Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, August 29, 2020

Central Government latest memorandum on early retirement.


Central Government latest memorandum on early retirement. 
ముందస్తు రిటైర్మెంట్‌పై కేంద్రం తాజా మెమోరాండం .. వాళ్ళందరికీ షాకే !

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ముందస్తు-నిర్బంధ పదవీ విరమణపై మోడీ సర్కారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలిసిన 56 నిబంధనను మరో సారి గుర్తు చేస్తూ ఒక మెమోరాండం జారీ చేసింది. ప్రజా ప్రయోజనం, సమర్థ పాలన, ప్రజలకు సత్వర సేవలు అందించడం కోసం ఉద్యోగులకు ముందుగానే రిటైర్‌మెంట్‌ ప్రకటించే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన హక్కులున్నాయి. ఇందులో భాగంగా 30 సంవత్సరాల సర్వీసు, 50లేదా55 సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్న ఉద్యోగుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. ఉద్యోగి నిజాయితీగా లేకపోతే కచ్చితంగా రిటైర్‌ చేస్తారు. మరో ఏడాదిలోపు రిటైర్‌ అయ్యే ఉద్యోగులను అసమర్థత కారణంగా ముందుగానే తీసేయకూడదు.


శారీరకంగా, మానసికంగా ఒక్కసారిగా తీవ్రమైన మార్పు వస్తే మాత్రం ముందస్తు రిటైర్‌మెంట్‌ ఇవ్వొచ్చు. ముందస్తు రిటైర్‌మెంట్‌'పై నిర్ణయం తీసుకునేముందు ఉద్యోగి సర్వీస్‌ రికార్డు మొత్తాన్ని పరిశీలించాలని చెప్పింది కేంద్రం. అయితే 56J నిబంధనలు కొత్తేమీ కాదు. కానీ, మోడీ సర్కారు వచ్చిన తర్వాతే ఈ అస్త్రాన్ని ఎక్కువగా వాడటం మొదలుపెట్టింది. చాలా మంది ఉద్యోగులను నిర్బంధ పదవీ విరమణ పేరిట ఇంటికి పంపించింది. తాజాగా ఉద్యోగుల తొలగింపు కేంద్రం హక్కు అని.. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కూడా మెమొరాండంలో వివరించింది కేంద్రం. ఈ నిబంధనల కింద రిటైర్‌మెంట్‌ ఇవ్వడాన్ని పెనాల్టీగా భావించకూడదని తెలిపింది. ఉద్యోగికి అందాల్సిన అన్ని ప్రయోజనాలు లభిస్తాయని... కంపల్సరీ రిటైర్‌మెంట్‌కూ, దీనికీ సంబంధం లేదని వివరించింది మోడీ సర్కారు.

Thanks for reading Central Government latest memorandum on early retirement.

No comments:

Post a Comment