Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, July 29, 2020

The Cabinet took a key decision to change the name of the Ministry of Human Resources to the Ministry of Education.


కొత్త విద్యా విధానం .. ఆ శాఖ పేరు మార్పు .. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
             


ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్రం మానవ వనరుల శాఖ పేరును విద్యా మంత్రిత్వశాఖగా మారుస్తూ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు నూతన జాతీయ విద్యా విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా చదువును అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. నాలుగు దశల్లో నూతన జాతీయ విద్యా విధానం ఉండనున్నట్టు తెలుస్తోంది. 5+3+3+4 విధానంలో విద్యా విధానం అమలులోకి రానున్నట్టు సమాచారం.

3 నుంచి 18 ఏళ్ల వయసున్న వారికి ఉచిత, నిర్భంద విద్యను అందించడమే లక్ష్యంగా కేంద్రం ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.
కొత్త విద్యా విధానంలో సిలబస్ వంటి అంశాలు కూడా పూర్తిగా మారిపోనున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. వృత్తి, ఉపాధి లభించే విధంగా విద్యా వ్యవస్థను మార్చనున్నట్టు తెలుస్తోంది. ఈ విధానంలో మొదటి ఐదేళ్లలో ఫౌండేషన్ కోర్సుగా పరిగణిస్తారని సమాచారం. ఆ తరువాత మూడేళ్లను ప్రీ ప్రైమరీ స్కూల్ మరియు గ్రేడ్ 1, గ్రేడ్ 2గా పరిగణించనున్నారు. ప్రతి రాష్ట్రంలోనూ రాష్ట్రస్థాయి స్కూల్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. కొత్త విధానం ద్వారా దేశంలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు తమ ప్రాంగణాలను నెలకొల్పేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఉన్నత  విద్యా విధానంలో సమూల మార్పులకు ఈ కొత్త విధానం శ్రీకారం చుట్టనుంది.

Thanks for reading The Cabinet took a key decision to change the name of the Ministry of Human Resources to the Ministry of Education.

No comments:

Post a Comment