Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, July 22, 2020

Oxford vaccine ready by November! What is the cost of the vaccine?


Oxford vaccine ready by November!
What is the cost of the vaccine?
నవంబర్‌ నాటికి ఆక్స్‌‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ సిద్ధం!
 వ్యాక్సిన్‌ ధర ఎంత ఉండొచ్చంటే?
Oxford vaccine ready by November!  What is the cost of the vaccine?

పుణె: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి పెరుగుతున్న వేళ అందరి దృష్టీ వ్యాక్సిన్‌ పైనే ఉంది. వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ప్రపంచ దిగ్గజ ఫార్మా కంపెనీలు పోటీ పడుతున్నాయి.  ఇప్పటికే పలు కంపెనీలు రూపొందించిన వ్యాక్సిన్‌లు మానవులపై ప్రయోగ దశలో ఉన్నాయి. పుణెలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాతో కలిసి ఆక్స్‌ఫర్డ్‌ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ నవంబర్‌ నాటికి సిద్ధమయ్యే అవకాశం ఉంది. ఈ వ్యాక్సిన్‌ ధర సుమారు రూ.1000ల వరకు ఉండవచ్చని సమాచారం.  ఈ మేరకు భారత్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించినట్టు తెలిపిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పూనావాలా.. తొలి దశ ప్రయోగాలు ఆశాజనకంగా సాగుతున్నట్టు తెలిపారు. 
                 

అన్నీ అనుకున్నట్టు జరిగితే..

ఆగస్టు ఆఖరు నాటికి అవసరమైన చర్యలు పాటిస్తూనే.. 5వేల మంది వాలంటీర్లపై మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నట్టు చెప్పారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. నవంబర్‌ నాటికి వ్యాక్సిన్‌ సిద్ధమవుతుందని స్పష్టంచేశారు. వచ్చే ఏడాది జూన్‌ నాటికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందన్నారు. వ్యాక్సిన్‌ అభివృద్ధిలో సంతృప్తికర పురోభివృద్ధి సాధిస్తున్నట్టు ఆక్స్‌ఫర్డ్‌ ప్రకటించిన నేపథ్యంలో ఈ ఏడాది చివరికల్లా 30కోట్ల డోస్‌ల ఉత్పత్తే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు పూనావాలా తెలిపారు. మరో రెండు రోజుల్లో డ్రగ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కు దరఖాస్తు చేసుకోనున్నట్టు చెప్పారు.

ఒకటి రెండు వారాల్లో  వాటిపై అధ్యయనం, ట్రయల్స్‌కు సంబంధించిన అంశాలను డీసీజీఐ పూర్తిచేస్తుందన్నారు. రోగులపై ప్రయోగించేందుకు మరో మూడు వారాలు పడుతుందన్న పూనావాలా.. నెలరోజుల్లో పుణె, ముంబయిలోని 5వేల మంది వాలంటీర్లకు వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్టు తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి పనిచేస్తున్న సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా భారత్‌తో పాటు 60 దేశాలకు  వ్యాక్సిన్‌ సరఫరా చేయనుంది.

Thanks for reading Oxford vaccine ready by November! What is the cost of the vaccine?

No comments:

Post a Comment