Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, July 19, 2020

Complete information about NISHTHA


         NISHTHA గురించి పూర్తి సమాచారం
Complete information about nISHTHA

 కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి, సహాయ మంత్రి ఆంధ్రప్రదేశ్ లో 1200 మంది రిసోర్స్ పర్సన్స్ కు ఆన్ లైన్ నిశిత (NISHTHA) కార్యక్రమం ప్రారంభం

మొట్ట మొదటి ఆన్ లైన్ నిశిత కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ కు చెందిన 1200 మంది కీ రిసోర్స్ పర్సన్ కోసంకేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే వర్చువల్ పద్ధతిలో ఈరోజు న్యూ ఢిల్లీ నుంచి ప్రారంభించారు.

పాఠశాలల హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయుల కోసం కేంద్రం చేపట్టిన శిక్షణా కార్యక్రమమే నిశిత అని కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ఈ సందర్భంగా అన్నారు. నేర్చుకోవటం వలన వచ్చే ఫలితాలను మెరుగుపరచటం కోసం మానవ వనరుల మంత్రిత్వ శాఖ చేపట్టిన సమగ్ర శిక్షలో ఇది ఒక భాగమన్నారు. 2019 ఆగస్టు 21న ఇది ముఖాముఖి కార్యక్రమంగా మొదలైందని, ఆ తరువాత 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ కేంద్ర ప్రభుత్వ పథకాన్ని సమగ్ర శిక్ష కింద చేపట్టాయని అన్నారు. జాతీయ విద్య, పరిశోధన, శిక్షణా మండలి (ఎన్ సి ఇ ఆర్ టి) రాష్ట్ర స్థాయిలో ఈ  నిశిత కార్యక్రమాన్ని 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పూర్తి చేసిందని చెప్పారు. అయితే మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్, జమ్మూ కాశ్మీర్, బీహార్ లో మాత్రం రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇంకా కొనసాగుతోంది. రెండు రాష్ట్రాలలో ఇంకా ప్రారంభం కాలేదని. జిల్లా స్థాయి ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదలైంది.

23,000 కీ రిసోర్స్ పర్సన్స్ కు, 17.5 లక్షలమంది టీచర్లు, హెడ్మాస్టర్లకు నిశిత పథకం కింద ముఖాముఖి శిక్షణ ఇప్పటివరకూ పూర్తయిందని శ్రీ పోఖ్రియాల్ చెప్పారు.

కోవిడ్ సంక్షోభం కారణంగా ఆకస్మిక లాక్ డౌన్  విధించటంతో ఈ కార్యక్రమాన్ని ముఖాముఖి పద్ధతిలో కొనసాగించ లేక పొయారు. అందుకే, మిగిలి పోయిన 24 లక్షల మంది టీచర్లకు, హెడ్మాస్టర్లకు శిక్షణ పూర్తి చేయటానికి వీలుగా నిశిత కార్యక్రమాన్ని మార్పులు చేసి ఆన్ లైన్ శిక్షణకు అనుగుణంగా దీక్ష, నిశిత పోర్టల్స్ ద్వారా జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండలి నిర్వహిస్తోందని మంత్రి వివరించారు. ఇలాంటి ఆన్ లైన్ నిశిత  శిక్షణ ఆంధ్రప్రదేశ్ తోనే మొదలు పెడుతున్నామన్నారు. 1200 మంది కీ రిసోర్స్ పర్సన్స్ కోసం నిశిత పొర్టల్ ద్వారా ఈ శిక్షణ ఉంటుంది.   

వీళ్ళు అంధ్రప్రదేశ్ లోని టీచర్లకు ముందుగా బోధిస్తారు. ఆ తరువాత టీచర్లు నేరుగా దీక్ష పోర్టల్ మీద ఆన్ లైన్ ద్వారా నిశిత శిక్షణ పొందుతారు.

నిష్టా  కింద రూపొందించిన మాడ్యూల్స్ ప్రధానంగా పిల్లల సమగ్ర అభివృద్ధి మీద దృష్టి సారిస్తాయని, అందుకే బోధనాంశాల్లో విద్య, ఆరోగ్యం, వ్యక్తిగత, సామాజిక లక్షణాలు, కళతో కూడిన అధ్యయనం, పాఠశాల విద్యలో చేపట్టాల్సిన అంశాలు, పాఠ్యాంశాల వారీగా బోధనా విధానం, నాయకత్వం, పాఠశాల నమోదుకు ముందు విద్య లాంటివి ఉంటాయని చెప్పారు. ఇవి పరస్పర సంభాషణకు అనువుగా ఉంటాయని విద్యా సంబంధమైన ఆటలు, క్విజ్ ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుందని కూడా వెల్లడించారు. దీని వల్ల వాళ్లకు ఇది ఆహ్లాదకరంగా ఉండటంతో బాటు వాళ్ళు తిరిగి పాఠశాలల్లో విద్యార్థులను చురుగ్గా తయారు చేయటానికి పనికొస్తాయన్నారు.

దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయుల, హెడ్మాస్టర్ల సామర్థ్యాన్ని పెంచడానికి ప్రాథమిక విద్యా స్థాయిలో  మానవ వనరుల మంత్రిత్వ శాఖ, జాతీయ విద్య, పరిశోధన, శిక్షణ మండలి నిశిత ద్వారా చేస్తున్న కృషిని మంత్రి శ్రీ పోఖ్రియాల్ అభినందించారు. కేవలం విద్యార్థుల గ్రహణ శక్తినే కాక వారి సర్వతోముఖాభివృద్ధికి ఇవి దోహదం చేస్తాయన్నారు.

ఈ సందర్భంగా మానవ వనరుల శాఖ సహాయ మంత్రి శ్రీ ధోత్రే మాట్లాడుతూ ప్రపంచం అత్యంత వేగం అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ వేగానికి తగినట్టుగా ఉపాధ్యాయులు కూడా తమకున్న దృక్పథాన్ని, అవగాహనను, బోధనా పద్ధతులను పెంచుకోవాల్సి ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఇదొక నిరంతర ప్రక్రియ కావాలని సమర్థంగా నిర్వహించాలని సూచించారు.

సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ఇచ్చే శిక్షణ పూర్తిగా వారి అభిప్రాయాలకు తగినట్టుగా రూప కల్పన జరగాలన్నారు. ఉపాధ్యాయుల అనుభవం దృష్ట్యా వారు సొంతగా కనిపెట్టిన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా కోరారు. వాళ్ళ మాటల ఆధారంగానే ప్రామాణిక బోధనా విధానాలు రూపొందించాలని సూచించారు. దేశపు వైవిధ్యాన్ని వివరిస్తూ  ఉపాధ్యాయులకు తెలియ జెప్పాలని, అప్పుడే విద్యార్థులు కూడా ఈ సువిశాల దేశపు  వైవిధ్యాన్ని తెలుసుకో గలుగుతారని అన్నారు. అప్పుడే గౌరవ ప్రధాన మంత్రి ప్రస్తావించిన  'ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్'  స్ఫూర్తిని విద్యార్థులు నింపుకో గలుగుతారాని అభిప్రాయ పడ్దారు.

నిశిత-ఆన్ లైన్ లో పరస్పర సంభాషణకు అనువైన అనేక విధానాలు కలిసి ఉంటాయి. పాఠ్యాంశాలలో వీడియోలు, లైవ్ సెషన్లు సైతం జాతీయ స్థాయి రిసోర్స్ పర్సన్స్ చెప్పిన వీడియో పాఠాలు స్వయం ప్రభ టీవీ చానల్ లో డిటిహెచ్ ద్వారా అందుతాయి.  ఉపాధ్యాయులతో సంభాషణకు అనువుగా ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ( IVRS ) ను వాడుకుంటారు.  NCERT, మానవ వనరుల మంత్రిత్వ శాఖ  చేస్తున్న కృషిని ఈ సందర్భంగా మంత్రి ధోత్రే అభినందించారు.

నిశిత ముఖాముఖి కార్యక్రమంలో మొదటి స్థాయి శిక్షణలో భాగంగా కీ రిసోర్స్ పర్సన్స్ (KRP)కు, రాష్ట్రాలు గుర్తించిన స్టేట్ రిసోర్స్ పర్సన్స్ (SLRP)కు నేషనల్ రిసోర్స్ పర్సన్స్  శిక్షణ ఇస్తారు.  టీచర్లకు శిక్షణ ఇవ్వటంలో  KRP లు కీలక పాత్ర పోషిస్తారు.

Thanks for reading Complete information about NISHTHA

No comments:

Post a Comment