Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, August 24, 2020

Change in Common Entrance Test timeings.


Change in Common Entrance Test  timeings.
ఉమ్మడి ప్రవేశ పరీక్షల సమయాల్లో మార్పు.

అమరావతి:ఎంసెట్‌ సహా ఉమ్మడి ప్రవేశ పరీక్షల సమయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొవిడ్‌-19 నేపథ్యంలో పరీక్ష కేంద్రాలను శానిటైజ్‌ చేసేందుకు రెండు విడతల (సెషన్‌) మధ్య 3గంటల సమయం అవసరం కానున్నందున పరీక్షల సమయాల్లో మార్పు చేస్తున్నారు. గతంలో ఎంసెట్‌ ఒక విడత ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట, రెండో విడత మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం ఐదింటి వరకు ఉండేవి. ఈసారి ఉదయం 9గంటలు, మధ్యాహ్నం 3గంటల నుంచి పరీక్షలను ప్రారంభించేలా ప్రణాళికను రూపొందిస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు గుమిగూడకుండా నోటీసు బోర్డుల ప్రక్రియను నిలిపేయనున్నారు. వీటి స్థానంలో విద్యార్థులకు సమాచారమిచ్చేందుకు వాలంటీర్లను నియమిస్తున్నారు. అభ్యర్థులు కేంద్రం వద్దకు చేరుకోగానే థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించి హాల్‌టిక్కెట్‌పై ఉండే బార్‌కోడ్‌ ఆధారంగా పరీక్ష గది వివరాలను వెల్లడిస్తారు.

➪ కరోనా లక్షణాలున్న వారికి ప్రత్యేకంగా ఐసొలేషన్‌ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నారు$. ఇక్కడ విధులు నిర్వర్తించే ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లను అందిస్తారు.

➪ కరోనా బారినపడి ఐసొలేషన్‌ కేంద్రాల్లో ఉన్న వారు సమాచారాన్ని కన్వీనర్లకు అందిస్తే వారు పరీక్షలు రాసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసేలా కసరత్తు చేస్తున్నారు.

➪ విద్యార్థుల మధ్య భౌతికదూరం పాటించడంతోపాటు అందుబాటులో శానిటైజర్లు ఉంచనున్నారు.

➪ పరీక్షకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్కు ధరించాలి.

➪ నీటి సదుపాయం ఉండే చోట చేతులు కడుక్కోవడానికి సబ్బు ద్రావణాలను ఉంచనున్నారు.

➪ వచ్చే నెల 10 నుంచి ప్రారంభమయ్యే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు అక్టోబరు 5తో ముగియనున్నాయి.

Thanks for reading Change in Common Entrance Test timeings.

No comments:

Post a Comment