల్లాలో పదమూడు మంది; తూర్పు గోదావరి జిల్లాలో పది మంది; చిత్తూరు జిల్లాలో ఎనిమిది మంది; గుంటూరు, కడప జిల్లాల్లో ఏడుగురు; శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆరుగురు; అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు; కృష్ణా జిల్లాలో ముగ్గురు; నెల్లూరు జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు.

16-08-20
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 8,012 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 88 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,89,829కి చేరింది. మరణాల సంఖ్య 2,650 మందికి పెరిగింది. ఇవాళ ఒక్కరోజే 48,746 నమూనాలను పరిశీలించినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 10,117 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు పేర్కొంది.
కరోనా కారణంగా చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో 10 మంది మృత్యువాత పడ్డారు. కర్నూలు, నెల్లూరులో తొమ్మిది; అనంతపురం, పశ్చిమ గోదావరి ఎనిమిది మంది; విశాఖపట్నం ఏడు; గుంటూరు, కడప ఆరు; ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం నాలుగు; కృష్ణా జిల్లాలో మూడు చొప్పున కరోనా మృతులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 28.60 లక్షల శాంపిళ్లను పరీక్షించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

15-08-20
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రోజూ ఎనిమిది వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో (9am-9am) కొత్తగా 8,732 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,81,817కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 88,138 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 1,91,117మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. ఒక్క రోజులో 10,414 మంది కోలుకున్నారని వెల్లడించింది. గత 24 గంటల్లో 53,712 నామూనాలు పరీక్షించగా.. ఇప్పటి వరకు మొత్తం 28,12,197 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.
తాజాగా 87 మంది కరోనాతో మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో పది మంది; గుంటూరు జిల్లాలో తొమ్మిది మంది; తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎనిమిది మంది; అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో ఏడుగురు; నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఆరుగురు; ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు; కృష్ణా జిల్లాలో ముగ్గురు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 2,562కి చేరింది.

14-08-20
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో(9AM-9AM)కొత్తగా 8,943 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,73,085కి చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. ఇప్పటివరకు 27,58,485 కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఒక్క రోజులో 53,026 నమూనాలు పరీక్షించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 89,907యాక్టివ్‌ కేసులు ఉండగా.. 1,80,703 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గత 24 గంటల్లోనే మరో 9,779 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 97మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 2,475కి చేరింది.
కర్నూలు జిల్లాలో 12 మంది, చిత్తూరు; తూర్పు గోదావరి, గుంటూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో 10 మంది; అనంతపురం, కడప, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఆరుగురు; విజయనగరం జిల్లాలో ముగ్గురు; కృష్ణా జిల్లాలో ఇద్దరు చొప్పున కరోనాతో మృతి చెందారు.

13-08-20
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24గంటల్లో (9am-9am)కొత్తగా 9,996 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 55,692 నమూనాలు పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 90,840 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 1,70,924 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఒక్క రోజులోనే 9,499 మంది కోలుకున్నట్లు  ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 27,05,459 నమూనాలను పరీక్షించినట్లు తెలిపింది. తాజా కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి 1,504 పాజిటివ్‌ కేసులు వచ్చాయి.

రాష్ట్రంలో తాజాగా కరోనా బారిన పడి మరో 82 మంది మృతి చెందారు. తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో పది మంది; అనంతపురం జిల్లాలో ఎనిమిది మంది; కడప జిల్లాలో ఏడుగురు; చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఆరుగురు; విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఐదుగురు; కృష్ణా జిల్లాలో  ఒకరు చొప్పున మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 2,378కి చేరింది.

12-08-20
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసులు రెండున్నర లక్షలు దాటాయి. గత 24గంటల్లో (9am-9am)కొత్తగా 9,597 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,54,146 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 90,425 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 1,61,425 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. ఒక్క రోజులో 6,676 మంది కోలుకున్నారని వెల్లడించింది. గత 24 గంటల్లో 57,148 నమూనాలు పరీక్షించగా.. ఇప్పటివరకు మొత్తం 26,49,767 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.

తాజాగా మరో 93 మంది కొవిడ్‌ కోరల్లో చిక్కుకొని మృతి చెందారు. గుంటూరు జిల్లాలో పదమూడు మంది; ప్రకాశం జిల్లాలో పదకొండు మంది; చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పది మంది; శ్రీకాకుళం జిల్లాలో తొమ్మిది మంది; అనంతపురం, కడప జిల్లాల్లో ఏడుగురు; విశాఖ పట్నం జిల్లాలో ఆరుగురు; తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు; కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నలుగురు; కృష్ణా జిల్లాలో ఇద్దరు చొప్పున కరోనా కాటుకు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 2,296కి చేరింది. జిల్లాలవారీగా కరోనా కేసుల వివరాలివీ


11-08-20
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24గంటల్లో (9am-9am)కొత్తగా 9,024 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 58,315 నమూనాలు పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,44,549కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 87,597 యాక్టివ్‌ కేసులు ఉండగా..  1,54,749మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఒక్క రోజులో 9,113 మంది కోలుకున్నట్లు  ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 25,92,619 నమూనాలను పరీక్షించినట్లు తెలిపింది. తాజా కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా నుంచి 1,372, కర్నూలు జిల్లా నుంచి 1,138 కేసులు వచ్చాయి.
తాజాగా కరోనాతో 87 మంది మృతి చెందారు. అనంతపురం జిల్లాలో పదమూడు మంది; చిత్తూరు జిల్లాలో పన్నెండు మంది; గుంటూరులో తొమ్మిది; ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఏడుగురు; కడప, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆరుగురు; తూర్పు గోదావరి, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు; కృష్ణ, కర్నూల్‌ జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతులు 2,203కి చేరారు.

జిల్లాలవారీగా కరోనా కేసుల వివరాలివీ..

10-08-20
అమరావతి: రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో(9AM-9AM)రాష్ట్రంలో కొత్తగా 46,999 నమూనాలు పరీక్షిస్తే.. 7,665 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,35,525కి చేరింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా నుంచి 1,235 కేసులు, కర్నూల్‌ నుంచి 883 కేసులు వచ్చాయి. ఒక్క రోజులో 6,924 మంది కోలుకోగా.. మొత్తంగా 1,45,636 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 87,773 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 25,34,304 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది.
తాజాగా కరోనాతో 80 మంది మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో పదకొండు; గుంటూరు జిల్లాలో పది; పశ్చిమ గోదావరి జిల్లాలో తొమ్మిది; కడప, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు; చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఆరుగురు; అనంతపురం, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు; తూర్పు గోదావరి జిల్లాలో నలుగురు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి  వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 2,116కి చేరింది. జిల్లాలవారీగా కరోనా కేసుల వివరాలివీ.

09-08-20

08-08-20
రాష్ట్రంలో కొత్తగా 10,080 కరోనా కేసులు నమోదురాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 97 కరోనా మరణాలురాష్ట్రంలో 2,17,040కి చేరిన మొత్తం కరోనా కేసులురాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 1,939 మంది మృతిరాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న 1,29,615 మంది బాధితులురాష్ట్రంలో ప్రస్తుతం 85,486 కరోనా యాక్టివ్‌ కేసులు24 గంటల వ్యవధిలో 62,123 మందికి కరోనా పరీక్షలురాష్ట్రంలో ఇప్పటివరకు 24.24 లక్షల మందికి కరోనా పరీక్షలు


07-08-20
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రెండు లక్షలు దాటాయి. గత 24 గంటల్లో (9AM-9AM) కొత్తగా 10,171 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,06,960కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 84,654 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఒక్క రోజులో 7,594 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తంగా 1,20,464 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 62,938 నమూనాలు, ఇప్పటి వరకు 23,62,270 నమూనాలు పరీక్షించినట్లు ప్రభుత్వం పేర్కొంది.
తాజాగా కరోనాతో 89 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో పది మంది; అనంతపురం, గుంటూరు, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున; తూర్పు గోదావరి, కడప, ప్రకాశం జిల్లాల్లో ఏడుగురు; కృష్ణా జిల్లాలో ఆరుగురు; కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో ఐదుగురు; శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ముగ్గురు చొప్పున కరోనా వల్ల మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 1,842కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కర్నూలు  జిల్లా నుంచి 1,331 కేసులు, తూర్పు గోదావరి జిల్లా నుంచి 1,270 కేసులు, అనంతపురం జిల్లా నుంచి 1,100 కేసులు వచ్చాయి. జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలివీ...

06-08-20
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు 2 లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 63,686 నమూనాలను పరీక్షించగా.. 10,328 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 1,96,789కి చేరాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా నుంచి 1,351 కేసులు, కర్నూలు జిల్లా నుంచి 1,285 కేసులు, అనంతపురం జిల్లా నుంచి 1,112 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 82,166 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 1,12,870 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గత 24 గంటల్లో 8,516 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 22,99,332 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా కరోనాతో 72 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1,753కి చేరింది.
అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాల్లో పది మంది; గుంటూరు జిల్లాలో తొమ్మిది మంది; చిత్తూరు జిల్లాలో ఎనిమిది మంది; ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఆరుగురు; విశాఖపట్నం జిల్లాలో నలుగురు; కడప, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముగ్గురు; కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు.


05-08-20
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1.86లక్షలు దాటింది. రెండురోజులపాటు కాస్త నెమ్మదించిన కరోనా మరోసారి పదివేల మార్క్‌ను తాకింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,128 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో ఇవాళ మరో 77 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 1,86,461కి చేరుకోగా.. 1,681 మంది మృతి చెందారు. ఇవాళ 8,729 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం తెలిపింది. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 80,426 మంది చికిత్స పొందుతుండగా.. 1,04,354 మంది డిశ్చార్జి అయ్యారు.

కొత్తగా 60,576 నమూనాలను పరీక్షించగా.. పదివేల కేసులు నిర్థరణ అయ్యాయి. కొవిడ్‌ వల్ల గుంటూరులో 16 మంది, విశాఖపట్నంలో 12, శ్రీకాకుళంలో 10, చిత్తూరు ఎనిమిది, తూర్పుగోదావరిలో ఏడుగురు, కృష్ణాలో ఐదుగురు, నెల్లూరులో నలుగురు, కర్నూలులో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, కడపలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 22,35,626 సాంపిల్స్‌నుపరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.


04-08-20


03-08-20
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో(9am-9am)కొత్తగా 7,822 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో  మొత్త కరోనా కేసుల సంఖ్య 1,66,586కి చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా నుంచి 1,113 కేసులు, విశాఖపట్నం జిల్లా నుంచి 1,049 కేసులు వచ్చాయి. ఇప్పటి వరకు 21,10,923 కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఒక్క రోజులో 45,516 పరీక్షలు చేసినట్లు వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 76,377 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 88,672 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఒక్క రోజులోనే 5,786 మంది కోలుకున్నారు. తాజాగా 63 మంది మృతి చెందడంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 1,537కి చేరింది.

పశ్చిమ గోదావరి జిల్లాలో పదకొండు మంది, విశాఖపట్నం జిల్లాలో తొమ్మిది మంది, ప్రకాశం జిల్లాలో ఎనిమిది మంది, నెల్లూరు.. శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు చొప్పున, విజయ నగరంలో నలుగురు, చిత్తూరు.. కృష్ణా.. కర్నూలు జిల్లాల్లో ముగ్గురు చొప్పున, అనంతపురం.. తూర్పు గోదావరి.. గుంటూరు.. కడప జిల్లాల్లో ఇద్దరు చొప్పున కరోనాతో మృత్యువాత పడ్డారు. జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలివీ..

02-08-20
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇవాళ కొత్తగా 8,555 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,58,764కి చేరింది. మరో 67 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు కరోనాతో 1,474 మంది మృతి చెందారు. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 74,404 మంది చికిత్స పొందుతుండగా.. 82,886 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
నిన్న ఉదయం 9 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల్లోపు  52,834 నమూనాలను పరీక్షించినట్లు వైద్య శాఖ తెలిపింది. కొవిడ్‌ వల్ల కృష్ణాలో 11 మంది, గుంటూరులో ఎనిమిది, తూర్పుగోదావరిలో ఏడుగురు, విశాఖపట్నంలో ఏడుగురు, కర్నూలులో ఆరుగురు, నెల్లూరులో ఆరుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, కడపలో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 6,272 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారని ప్రభుత్వం తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 20,65,407 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.

01-08-20
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కేసుల సంఖ్య 1.50లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 60,797 నమూనాలను పరీక్షించగా కొత్తగా 9,276 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో కరోనా కేసులు 1,50,209కి చేరింది. కరోనాతో ఇవాళ మరో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 1,407 మంది మృతి చెందారు.


31-07-20

30-07-20
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో(9am-9am) రాష్ట్రంలో కొత్తగా 10,167 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,441 కేసులు, కర్నూలు జిల్లాలో 1,252 కేసులు, విశాఖపట్నం జిల్లాలో 1,223 కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,30,557కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 69,252ఉండగా.. 60,024 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.

తాజాగా కరోనా బారిన పడి 68 మంది మరణించారు. తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున.. అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో ఎనిమిది మంది చొప్పున.. చిత్తూరు, కడప జిల్లాల్లో ఆరుగురు చొప్పున.. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో నలుగురు చొప్పున.. కృష్ణా జిల్లాలో ముగ్గురు.. నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతులు 1,281కి చేరారు. గత 24 గంటల్లో 70,068 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 18,90,077 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది.

29-07-20
వైరస్​కు మరో 65 మంది మృతి
రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 10,093 కరోనా కేసులురాష్ట్రంలో కరోనాతో మరో 65 మంది మృతిరాష్ట్రంలో 1,20,390కు చేరిన కరోనా బాధితులురాష్ట్రంలో 1,213కు చేరిన కరోనా మరణాలు


28-07-20


27-07-20
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు లక్ష దాటాయి. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 6,051 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,349 కి చేరింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1210కేసులు, గుంటూరు జిల్లాలో 744 కేసులు వచ్చాయి. ప్రస్తుతం 51,701 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 49,558 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 49 మంది మృతి చెందారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో తొమ్మిది మంది, విశాఖ జిల్లాలో ఎనిమిది, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఏడుగురు చొప్పున, కృష్ణ జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో నలుగురు, అనంతపురం జిల్లాలో ముగ్గురు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు చొప్పున, కడప, ప్రకాశం జిల్లాల్లో ఒక్కరు చొప్పున కరోనా బారిన పడి మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,090కి చేరింది. ఒక్క రోజులో 43,127 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు మొత్తంగా 16,86446 కరోనా పరీక్షలు చేసినట్లు పేర్కొంది.



26-07-20
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 7,627 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 96,298కి చేరింది. ప్రస్తుతం 48,956 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 46,301 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. అత్యధికంగా కర్నూల్‌ జిల్లాలో 1,213, తూర్పు గోదావరి జిల్లాలో 1,095 కేసులు నమోదయ్యాయి. తాజాగా 56 మంది మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలో తొమ్మిది మంది, విశాఖ జిల్లాలో ఎనిమిది, కర్నూలు జిల్లాలో ఆరుగురు మృతి చెందారు. కృష్ణ, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున కరోనాతో మృత్యువాత పడ్డారు. చిత్తూరు జిల్లాలో నలుగురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు, అనంతపురం, కడప జిల్లాల్లో ఇద్దరు చొప్పున, గుంటూరు జిల్లాలో ఒక్కరు మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,041కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 47,645, మొత్తంగా 16,43,319 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది.



25-07-20
ఏపీలో 7,813 కరోనా కేసులు నమోదు
అమరావతి: ఏపీలో కరోనా కోరలు చాస్తోంది. వైరస్‌ పీడితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇవాళ  రాష్ట్ర వ్యాప్తంగా 7,813 కొత్త కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు వైరస్‌ సోకిన వారి సంఖ్య 88,671కి చేరింది. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే  52 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 985కి చేరింది. తాజాగా గుంటూరులో 9 మంది, పశ్చిమగోదావరిలో 8, తూర్పుగోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో  6, చిత్తూరులో 5, విజయనగరంలో 4, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో 3, నెల్లూరు, ప్రకాశంలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 15,95,674 పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 43,255 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అవ్వగా.. మరో44,431 మంది వివిధ కొవిడ్‌ ఆస్పత్రులు, క్వారంటైన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నట్లు బులిటెన్‌లో పేర్కొంది.


24-07-20
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకూ కేసులు సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఇవాళ రికార్డు స్థాయిలో 8,147 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో ఒక్కరోజులో ఇంత మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 80,858కి చేరింది.తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1029 కేసులు నమోదయ్యాయి.కరోనా కారణంగా ఈ ఒక్కరోజే 49 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో  ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 933కి చేరింది.

తూర్పుగోదావరి జిల్లాలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. కృష్ణా జిల్లాలో 9, కర్నూలులో 8, శ్రీకాకుళంలో 7, పశ్చిమగోదావరిలో 5, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో 3, చిత్తూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 15,41,993 నమూనాలను పరీక్షించినట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇప్పటి వరకు 39,935 మంది మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జికాగా.. మరో 39990 మంది వివిధ కొవిడ్‌ ఆస్పత్రులు, క్వారంటైన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.


23-07-20
ఒక్కరోజులోనే 7,998 కేసులు నమోదు
ఏపీలో కరోనా ప్రమాద ఘంటికలు!
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ అధికమవుతోంది. ఇవాళ రికార్డు స్థాయిలో 7,998 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో ఒక్కరోజులో ఇంతమొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మూడు జిల్లాల్లో వెయ్యికిపై కేసులు నమోదు కావడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లాలో1391 కేసులు బయటపడగా.. గుంటూరు జిల్లాలో 1184, అనంతపురంలో 1,016 కేసులు వచ్చాయి. కరోనా కారణంగా ఈ ఒక్కరోజే 61 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో  ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 884కి చేరింది. తూర్పుగోదావరిలో 14 మంది, గుంటూరులో 7, కర్నూలులో 7, కృష్ణ 6, శ్రీకాకుళం 6, విశాఖపట్నం, విజయనగరంలో 5, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 3, కడప, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.తాజా కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల 72,711గా ఉంది. ఇప్పటి వరకు 37,555 మంది మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అవ్వగా.. మరో 34,272 మంది వివిధ కొవిడ్‌ ఆస్పత్రులు, క్వారంటైన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది.


22-07-20

ఏపీలో కరోనా.. ఒక్కరోజే 65 మరణాలు
అమరావతి: ఏపీలో కరోనా వైరస్‌ మహా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో రోజురోజుకీ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటం కలవరం రేపుతోంది. గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 6045 పాజిటివ్‌ కేసులు, 65 మరణాలు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 15 మంది ప్రాణాలు కోల్పోగా.. కృష్ణా జిల్లాలో 10, పశ్చిమగోదావరిలో 8, తూర్పుగోదావరిలో 7, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో 5 చొప్పున, విజయనగరం జిల్లాలో 4, ప్రకాశం,శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో చెరో ముగ్గురు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. అలాగే, ఈ రోజు కొత్తగా 6494 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 64,713కి పెరిగింది.వీరిలో  823మంది ప్రాణాలు కోల్పోగా.. 32,127 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 31,763 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


21-07-20
ఏపీలో 4994 మందికి కరోనా పాజిటివ్‌
అమరావతి: ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు  రోజుకూ పెరుగుతోంది. ఇవాళ ఒక్క రోజే 4994 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 58,668కి చేరింది.  గుంటూరులో అత్యధికంగా 577 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.  మహమ్మారి కారణంగా ఇవాళ 62 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 758కి చేరింది. తాజాగా తూర్పుగోదావరిలో 10 మంది, విశాఖపట్నంలో 9, చిత్తూరులో 8, శ్రీకాకుళంలో 7, అనంతపురంలో 6, పశ్చిమగోదావరిలో 6, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 5,, కర్నూలులో 4, కడపలో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు  13,86,274 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.


20-07-20
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. కొత్తగా 4,074 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  మెుత్తం బాధితుల సంఖ్య 53,724కు చేరింది. వైరస్​తో మరో 54 మంది మృతి చెందగా.. మెుత్తం మృతుల సంఖ్య 696కు చేరింది. 24 గంటల వ్యవధిలో 33,580 కొవిడ్‌ నమూనాలు పరీక్షించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 13 లక్షల 49 వేల 112 మందికి కరోనా పరీక్షలు చేశారు.వైరస్ కారణంగా తూర్పు గోదావరి,  గుంటూరు జిల్లాల్లో 9 మంది చొప్పున మృతి చెందగా..కృష్ణాలో ఏడుగురు, అనంతపురం జిల్లాలో ఆరుగురు మృతి బలయ్యారు. చిత్తూరు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున..  కడప, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు.


19-07-20
ఏపీలో కరోనా: 50 వేలకు చేరువగా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఒక్క రోజులోనే ఐదువేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో ఇవాళ కొత్తగా 5,041 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 49,650కి చేరింది. కరోనా ఇవాళ మరో 56 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు కరోనాతో 642 మంది మృతి చెందారు.

గడిచిన 24 గంటల్లో 31,148 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. కొవిడ్‌తో ఇవాళ తూర్పుగోదావరి 10, శ్రీకాకుళం 8, కర్నూలు 7, విశాఖపట్నం 7, కృష్ణ 7, ప్రకాశం 4, అనంతపురం 3, కడప 3, విజయనగరం 3.. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఇద్దరేసి మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 13, 15,532 నమూనాలను పరీక్షించామని వైద్య శాఖ పేర్కొంది.



18-07-20
అమరావతి: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 3,963 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 44,609కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 52  మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు 589 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇంత ఎక్కువ మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. వివిధ ఆస్పత్రులు, క్వారంటైన్‌ కేంద్రాల్లో 22,260 మంది చికిత్స పొందుతుండగా..
21,763 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది.


17-07-20

ఏపీలో 40 వేలు దాటిన కరోనా కేసులు
అమరావతి : ఏపీలో కరోనా విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో రోజుకు రెండు వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేసుల సంఖ్య 40 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో 2602 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. వీరిలో ఇతర రాష్ట్రాల్లోని వారు 8 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఇద్దరు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 40,646కి చేరింది.

మరోవైపు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 42 మంది కొవిడ్‌తో మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 534కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 20298 మంది డిశ్చార్జి కాగా.. 19,814 మంది చికిత్స పొందుతున్నారు.



16-07-20
ఏపీలో కొత్తగా 2593 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2593 కరోనా కేసులు.. 40 మరణాలు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి సంబంధించినవి 2584 కేసులు కాగా.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 9 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 38,044కి చేరింది. మొత్తం 22,304శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కోసం చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 18159గా ఉంది. ఇప్పటివరకు 19393మంది కరోనా నుంచి కోలుకోగా.. 492మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.



🔷️🔶️🔷️🔶️🔷️🔶️🔷️🔶️🔷️


15-07-20


Thanks for reading AP Media bulletin: Details of today's Covid-19 cases.

No comments:

Post a Comment