Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, August 8, 2020

Cold & Cough Tips:If you want to reduce cough naturally


 Cold & Cough Tips : జలుబు , దగ్గు సహజంగా తగ్గాలంటే ... ఇవి వాడితే సరి ...
Cold & Cough Tips:If you want to reduce cough naturally ...


Cold & Cough Tips : మన శరీరంలో ఏదైనా పెద్ద అనారోగ్య సమస్య వచ్చే ముందు దానికి సంకేతంగా దగ్గు, జలుబు వంటివి వస్తాయి. వాటిని అశ్రద్ధ చెయ్యకూడదు. అలా చేస్తే... జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి, నీరసం, వామ్టింగ్స్ ఇలా రకరకాల సమస్యలు విరుచుకుపడతాయి. అందుకే ప్రారంభంలోనే సమస్యకు చెక్ పెట్టాలి. ముఖ్యంగా జలుబు, దగ్గు అనేవి ఎలా వస్తాయో, వాటికి ఎలా చెక్ పెట్టాలో తెలిస్తే... అసలు అనారోగ్యం అన్నదే లేకుండా చేసుకోవచ్చు. కూల్ డ్రింక్స్, స్పైసీ మసాలా ఫుడ్స్, బిర్యానీ వంటి వేడి చేసే ఆహారాలు తక్కువగా తీసుకుంటే... బాడీలో హీట్ కంట్రోల్‌లో ఉండి... అనారోగ్యం రాకుండా ఉంటుంది. పొరపాటున వేడి చేస్తే... వెంటనే ఈ చర్యలు చేపట్టడం ద్వారా జలుబు, దగ్గును పూర్తిగా కంట్రోల్ చెయ్యవచ్చు.


Black peppercorns + honey : 8 నల్ల మిరియాల గింజల్ని పొడి చేసి... ఓ టేబుల్ స్పూన్ తేనెలో కలపాలి. రాత్రి పడుకునే ముందు ఓసారి, ఉదయం లేవగానే మరోసారి ఈ మిశ్రమాన్ని తీసుకుంటే... దగ్గు పరారవుతుంది.


Ginger + turmeric powder + honey : ఓ చిన్న అల్లం ముక్కను... చితక్కొట్టండి. అరకప్పు నీటిలో వేసి... ఉడికించండి. సిమ్‌లో నిమిషం పాటూ ఉడికించండి. స్టవ్ ఆపేసి, బాగా కలపండి. ఓ టేబుల్ స్పూన్ తేనె వెయ్యండి. చిటికెడు (టీస్పూన్‌లో నాలుగోవంతు) పసుపు వెయ్యండి. బాగా కలపండి. ఉదయాన్నే తాగండి. సాయంత్రం తాగండి.

Raw turmeric + almonds + munnakka + tulsi + milk : అరకప్పు నీరు తీసుకోండి. ఓ అంగుళం పసుపు కొమ్మును అందులో వెయ్యండి. నీరు సగం అయ్యే వరకూ ఉడికించండి. 8 తులసి ఆకులు వెయ్యండి. 6 బాదంలు వెయ్యండి. 6 లేదా 8 ఎండు ద్రాక్ష వెయ్యండి. ఓ కప్పు పాలు వెయ్యండి. పెద్ద మంటపై ఉడికించండి. తరవాత మంట తగ్గించి సిమ్‌లో 5 నిమిషాలు ఉంచండి. ఇప్పుడు పావు టీస్పూన్ నల్ల మిరియాల పొడి వెయ్యండి. ఓ టీస్పూన్ తేనె వెయ్యండి. బాగా కలపండి. చల్లార నివ్వండి. గోరు వెచ్చగా ఉండగా తాగండి. ఇలా రోజుకు రెండుసార్లు చెయ్యండి. నిద్రపోయే ముందు ఇది తాగితే... దగ్గు, జలుబు పరార్.

Bay leaf + cinnamon stick + cloves + black peppercorns + dry ginger powder : పులావు ఆకులు, దాల్చిన చెక్క ముక్క, లవంగాలు, నల్ల మిరియాలు, ఎండిన అల్లం పొడి తీసుకోవాలి. అన్నింటినీ పొడి చెయ్యాలి. 2 కప్పుల నీటిలో వాటిని వెయ్యాలి. సిమ్‌లో వేడి చెయ్యాలి. నీరు సగం అయ్యే వరకూ చెయ్యాలి. స్టవ్ ఆపేసి, బాగా కలపాలి. గోరు వెచ్చగా రోజూ రెండుసార్లు తాగాలి.

Whole almonds + black peppercorns + desi mishri : తొక్కతో ఉన్న 6 బాదంలు, 6 మిరియాలు, చిన్న పటికబెల్లం ముక్క. ఉదయాన్నే వీటిని ఏమీ తినక ముందు తినాలి. అప్పుడు దగ్గు, జలుబు... బాబోయ్ అంటూ వెళ్లిపోతాయి.

Garlic : వెల్లుల్లిలో ఎల్లిసిన్ ఉంటుంది. వెల్లుల్లి రెబ్బని నమిలితే, అందులో ఎల్లిసిన్... వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్‌గా వచ్చే వ్యాధుల్ని దూరం చేస్తుంది. రోజూ ఉదయాన్నే ఏమీ తినకముందే... రెండు వెల్లుల్లి రెబ్బలను నమలండి. దగ్గు, జలుబుకి గుడ్ బై చెప్పండి.

వీటితోపాటూ... బాగా నిద్రపోవాలి. (రోజుకు 8 గంటలు). పోషకాహారం తినాలి. నీరు బాగా తాగాలి. ఎక్సర్‌సైజ్ చెయ్యాలి. అప్పుడు దగ్గు, జలుబు రమ్మన్నా రావు.

Thanks for reading Cold & Cough Tips:If you want to reduce cough naturally

No comments:

Post a Comment