Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, September 28, 2020

Corona vaccine by early 2021!


Corona vaccine by early 2021!
2021 ఆరంభం నాటికి కరోనా వ్యాక్సిన్ !

కరోనా టీకా అభివృద్ధి కోసం పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ తెలిపారు. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


వ‌చ్చే ఏడాది తొలి త్రైమాసికం నాటికి క‌రోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ విశ్వాసం వ్యక్తం చేశారు. దిల్లీలో జ‌రిగిన భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)​ కార్యక్రమంలో పాల్గొన్న ఆయ‌న... టీకా అభివృద్ధి కోసం వేగంగా ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 3 టీకాల‌కు సంబంధించి ప్రయోగ పరీక్షలు జ‌రుగుతున్నట్లు చెప్పారు.

కొవిడ్‌-19 వ్యాక్సిన్ కోసం ఆన్‌లైన్ పోర్టల్‌ను కూడా ప్రారంభించిన‌ట్లు హర్షవర్ధన్ ​తెలిపారు. ఆన్‌లైన్ పోర్టల్‌కు వెళితే వ్యాక్సిన్‌ ట్రయ‌ల్స్ స‌మాచారం మొత్తం ల‌భ్యమ‌వుతుంద‌న్నారు. ఐసీఎంఆర్​ వందేళ్ల టైమ్‌లైన్‌ను విడుదల చేయ‌డం గ‌ర్వంగా ఉంద‌న్నారు. భావిత‌రాల శాస్త్రవేత్తల‌కు ఐసీఎంఆర్​ ప్రేర‌ణ‌గా నిలుస్తుంద‌ని హర్షవర్దన్‌ కొనియాడారు. టీకాకు సంబంధించి ఏ వివరాలు తెలుసుకోవాలనుకున్న ప్రజలు ఈ పోర్టల్‌ను సందర్శించాలని మంత్రి హర్షవర్థన్ తెలిపారు.
https://vaccine.icmr.org.in/

Thanks for reading Corona vaccine by early 2021!

No comments:

Post a Comment