Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, July 1, 2020

Main points in teacher union discussions with CSE on teacher transfers


ఉపాధ్యాయ బదిలీలపై CSE తో ఉపాధ్యాయ సంఘాల చర్చలలో ముఖ్యాంశాలు


✰  ఈరోజు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు గారు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాన్ని నిర్వహించారు సమావేశం నాలుగు గంటల నుండి 8:30 వరకు జరిగింది సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగింది.

➪ ముఖ్యాంశాలు:

1.➪ జూలై 7వ తేదీ వరకు అందరూ పాఠశాలలకు వెళ్లి u dise ఇంకా ఇతర పనులు పూర్తి చేయాలి

2. ➪ ఏడో తేదీ నుండి విద్యార్థులకు ఆన్లైన్  లేదా ఇతర పద్ధతుల్లో బోధనకు ప్రణాళికను రూపొందించి మనకు అందించడం జరుగుతుంది. వారంలో ఎన్ని రోజులు పాఠశాలకి వెళ్ళాలి ,అనే విషయం త్వరలో కమిషనర్ గారు తెలియజేస్తారు

3. ➪ containment జోన్ లో నివసించే వారు కూడా పాఠశాలకు వెళ్లనవసరం లేదని కమిషనర్ గారు తెలియజేశారు.ఇంతకు ముందు ఉత్తర్వుల్లో పేర్కొంది మినహాయింపులు అన్నీ కొనసాగుతాయి.

4. ➪ బయోమెట్రిక్ విధానంపై చాలా సీరియస్ గా చర్చ జరిగిన అనంతరం పరిశీలిస్తామని చెప్పారు. బయోమెట్రిక్ పై మినహాయింపును ఇవ్వవచ్చు.

5.➪ హేతుబద్ధీకరణ ప్రాథమిక పాఠశాలలలో 1: 30 నిష్పత్తి ప్రకారం జరుగుతుంది. అయితే 8 వేల పోస్టులు మిగులుతాయి కనుక వాటిని 40-60 విద్యార్థులున్న పాఠశాల లకుమూడవ పోస్టు గా కేటాయిస్తారు. పోస్టులు ఇంకా మిగిలితే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న వాటికి కేటాయిస్తారు.

6. ➪ ఉన్నత పాఠశాలలకు సంబంధించి అసంబద్ధత లను కమిషనర్  గారిదృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది .ముఖ్యంగా సోషల్ స్టడీస్ ,పి .ఎస్., బయాలజీ పోస్టులలో మార్పులు  సూచించడం జరిగింది .వాటికి కమిషనర్ గారు అంగీకరించారు.

7. ➪ తెలుగు ఆంగ్ల మాధ్యమాల్లో వేరువేరుగా పరిగణిస్తారు ఆంగ్ల మాధ్యమం విద్యార్థులు 200 లోపు ఉంటే టేబుల్ 3 ఏ కు అదనంగా నాలుగు పోస్టులు కేటాయిస్తారు..ఆంగ్ల మాధ్యమం విద్యార్థులు 240 కంటే ఎక్కువ మంది ఉంటే వేరే సెక్షన్ గా పరిగణించి అన్ని పోస్ట్ లు ఇస్తారు..

8. ➪ బదిలీలు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా జరుగుతాయి.

9. ➪ డి ఈ ఓ పూల్ లో ఉన్న పం డిట్ లు అందరిని అవసరమైన ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జిటి పోస్టుల్లో  నియమిస్తారు.

10.➪ డీ ఈ ఓ పూల్లో ఉన్న ఉపాధ్యాయులు అందరిని ముందుగా నియమిస్తారు.

11.➪  ఖాళీలను చూపించడానికి 1-7 -2020 నీ ప్రాతిపదికగా తీసుకుంటారు.

12. ➪ మినిమమ్ రెండు సంవత్సరాలు మ్యాగ్జిమం ఎనిమిది ఎకడమిక్ ఇయర్స్ పరిగణిస్తారు

13. ➪ స్పెషల్ కేటగిరీలకు ఐదు పాయింట్లు మాత్రమే కేటాయించారు.

14.➪ టోటల్ సర్వీస్ పాయింట్లు గతంలో వలే ఉంటాయి

15.➪ స్టేషన్ సర్వీస్ పాయింట్ లు
క్యాటగిరిI -1
క్యాటగిరి II-2
క్యాటగిరిIII- 3
కేటగిరి  IV -5 పాయింట్లు కేటాయిస్తారు

16 . ➪ జులై 2019 నుండి ఇచ్చిన పదోన్నతుల ను ఖాళీగా చూపించే విషయం ఆలోచించి నిర్ణయిస్తామని చెప్పారు.

17.➪ ప్రతిభ ఆధారితపాయింట్స్ తొలగించారు.

18.➪ ఖాళీగా ఉన్న డ్రాయింగ్ క్రాఫ్ట్ మ్యూజిక్ డాన్స్ మొదలైన పోస్టులను రద్దు చేసి ఇ వాటి బదులుగా ప్యానల్ హెడ్మాస్టర్ పోస్ట్లు హెడ్మాస్టర్ పోస్టులు  ఎస్ జి టి పోస్ట్లు మంజూరు చేసే విషయం పరిశీలిస్తున్నారు.

19. ➪ ఏ టీచర్ పోస్టు  రద్దు కాదు.

20. ➪ హై స్కూల్స్ లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువ అయితే ప్రాథమికోన్నత పాఠశాల నుండి పంపించడం జరుగుతుంది.

Thanks for reading Main points in teacher union discussions with CSE on teacher transfers

No comments:

Post a Comment