Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, July 9, 2020

PPE (Personal Protective Equipment) - వ్యక్తిగత సంరక్షణ పరికరము లేదా సూటు PPE అంటే ఏంటి? ఎందుకు ధరిస్తారు? ఎవరు ధరిస్తారు?


PPE (Personal Protective Equipment) - వ్యక్తిగత సంరక్షణ పరికరము లేదా సూటు PPE అంటే ఏంటి? ఎందుకు ధరిస్తారు? ఎవరు ధరిస్తారు?

కరోన వైరస్ బారిన పడిన రోగులకు వైద్య చికిత్స అందించే వైద్య సిబ్బందికి రోగుల ద్వారా ఈ  వైరస్ సోకకుండా తీసుకునే రక్షణ చర్యలలో భాగంగా  వ్యక్తిగత సంరక్షణ పరికరము (Personal Protective Equipment) ను వైద్య సిబ్బంది ధరిస్తారు. 

PPE సూట్ లో ఏమేమి ఉంటాయి?

1. షూ కవర్లు (Shoe Cover) 
2. సరైన సైజు గల రెండు జతల గ్లౌజులు (Two Pairs of Gloves of Appropriate size) 
3. శరీరాన్ని పూర్తిగా కప్పివుంచే సూట్ (Coverall Full Body Suit) 
4. కళ్ల జోడు (Goggles)
5. ముక్కు నోరును పూర్తిగా కప్పి ఉంచే మాస్క్ (N95 Mask)
6. తలను కప్పి వుంచే మాస్క్ (Cap)
7. కళ్ళకు, ముఖానికి రక్షణగా కప్పి ఉంచే పారదర్శక  మాస్క్ (Visor)
8. నీటి నిరోధక సర్జరీ గౌను (Waterproof Surgeon Gown (Which Fastens at Back) 

PPE సూట్ ని  ధరించే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు
1. వ్యక్తిగత వస్తువులైన చేతి గడియారం, ఉంగరాలు, చైన్లు, పెన్నులు, మరియు మొబైల్ లాంటి వస్తువులు తమ వద్ద ఉంచుకోరాదు. 
2. PPE ధరించిన పిమ్మట సుమారు 6 గంటల వరకూ లేదా నిర్ణయించిన పని గంటలు ముగిసే వరకూ తొలగించే అవకాశం ఉండదు. కాబట్టి వాష్ రూమ్ సౌకర్యం ఉపయోగించుకోవాలి మరియు పనిచేసే సమయంలో డీహైడ్రేషన్ కు గురికాకుండా సరిపడా నీరు తాగాలి.  


PPE  సూట్ ని ధరించే విదానం:
PPE సూట్ నందు తగు శిక్షణ పొందిన వ్యక్తి ఆధ్వర్యంలో/లేదా సహాయంతో నిర్దేశించిన విదంగా తగు జాగ్రత్తలు తీసుకుని ధరించడం గాని విడవడం గాని చేయాలి. ఇదంతా పూర్తి క్రిమిరహితం చేయబడిన సురక్షితమైన గదిలో చెయ్యాలి.  మొదటగా 

a. శానిటైజర్ తో ప్తోటోకాల్ ప్రకారం చేతులు శుభ్రం చేసుకోవాలి
b. షూ కవర్లు తొడుక్కోవాలి.
c. శానిటైజర్ తో ప్తోటోకాల్ ప్రకారం చేతులు శుభ్రం చేసుకోవాలి
d. చేతులకు సంబంధించిన తొడుగులు ధరించాలి
e. తరువాత శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే కవరాల్ సూట్ ధరించాలి. దీనికి కుర్చీ సహాయం తీసుకోవచ్చు.
f. N95 మాస్క్ ధరించాలి. మాస్క్ లో గాలి చొరపడకుండా ముక్కు వద్ద  మరియు  మాస్క్ చుట్టూ  సీల్ అయిందో లేదో చెక్ చేసి తదనుగుణంగా  మాస్క్ స్ట్రాప్స్ ను సరిచెయ్యాలి.
g. తలను పూర్తిగా కప్పివుంచే విదంగా  క్యాప్ ను ధరించాలి .
h. ఇపుడు కావరాల్ సూట్ యొక్క హుడీని తలపై పూర్తిగా కప్పి మెడ వరకూ సూట్ ని సీల్ చెయ్యాలి.
i. ఇపుడు కళ్లను, ముఖానికి రక్షణ కల్పించే విదంగా పారదర్శకమైన రక్షణ పొర ధరించి స్ట్రాప్స్ ముడివేయడానికి వేరొకరి సహాయం పొందండి.
j. తరువాత సర్జికల్ గౌన్ ను ధరించి వాటి స్ట్రాప్స్ ను వెనుక బిగించి కట్టుకోవడానికి వేరొకరి సహాయం పొందండి.
k. చివరిగా రెండవ జత చేతి తొడుగులు సర్గికల్ గౌన్ చేతుల చివర గ్లౌజ్ తో  మూసే  విదంగా ధరించాలి.


PPE సూట్ ని తొలగించు  విధానం. (ఇది చాలా జాగ్రత్తగా ఒక నిపుణుడు సహాయం తో ఒక ప్రత్యేక ప్రదేశం లో  చేయవలసి వుంటుంది)


a. మొదటగా సహాయకుడి ద్వారా రెండవ  హ్యాండ్ గ్లౌజు నందు శానిటైజర్ స్ప్రే చేయించుకుని గ్లౌజు పూర్తిగా శుభ్రం చేసుకుని కుడి చేతితో ఎడమచేతి గ్లౌజును మణికట్టు వద్ద పట్టుకుని గ్లౌజు బయట భాగం  లోపలికి వెళ్ళేలా తొలగించి పట్టుకుని ఇపుడు ఎడమ చేతి చూపుడు వేలుతో కుడి చేతి మాస్క్ బయట భాగం తగలకుండా మాస్క్ లోపలికి చొప్పించి  మాస్క్ బయట భాగం లోపలికి వెళ్ళేలా వేళ్ళ చివర వరకూ లాగి జాగ్రత్తగా తొలగించి నిర్దేశింపబడిన విధంగా ఎరుపురంగు గల బిన్ లో వెయ్యాలి.
b. మరలా  సహయకుడి ద్వారా మొదటి హ్యాండ్ గ్లౌజు నందు శానిటైజర్ స్ప్రే చేయించుకుని గ్లౌజు పూర్తిగా శుబ్రము చేసుకుని సర్జరీ గౌను లోపలి వైపును జాగ్రత్తగా పట్టుకుని  బయట వైపున ముట్టుకోకుండా బయట వైపును జాగ్రత్తగా లోపలికి మడచి నిర్దేశించిన పసుపు రంగు బిన్ లో వెయ్యాలి.
c. మరలా సహయకుడి ద్వారా మొదటి హ్యాండ్ గ్లౌజు నందు శానిటైజర్ స్ప్రే చేయించుకుని గ్లౌజు పూర్తిగా శుబ్రము చేసుకుని కళ్ళనూ ముఖముకు రక్షణ కొరకు వాడిన పారదర్శక తొడుగును  సహాయకుడితో తీసివేసి నిర్దేశించిన ఎరుపు రంగు బిన్ లో వెయ్యాలి.
d. తిరిగి మరలా సహయకుడి ద్వారా మొదటి హ్యాండ్ గ్లౌజు నందు శానిటైజర్ స్ప్రే చేయించుకుని గ్లౌజు పూర్తిగా శుబ్రము చేసుకుని కవరాల్ సూటుని మన వెళ్ళు మనం ధరించిన దుస్తులకు మాస్క్ కు తగులకుండా సూటు బయట వైపు లోపలికి మడుస్తూ జాగ్రత్తగా తొలగించి నిర్దేశించినవిదంగా పసుపు బిన్ లో వెయ్యాలి.
e. మరలా సహయకుడి ద్వారా మొదటి హ్యాండ్ గ్లౌజు నందు శానిటైజర్ స్ప్రే చేయించుకుని గ్లౌజు పూర్తిగా శుబ్రము చేసుకుని తలకు కప్పుకున్న తొడుగును జాగ్రత్తగా తొలగించి నిర్దేశించినవిదంగా పసుపు బిన్ లో వెయ్యాలి.
f. తిరిగి మరలా సహయకుడి ద్వారా మొదటి హ్యాండ్ గ్లౌజు నందు శానిటైజర్ స్ప్రే చేయించుకుని గ్లౌజు పూర్తిగా శుబ్రము చేసుకుని పాదరక్షల యొక్క తొడుగులు తొలగించి నిర్దేశించిన విదంగా ఎరుపు రంగు బిన్ లో వేయాలి.

Thanks for reading PPE (Personal Protective Equipment) - వ్యక్తిగత సంరక్షణ పరికరము లేదా సూటు PPE అంటే ఏంటి? ఎందుకు ధరిస్తారు? ఎవరు ధరిస్తారు?

No comments:

Post a Comment