Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, July 25, 2020

If the immune system is low, these symptoms will be known ...


If the immune system is low, these symptoms will be known ...
రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే ఈ లక్షణాలతో తెలిసిపోతుంది ... ఇవి తీసుకుంటే సరి
If the immune system is low, these symptoms will be known ...



ఇమ్యూన్ సిస్టమ్ చాలా వ్యాధుల నుండి మనని రక్షిస్తుంది. అయితే, మన ఇమ్యూన్ సిస్టమ్ బలమైనదే కదా అని మనం దానిని పట్టించుకోకపోతే అది బలహీన పడిపోతుంది. రోగనిరోధక శక్తి బలహీనపడితే ఎన్నో రోగాలు మన మీద దాడి చేస్తాయి. అందుకే, మన జీవన శైలి ఇమ్యూన్ సిస్టమ్ ని బలపరిచేలాగా ఉండాలి.

మన రోగ నిరోధకశక్తి అంత బలం గా లేదని మనకి కొన్ని విషయాల ద్వారా తెలుస్తూ ఉంటుంది.

1. రోగనిరోధక శక్తిలో సుమారు డెబ్భై శాతం పొట్టలోనే ఉంటుంది. కాబట్టి, అక్కడ తేడా ఉంటే పొట్ట ఉబ్బరం, కాన్స్టిపేషన్, డయేరియా వంటి సమస్యలు వస్తాయి.

2. శరీరంలో ఎక్కడైనా దెబ్బ తగిలితే హెల్దీగా ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అక్కడికి న్యూట్రియెంట్స్ తో నిండి ఉన్న బ్లడ్ ని పంపుతుంది.
దాంతో గాయం త్వరగా తగ్గుతుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే గాయం తగ్గడానికి చాలా సమయం పడుతుంది.

3. జలుబు, దగ్గు, చెవి నొప్పి, ఊపిరి తీసుకోవడం లో సమస్యలు వంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఒక సంవత్సరంలో రెండు కోర్సుల కంటే ఎక్కువ సార్లు యాంటీ-బయాటిక్స్ తీసుకోవలసి వస్తే ఇమ్యూన్ సిస్టం బలంగా లేనట్టే.

4. సరైన ఇమ్యూన్ సిస్టమ్ లేకపోతే శరీరంలో ఓపిక కూడా సరిగ్గా ఉండదు. ఎందుకంటే, ఉన్న ఎనర్జీని శరీరం రోగనిరోధక శక్తికి పంపిస్తూ ఉంటుంది. దాంతో, ఎప్పుడూ నీరసంగా అనిపిస్తూ ఉంటుంది.

రోగనిరోధక శక్తిని పెంచుకోవడం మన చేతుల్లోనే ఉంది.

1. తాజా పండ్లూ, కూరగాయలతో న్యూట్రిషస్ ఫుడ్ తీసుకోవడం.

2. సూర్యరశ్మిలో రోజూ కొంత సేపు గడపడం. 

3. రెగ్యులర్ గా మెడిటేషన్ కానీ, యోగా కానీ చేయడం.

4. బరువు సరిగ్గా ఉంచుకోవడం.

5. గట్-ఫ్రెండ్లీ ఫుడ్స్ తీసుకోవడం.

6. తగినంత విటమిన్ సీ తీసుకోవడం.

Thanks for reading If the immune system is low, these symptoms will be known ...

No comments:

Post a Comment