Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, August 6, 2020

Superb revenue with the post office franchise business


 Superb revenue with the post office franchise business
పోస్టాఫీస్ ఫ్రాంచైజీ బిజినెస్ తో అదిరే ఆదాయo
Superb revenue with the post office franchise business

1.ఏదైనా బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారా? మీరు పెద్దగా చదువుకోలేదా? అయితే మీకు అదిరిపోయే ఆప్షన్ అందుబాటులో ఉంది. పెద్దగా చదువుకోకపోయినా కూడా తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తోనే బిజినెస్ చేసే అవకాశం అందుబాటులో మీకోసం..



 2. ప్రస్తుతం దేశంలో 2 లక్షల వరకు పోస్టాఫీస్‌లు ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా చాలా ప్రాంతాల్లో పోస్టాఫీస్‌లు లేవు. పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఫ్రాంచైజీ ఇస్తోంది. అంటే నచ్చిన వారు పోస్టాఫీస్ ఓపెన్ చేసుకోవచ్చు. దీని ద్వారా మంచి రాబడి పొందొచ్చు. పోస్టాఫీస్ ఫ్రాంచైజీ తీసుకోవడానికి 8వ తరగతి చదివి ఉంటే సరిపోతుంది.పోస్టాఫీస్ ఫ్రాంచైజీ తీసుకోవాలని భావించే వారు కనీసం రూ.5,000 సెక్యూరిటీ డిపాజిట్ చేస్తే సరిపోతుంది.



3. ఇలా ఫ్రాంచైజీ తీసుకున్న వారు స్టాంప్, స్టేషనరీ, స్పీడ్ పోస్ట్, మనీ ఆర్డర్స్ వంటి వాటి ద్వారా రెగ్యులర్‌గా ఆదాయం పొందొచ్చు. ఇష్టం కలిగిన వారు పోస్టల్ డిపార్ట్‌మెంట్‌తో ఎంఓయూ కుదుర్చుకోవాలి.


4. www.indiapost.gov.in/VAS/DOP_PDFFiles/Franchise.pdf ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. కనీసం 18 ఏళ్లు కలిగి ఉండాలి. ఎవరైనా ఫ్రాంచైజీ తీసుకోవచ్చు. అంతేకాకుండా సంస్థలు, పాన్ షాప్, గ్రాసరీ, స్టేషనరీ షాప్, కిరాణ షాపు కలిగిన వారు కూడా ఫ్రాంచైజీ తీసుకోవచ్చు.ఫ్రాంచైజీ తీసుకునే వారికి పోస్టల్ డిపార్ట్‌మెంట్ శిక్షణ కూడా ఇస్తుంది. 


5. పోస్టాఫీస్‌లో పని చేసే వారు ఈ ఫ్రాంచైజీ తీసుకోవడానికి అనర్హులు. ఫ్రాంచైజీలు పోస్టల్ సర్వీసులు అందిచడం ద్వారా కమిషన్ పొందొచ్చు.

Thanks for reading Superb revenue with the post office franchise business

No comments:

Post a Comment