Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, August 27, 2020

Key judgment of the Supreme Court on degree examinations.


 Key judgment of the Supreme Court on degree examinations
డిగ్రీ పరీక్షలపై సుప్రీం కోర్టు కీలక తీర్పు.

డిగ్రీ పరీక్షలపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఫైనల్ ఇయర్ పరీక్షలు లేకుండా విద్యార్థులను ప్రమోట్ చేసే అవకాశం లేదని వ్యాఖ్యానించింది. అందుకే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పరీక్షల్ని వాయిదా వేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-UGC తో చర్చలు జరపాలని కోరింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని బెంచ్ ఈ కీలక తీర్పు వెల్లడించింది. పరీక్షల్ని వాయిదా వేయాలని స్టేట్ డిసాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీస్-SDMA నిర్ణయం సరైనదేనని, అయితే పరీక్షలు లేకుండా విద్యార్థులను పాస్ చేయాలని SDMA నిర్ణయించలేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అందుకే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పరీక్షల్ని వాయిదా వేసేందుకు యూజీసీని సంప్రదించాలని తెలిపింది.

అంతేకాదు... సెప్టెంబర్ 30 లోగా పరీక్షల్ని నిర్వహించాలని యూజీసీ సూచించిన గైడ్‌లైన్స్‌ని కొట్టిపారేయలేమని తెలిపింది. కాబట్టి డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు జరగాల్సిందే. అయితే ఎప్పటివరకు అన్నది తర్వాత నిర్ణయించొచ్చు. పరీక్షలు లేకుండా ఇంటర్నల్ మార్కుల ఆధారంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల్ని పాస్ చేసే అవకాశం లేదు.


రెండు నెలల క్రితం సెప్టెంబర్ 30 లోగా డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షల్ని నిర్వహించాలని విశ్వవిద్యాలయాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-UGC సర్క్యులర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి కొనసాగుతుండటంతో పరీక్షల్ని నిర్వహించాలని యూజీసీ సర్క్యులర్ జారీ చేయడంపై డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఈ పరీక్షల్ని రద్దు చేసి ఇంటర్నల్ అసెస్‌మెంట్ ద్వారా మార్కులు వేయాలంటూ విద్యార్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై పలుమార్లు వాదనలు విన్న సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది.

మరోవైపు యూజీసీ ఫైనల్ ఇయర్ పరీక్షల్ని వాయిదా వేయగలమని, రద్దు చేయలేమని, పరీక్షలు నిర్వహించకుండా డిగ్రీలు ఇవ్వలేమని యూజీసీ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా ఇప్పటికే సుప్రీం కోర్టుకు స్పష్టం చేశారు. ఇక పరీక్షల నిర్వహణకు సంబంధించిన స్టేటస్‌పై ఇప్పటికే 818 విశ్వవిద్యాలయాల నుంచి వివరాలను సేకరించింది యూజీసీ. అందులో 209 విశ్వవిద్యాలయాలు పరీక్షల్ని నిర్వహించాయి. 394 విశ్వవిద్యాలయాలు పరీక్షలు నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. 35 యూనివర్సిటీలు ఇంకా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్‌ నిర్వహించలేదు.

Thanks for reading Key judgment of the Supreme Court on degree examinations.

No comments:

Post a Comment