Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, July 14, 2020

Center guidelines on online classes


ఆన్‌లైన్‌ తరగతులపై కేంద్రం మార్గదర్శకాలు

♦ప్రి-ప్రైమరీ విద్యార్థులకు రోజుకు అర గంటే

ఈనాడు, దిల్లీ: ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంగళవారం ‘ప్రజ్ఞాత’ పేరిట మార్గదర్శకాలు జారీ చేసింది. ఆన్‌లైన్‌ తరగతుల కారణంగా విద్యార్థులు స్క్రీన్లపై గడిపే సమయం పెరిగిపోతోందన్న తల్లిదండ్రుల ఆందోళనను పరిగణలోకి తీసుకున్నాకే వీటిని రూపొందించినట్టు పేర్కొంది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. ప్రి-ప్రైమరీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు రోజులో 30 నిమిషాలు మించరాదు. 1-8 తరగతులకు రెండు విడతలుగా, ఒక్కో విడతలో 45 నిమిషాలకు మించకుండా నిర్వహించొచ్చు. 9-12 తరగతులకు నాలుగు విడతలుగా, ఒక్కో విడతలో 30-45 నిమిషాల వ్యవధిలో తరగతులు నిర్వహించవచ్చు. ప్రస్తుతానికి విద్యార్థుల కోణంలోనే ఈ మార్గదర్శకాలు రూపొందించినట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ చెప్పారు.

■ కరోనా కారణంగా సొంతూళ్లకు చేరుకున్న వలస కార్మికుల పిల్లల చదువుల విషయంలోనూ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు చేసింది. ఇలాంటి విద్యార్థుల పేర్లను పాఠశాలల రికార్డుల నుంచి తొలగించవద్దని, తాత్కాలికంగా అందుబాటులో లేరని మాత్రమే నమోదు చేయాలని కోరింది. పరిస్థితులు మెరుగయ్యాక వారు తిరిగొచ్చే అవకాశం ఉండడంతో ఈ సూచన చేసింది.  అలాగే సొంతూళ్లకు వచ్చిన పిల్లలకు ఒక్క గుర్తింపు రుజువు మినహా ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండానే స్థానిక పాఠశాలల్లో చేర్చుకొనేలా రాష్ట్రాలు ఆదేశాలు ఇవ్వొచ్చని పేర్కొంది.

Thanks for reading Center guidelines on online classes

No comments:

Post a Comment