1.4 లక్షల ఉద్యోగాలపై రైల్వే శాఖ కీలక ప్రకటన
దిల్లీ: రైల్వేలో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నిర్వహించాల్సిన పరీక్షలపై ఆ శాఖ కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా 1.40లక్షల ఉద్యోగాల నియామకానికి డిసెంబర్ 15 నుంచి పరీక్షల ప్రక్రియ ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్‌కుమార్ యాదవ్ దిల్లీలో మీడియాతో మాట్లాడారు. మూడు విభాగాల్లో 1.4 లక్షల ఉద్యోగాల నియామకానికి దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందన్నారు. రైల్వేలో మూడు కేటగిరీల కింద 1,40,640 ఉద్యోగాల కోసం రైల్వేశాఖ రెండేళ్ల క్రితం నోటిఫికేషన్ ఇవ్వగా.. దాదాపు 2.4 కోట్ల మందికి పైగా దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే, అభ్యర్థులందరికీ కంప్యూటర్ బేస్డ్ పరీక్ష (సీబీటీ) నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కరోనా నేపథ్యంలో ఆ పరీక్షలు వాయిదా పడ్డాయని వీకే యాదవ్ తెలిపారు. పూర్తి షెడ్యూల్‌ను అతి త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహిస్తుండటంతో వాటి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని కరోనా వల్ల నిలిచిపోయిన రైల్వే ఉద్యోగాల నియామక పరీక్షలను కూడా ప్రారంభించాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు.
రైల్వేశాఖ గతంలో జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం.. నాన్ టెక్నికల్ పాపులారిటీ కేటగిరీ (ఎన్‌టీపీసీ) కింద గార్డులు, ఆఫీస్ క్లర్క్‌లు, కమర్షియల్ క్లర్క్‌ల ఉద్యోగాలు 35,208; మినిస్టీరియల్ కేటగిరీ కింద స్టెనో తదితర పోస్టులు 1663; అలాగే, ట్రాక్ నిర్వహణ, పాయింట్‌మెన్ వంటి పోస్టులు 1,03,769 భర్తీ చేయనున్నారు.
भारतीय रेल में विभिन्न पदों की सभी तीन श्रेणियों के लिये भर्ती प्रक्रिया के आवेदनों की जांच पूरी की जा चुकी है।विभिन्न पदों पर भर्ती के लिये परीक्षाओं का आयोजन 15 दिसंबर से शुरु किया जायेगा। pic.twitter.com/22aDdhaApG— Ministry of Railways (@RailMinIndia) September 5, 2020
Thanks for reading Key announcement by Railway Department on 1.4 lakh jobs


No comments:
Post a Comment