Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, August 13, 2020

How to reduce body heat ?


How to reduce body heat ?
ఒంట్లో వేడి తగ్గాలంటే – 
How to reduce body heat ?

  శరీర తాపం అంటే శరీరంలోని వేడి రావటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే మీ శరీరంలోని వేడికి కారణం మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా కారణం. మీరు వేసవికాలంలో చాలా ఈ సమస్యలకు గురి అవుతారు. ఎందుకంటే వేసవిలో మీ శరీరం సూర్య కిరణాల తాకిడికి లోను అవుతుంది. ఇంకో కారణం మీరు తీసుకునే ఆహారం. దీనిపైన కూడా ఇది ఆధారపడి ఉంటుంది. అలాగే స్పైసీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఆల్కహాల్, కెఫ్ఫిన్ ఇలాంటి వాటి వల్ల శరీరం వేడికి గురి అవుతుంది. అంతేకాక జబ్బులు, మందులు కూడా శరీరంలో వేడి పెరగటానికి కారణాలవుతాయి. అయితే ఈ శరీరం లోని వేడిని కొన్ని గృహ చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం.

  మామూలు మానవ శరీర ఉష్ణోగ్రత 36.9.సి. అయితే వాతావరణ మార్పులను బట్టి కొంచెం అటూ ఇటూ అవ్వటం సాధారణమే. కానీ ఈ ఉష్ణోగ్రత కంటే ఏ మానవుని శరీరం హెచ్చుతగ్గులకు గురి అవటం ప్రమాదకరం. మీ శరీరం లోని వేడిని పెంచే ఆహారపదార్ధ్ధలు అలాగే పానియలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..ఇవి మీ శరీరంలోని ఆర్గాన్లను పాడు చేయటమే కాక శరీర దృఢత్వాన్ని కూడా నాశనం చేస్తాయి.

 వేడికి గల కారణాలు (reasons for body heat)

  1. బిగుతుగా ఉండే దుస్తులు ధరించటం, ఈ దుస్తులు వేడిని కలిగించటం.
  2. జబ్బులు., ఉదాహరణకు జ్వరం రావటం లేదా ఇంఫెక్షన్స్
  3. థైరాయిడ్ సమస్య వల్ల శరీరంలోని వేడి పెరిగిపోవటం వల్ల శరీరం లోని వేడి పెరిగిపోతుంది.
  4. అధికంగా వ్యాయామం చేయటం. కొందరు ఎక్కువగా వ్యాయామం చేస్తారు..
  5. .అనారోగ్యాలు అలాగే కండరాల వైకల్యాలు కారణంగా వస్తాయి.
  6. కొన్ని మందులు, ఉత్తేజాన్నిచే కొకైన్ మొదలగునవి
  7. న్యూరో సంబధిత అసమానతలు కూడా శరీర వేడికి కారణమవుతాయి.
  8. అంతేకాక ఇతర కారణాలుగా సోరియాసిస్, సెలొరోసిస్, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఎక్జెమా ఈ జబ్బులు అధిక వేడి పెంచి అధిక చెమట పట్టేలా చేస్తాయి.


శరీరంలోని వేడిని ఎలా తొలగించుకోవాలి (how to reduce body heat)
1.  వేడి ప్రాంతాలకు దూరంగా ఉండాలి, స్పైసీ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.
2.  కొవ్వు పదార్ధాలను అలాగే వేపుని పదార్ధాలకు దూరంగా ఉండాలి.
3.  తక్కువ సోడియం కలిగిన పదార్ధాలను తింటే మంచిది.
4.  కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె లను వాడండి. వంటలలొ కూడా వేరుశనగ నూనె వంటివి మానేయ్యాలి
5.  రోజూ ఆహారంలో నట్స్ ఉపయొగించవద్దు. వారానికి 2-3 సార్లు మాత్రమే వాడాలి.
6.  దాదాపు శాఖాహార భోజనాన్నే వాడండి. మాంసాన్ని తక్కువగా వాడితే మంచిది. అదీ రెడ్ మట్టన్ వాడకాన్ని మానేయ్యాలి.

శరీరంలోని వేడిని తొలగించుకునేందుకు వాడాల్సినవి (foods to avoid body heat)

దానిమ్మ జ్యూస్

రోజూ ఉదయాన్నే దానిమా జ్యూస్ ఒక గ్లాస్ తాగండి. అలాగే ఈ జ్యూస్ లో ఆల్మండ్ ఆయిల్ కొన్ని చుక్కలు వేసుకుని త్రాగటం ఎన్తో మంచిది.

మంచినీరు

రోజూ మంచినీరు ఎక్కువగా తీసుకుంటే శరీరం లోని వేడి చాలా వరకూ పోతుంది.

గసగసాలు

గసగసాలు శరీరంలోని వేడిని తొలగిస్తాయి. కాకపోతే వీటిని మోతాదుకు మించి తీసుకోరాదు. అలాగే పిల్లలకు కూడా ఎక్కవగా ఇవ్వరాదు.

మెంతులు
మన ఇంట్లో ప్రతి ఆహారం లో భాగమే ఇది. ఈ మెంతులు అధిక వేడిని తీసివేసి శరీరాన్ని మాములు స్థితికి తెస్తాయి. ఒక టేబుల్ స్పూన్ మెంతుల్ని తీసుకుని తింటే చాలా మంచిది.

తేనె, పాలు
తేనె, పాలు కలిపి తగితే చాలా మంచిది. ఒక చల్లని పాలల్లో ఒక టేబుల్ స్పూన్ తేనె వేసుకుని త్రగటం వల్ల శరీరంలోని వేడి పోతుంది. ఇలా రోజూ చేయటం ఎంతో మంచిది.

గంధం, పాలు
గంధాన్ని తీసుకుని చల్లని నీరు లేదా చల్లని పాలల్లో కలిపి నుదుటికి రాసుకుంటే ఎంతో త్వరగా వేడి తగ్గిపోతుంది.

వెన్న, పాలు
ఒక గ్లాస్ లో పాలు తీసుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్లు వెన్న కలుపుకుని త్రాగితే ఎంతో మంచిది. ఇది శరీరంలోని వేడి తీసివేస్తుంది.

నిమ్మ రసం
నిమ్మరసం శరీరంలోని వేడిని తొలగించగలదు. రోజూ ఒక గ్లాస్ నిమ్మరసం త్రాగితే వేడి తొలగుతుంది.

అలోవేరా
అలోవేరా జ్యూస్ శరీరంలోని వేడి చక్కగా తొలగించగలదు. అంతేకాక అలోవేరా ఆకులని తీసుకుని దాని మధ్యలోని జెల్ ను బయటకు తీసి నుదుటికి రాసుకుంటే కూడా వేడి తగ్గుతుంది.

Thanks for reading How to reduce body heat ?

No comments:

Post a Comment