Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, August 22, 2020

Here are ten important tips that experts are saying to live normally in corona conditions ..!


కరోనా పరిస్థితుల్లోనూ సాధారణంగా జీవించాలంటే  నిపుణులు చెబుతున్న ముఖ్యమైన పది టిప్స్‌ ఏంటో చూద్దాం..!

➪  ఇంట్లో సరైన వెంటిలేషన్‌ లేకపోతే గాలి సరఫరా సరిగా ఉండదు.  అందుకే బయట కన్నా ఇంట్లోనే కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలైనంతగా ఇంట్లో కాకుండా ఇంటి ఆవరణలో ఉండేందుకు ప్రయత్నించండి.

➪ఉదయాన్నే సూర్యరశ్మిలో నిలబడితే ‘డి’ విటమిన్‌ వస్తుందని చిన్నప్పుడే నేర్చుకున్నాం. మనిషిని ఆరోగ్యంగా ఉంచడంలో ‘డి’ విటమిన్‌ ముఖ్య పాత్ర పోషిస్తుందని అందరికీ తెలుసు. అయితే సూర్యుడి కిరణాలు కరోనా వైరస్‌ చర్యను స్తంభింపజేస్తుందని ‘ది జర్నల్‌ ఆఫ్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌’ పేర్కొంది. అంటే సూర్యరశ్మిలో నిలబడటం వల్ల రెండు లాభాలున్నాయన్నమాట.

➪నోటి తుప్పర్ల ద్వారా బయటకు వచ్చే కరోనా వైరస్‌ గాలిలో కొంత సమయం ఉంటుంది. ఆ గాలిని ఎవరైనా పీల్చుకుంటే వారికి కరోనా సోకే ప్రమాదముంది. ముఖ్యంగా ఏసీ ద్వారా వచ్చే గాలి వేగంగా కదులుతుంది. దీంతో కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరోకరి వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ. కాబట్టి  వీలైనంత వరకు ఏసీలను ఉపయోగించడం మానుకోండి.

➪ ప్రస్తుత పరిస్థితుల్లో మనల్ని మనం కరోనా నుంచి రక్షించుకోవాలంటే మాస్క్‌ ధరించడం తప్పనిసరి. బయటకు వెళ్లినప్పుడు కచ్చితంగా మాస్క్ ధరించాలి. అలా అని 24/7 పెట్టుకోవద్దు. చుట్టుపక్కల ఎవరూ లేని.. కరోనా సోకే అవకాశం లేని ప్రాంతంలో మాస్కులు తీసేయండి. ఎక్కువ సేపు మాస్క్‌ ధరిస్తే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవ్వొచ్చు.

➪కారులో ప్రయాణిస్తున్నప్పుడు విండోస్‌ తెరిచే ఉంచండి. బయటకు వెళ్తున్నామని మాస్క్‌ పెట్టుకోగానే సరిపోదు. కారు విండోస్‌ మూసి ఉంచితే గాలి సరఫరా ఉండదు. ఏసీతోనూ ప్రమాదముంది. కాబట్టి కారు విండోస్‌ తెరిచే ఉంచండి.

➪కరోనా వైరస్‌ మన వరకు ఎలా వచ్చినా.. నోరు, ముక్కు, కళ్ల ద్వారానే శరీరంలోకి చేరుతుంది. కాబట్టి చేతులను శుభ్రం చేసుకోకుండా వాటిని తాకేందుకు ప్రయత్నించకండి. మన ప్రమేయం లేకుండా మన చేతులు ఆ అవయవాలను తాకుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని నివారించేందుకు కళ్లకు అద్దాలు పెట్టుకోవడం లేదా ముఖానికి ఫేస్‌ షీల్డ్‌ పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. 

➪ఇప్పుడు ఉద్యోగులందరూ ఆఫీసులకు వెళ్తున్నారు. సాధారణ రోజుల్లో అయితే లంచ్‌టైంలో అందరూ కలిసి తింటూ వంటకాలను పంచుకునేవారు. కానీ ఇప్పుడు అలా చేయకండి. మీ ఆహారం ఇతరులతో పంచుకోకుండా ఉండటమే ఉత్తమం. చాలా మందిలో కరోనా వైరస్‌ ఉన్నా లక్షణాలు తెలియట్లేదు. మీ సహోద్యోగుల్లో ఎవరికైనా ఉన్నా.. మీకే ఉన్నా ఆహారం పంచుకునే క్రమంలో వైరస్‌ వ్యాప్తి చెందొచ్చు. 

➪చేతులను శుభ్రంగా కడగడం పరిశుభ్రతలో తొలి నియమం. ఇది వరకు చేతులు కడగకపోయినా పర్వాలేదులే అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ఏది ముట్టుకున్నా.. పట్టుకున్నా ఆ తర్వాత చేతుల్ని శానిటైజర్‌ లేదా సబ్బుతో శుభ్రం చేసుకోవాల్సిందే. లేకపోతే  ప్రమాదముంది. 

➪ఒకరి నుంచి మరొకరి కరోనా సోకకుండా ఉండాలంటే కనీసం 6 అడుగులు భౌతిక దూరం పాటించాలని డబ్ల్యూహెచ్‌వో నుంచి వైద్య నిపుణుల వరకు అందరూ చెప్పారు. కరోనాను కట్టడి చేయాలంటే ఇంత కంటే ఇప్పట్లో మరో మార్గం కూడా లేదు. వ్యాక్సిన్‌ .. ఔషధాలు పూర్తిగా అందుబాటులోకి వచ్చే వరకు భౌతిక దూరాన్ని పాటిస్తుండటమే మేలు. 

➪ కొన్నాళ్లపాటు విమాన ప్రయాణాలు చేయకండి..

Thanks for reading Here are ten important tips that experts are saying to live normally in corona conditions ..!

No comments:

Post a Comment