Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, September 27, 2020

Main points in CAG report on CPS


Main points in CAG report on CPS

🌺సీపీఎస్ పై కాగ్ అక్షింతలు

🌺 ఏమిటీ అమలు విధానం ?

🌺రిటైరయ్యాక ఆదుకుంటుందనే గ్యారంటీ ఉందా?

🌺ఆంధ్రప్రదేశ్ లో రూ. 325 కోట్లు  జమ కాలేదు

➪ కొత్త పెన్షన్ స్కీంపై (సీపీఎస్) ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎంతో కాలంగా గగ్గోలు పెడుతున్నారు. అసలు  ఈ స్కీం అమలు విధానం సరిగా లేదని- రిటైర్ మెంట్ తర్వాత ఇది తమ జీవితాలకు అక్కరకు వస్తుందన్న భరోసా లేదని ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాన్ ఖాతాలు సరిగా  తెరవడం లేదని- తమ జీతాలు నుంచి కోత కోసిన సొమ్ములు  సరిగా జమ చేయడం లేదని ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. సరిగ్గా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ అత్యున్నత ఆడిటింగ్ సంస్థ కాగ్ సైతం ఇవే విషయాలను తేల్చి చెప్పింది.

➪ 2004లో కేంద్ర ప్రభుత్వం మొదట, ఆ తర్వాత మరికొన్ని రాష్ర్టాలు పెన్షన్ స్కీంను అమల్లోకి తీసుకువచ్చాయి. దాదాపు 15 సంవత్సరాలుగా  ఇది అమల్లో ఉంది. ఇప్పటీకీ నేషనల్ పెన్షన్  స్కీం సరిగా గాడిన పడ లేదని కంట్రోలర్ అండ్  ఆడిటర్ జనరల్ నివేదిక తేల్చి చెప్పింది.

➪ 2004 జవనరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన  ఈ పెన్షన్ స్కీం పరిధిలోకి 58.01 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు  వస్తారని పేర్కొంది. కాగ్  తన పరిశీలనకు మచ్చుకు కొన్ని అంశాలను ఎంచుకుని లోతుగా పరిశీలిస్తుంది.

➪ 7 రాష్ర్టాలు, 2  కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరిశీలన

సీపీఎస్ (న్యూ పెన్షన్ స్కీం) అమలు ప్రారంభమైన తర్వాత2004 జనవరి 1 నుంచి 2018 మార్చి 31 వరకు ఇది అమలైన తీరుపై  ఈ అధ్యయనం చేసినట్లు కాగ్ పేర్కొంది. 2018 అక్టోబరు నుంచి 2019 జనవరి మధ్య వీరు అధ్యయనం జరిపి తాజాగా నివేదిక ఇచ్చారు. పార్లమెంటుకు ఇది సమర్పించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ర్ట, ఉత్తరాఖండ్, రాజస్థాన్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ తో పాటు  దిల్లీ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ సీపీఎస్ అమలు తీరును  అధ్యయనం చేసినట్లు కాగ్ పేర్కొంది. ప్లానింగ్, అమలు తీరు, పర్యవేక్షణ అనే  మూడు విభాగాలుగా  ఈ స్కీంను  కాగ్  అధ్యయనం చేసి ఏం చేస్తే  బాగుంటుందో ప్రభుత్వానికి రికమండేషన్లు కూడా ఇచ్చింది.

➪ 15 ఏళ్లయినా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమిటోతేల్చలేదు.

ఈ స్కీం  ప్రారంభించి 15  ఏళ్లు అయిన తర్వాత కూడా పెన్షన్ స్కీం సర్వీసు నిబంధనలు ఏమిటో తేల్చలేదని కాగ్ తప్పు పట్టింది. ఈ స్కీం పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు పదవీవిరమణ ప్రయోజనాలు ఏమిటో కూడా తేల్చి చెప్పలేకపోయారని కాగ్ ఆక్షేపించింది.

➪ ఉద్యోగులకు అందరికీ ఇది వర్తిస్తుందా?

అసలు ఈ పథకం ఉద్యోగులకు అందరికీ వర్తిస్తుందా లేదా అనే విషయంలో చాలా చోట్ల ప్రభుత్వ యంత్రాంగం స్పష్టంగా చెప్పలేకపోతోందని కాగ్ తప్పు  పట్టింది. ఆంద్రప్రదేశ్ లో సైతం దీని అమలు పూర్తి లోపాలతో నిండిపోయిందని సోదాహరణంగా వివరించింది.

➪ ఈ పెన్షన్ సెటిల్ మెంట్ కు సంబంధించి ఎన్ని ఫిర్యాదులు వస్తున్నా వాటిని సరిగా పరిష్కరించడం లేదని కాగ్ పేర్కొంది. ఆ ఫిర్యాదులన్నీ ఏడాది పైగా పరిష్కారం కాకుండా ఉండిపోయాయని ప్రస్తావించింది. ఏపీ ఫిర్యాదులను ప్రస్తావించింది.

➪ ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల జీతాల నుంచి పెన్షన్ స్కీం కాంట్రిబ్యూషన్ మినహాయించుకున్నా ఏకంగా రూ. 325 కోట్లు ట్రస్టీ బ్యాంకుకు జమ చేయలేదని కాగ్ ఎత్తి చూపింది. కాగ్ పరిశీలించిన  7  రాష్ర్టాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం  రూ.793.04  కోట్లు ట్రస్టీ బ్యాంకుకు జమ కాలేదు.

➪ ప్రాన్ నంబరు జారీ చేయడంలో చాలా ఆలస్యమవుతోంది. పైగా వారి నుంచి తొలి కాంట్రిబ్యూషన్ మినహాయించి  ట్రస్టీ బ్యాంకుకు జమ చేసే విషయంలోను  చాలా ఆలస్యం జరుగుతోందని తప్పు పట్టింది.

➪ ఆంధ్రప్రదేశ్ లో సరైన సమయంలో జమ చేయలేదేం?

ఆంధ్రప్రదేశ్ లో రూ.325.06 కోట్లు  ట్రస్టీ బ్యాంకులో జమ చేయలేదు. 2018  మార్చి వరకు ఉన్న పరిస్థితి ఇది.

ఎన్ జీ రంగా వ్యవసాయవిశ్వవిద్యాలయం రూ.22.55 కోట్లు మినహాయించినా రూ. 5.08 కోట్లు ట్రస్టీ బ్యాంకుకు జమ చేయలేదు.

బోర్డు ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ రూ.19.72 లక్షల రూపాయలు ట్రస్టీ బ్యాంకుకు జమ చేయలేదు. (పేజీ 49, పట్టిక 4.19 కాగ్ రిపోర్టు)

Thanks for reading Main points in CAG report on CPS

No comments:

Post a Comment