On the occasion of World Heart Day
గుప్పెడంత గుండె.. పదిలమేనా..?
ప్రపంచ హృదయ దినోత్సవం (వరల్డ్ హార్ట్ డే)
సందర్భంగా...
ప్రపంచ హృదయ దినోత్సవం (వరల్డ్ హార్ట్ డే) ను ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబరు 29 న జరుపుకుంటారు. ఈ దినోత్సవమును ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ లు సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఈ రోజున ప్రతి ఒక్కరు గుండె జబ్బులపై అవగాహన పెంచుకొని గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకొంటారు. గుండె జబ్బుల గురించి ప్రపంచ ప్రజలందరికి తెలియజేస్తూ, అవి రాకుండా తీసుకోవలసిన ముందుజాగ్రత్తలను తెలియజేయుటే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశము.
హృదయ సంబంధ వ్యాధులను సైలెంట్ కిల్లర్స్ గా పేర్కొంటారు .కాన్సర్ కన్నా ఎక్కువ మరణాలు గుండె వ్యాధుల వల్ల కలుగుతున్నాయంటే ఎంత ప్రమాదకరమో అర్ధముచేసుకోవచ్చు . మిగతా వ్యాధులలో మాదిరిగా స్పష్టమైన సంకేతాలు కనబడినా... అవగాహనా లొపము వల్ల వాటిని హృదయసంబంధ సంస్యలుగా గుర్తించడం లేదు . గుండె జబ్బు' అంటే మనకు గుండె పోటు ఒక్కటే గుర్తుకొస్తుంది. గుండెపోటు అతి పెద్ద సమస్యేగానీ గానీ వాస్తవానికి గుండెకు సంబంధించి అదొక్కటే కాదు, మరికొన్ని కీలక సమస్యలూ ఉన్నాయి.
●గుండెకు ఆపరేషన్ అంటే మనకు ఛాతీ మొత్తం తెరచి చేసే బైపాస్ ఆపరేషన్ ఒక్కటే జ్ఞప్తికొస్తుంది. కానీ వాస్తవానికి అత్యాధునిక విజ్ఞానం విస్తరిస్తున్న కొద్దీ ఛాతీ తెరవాల్సిన అవసరం లేకుండానే బైపాస్ సర్జరీని ముగించే విధానాలూ మన ముందుకొస్తున్నాయి.
గుండెలో విద్యుత్తు!
మన గుండె ఒక పంపులా పనిచేస్తూ శరీరంలోని అన్ని భాగాలకు రక్త సరఫరా చేస్తుంటుంది. మామూలు పంపులు పని చేయటానికి విద్యుత్తు అవసరమైనట్టే మన గుండె నిరంతరం కొట్టుకోవటానికి కూడా శక్తి కావాలి. ఇందుకు గుండె పైగదుల్లో కుడి వైపున సైనో ఏట్రియల్ నోడ్ (ఎస్‌ఏ నోడ్), ఏట్రియో వెంట్రిక్యులార్ నోడ్ (ఏవీ నోడ్) అనే కేంద్రాలుంటాయి. వీటి నుంచి నిరంతరం విద్యుత్ ప్రేరేపణలు వెలువడుతుంటాయి. 'ఎస్‌ఏ నోడ్' నుంచి వెలవడే విద్యుత్ ప్రేరణలు గుండె పైగదులైన కుడి కర్ణిక నుంచి ఎడమ కర్ణికకు చేరుకొని.. అవి రెండూ మూసుకునేలా చేస్తాయి. దాంతో రక్తం వేగంగా నెట్టినట్టుగా కింది గదులైన జఠరికల్లోకి వస్తుంది. అప్పుడు 'ఏవీ నోడ్' నుంచి వెలువడే విద్యుత్ ప్రేరణలు జఠరికలు మూసుకునేలా చేస్తాయి. ఇదంతా ఒక క్రమపద్ధతిలో, లయాత్మకంగా, నిరంతరాయంగా జరుగుతుండటం వల్ల రక్తం ధమనుల్లోకి పంప్ అవుతుంది. అయితే కొన్నిసార్లు రకరకాల సమస్యల కారణంగా ఈ విద్యుత్ ప్రేరణలు గతితప్పి, గుండె లయ దెబ్బతినొచ్చు. దీన్నే 'అరిత్మియాసిస్' అంటారు. దీంతో గుండె కొట్టుకునే వేగం క్రమంగా తగ్గటం(బ్రాడీకార్డియా), అనూహ్యంగా పెరగటం (టెకీకార్డియా) వంటి పరిస్థితులు తలెత్తవచ్చు.
వేగం తగ్గితే?
* రక్త సరఫరా తగ్గటం వల్ల మెదడుకు తగినంత రక్తం అందదు.
* శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉంటుంది.
* అలసట, నిస్సత్తువగా అనిపిస్తుంది.
* నాడీ చాలా నెమ్మదిగా కొట్టుకుంటుంది.
వేగం పెరిగితే?
* గుండె దడ వస్తుంది.
* పూర్తి సామర్థ్యంతో గుండె కొట్టుకోలేకపోవటం వల్ల రక్తం అన్ని అవయవాలకు చేరదు. ఫలితంగా విపరీతమైన ఆయాసం వస్తుంది.
* కొన్నిసార్లు గుండెలో కొద్దిపాటి నొప్పిగా కూడా ఉండొచ్చు.
* తల చాలా తేలికగా ఉన్నట్టు, తిరిగినట్టు అనిపిస్తుంది.
* స్పృహ తప్పటం వంటివీ జరగొచ్చు.
నిర్ధారణ పరీక్షలు
* ఈసీజీ
* టూడీ ఎకో
* హోల్టర్ పరీక్ష (24 గంటల పాటు గుండె పనితీరుని తెలుసుకోవటానికి చేసే ప్రత్యేక ఈసీజీ పరీక్ష)
* అవసరమైతే 'ఎలక్ట్రో ఫిజియాలజీ' పరీక్షనూ చేయాల్సి ఉంటుంది.
చికిత్స
గుండె వేగం తగ్గినపుడు ఛాతీ పైభాగంలో చర్మం కింద 'పేస్ మేకర్' అమర్చి సరిదిద్దుతారు. వీటిల్లో సింగిల్ ఛాంబర్, డబుల్ ఛాంబర్ పేస్‌మేకర్లతో పాటు అత్యాధునికమైన ట్రిపుల్ ఛాంబర్ పేస్‌మేకర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. గుండె వేగం పెరిగినప్పుడు బీటా బ్లాకర్స్, గుండె లయను క్రమబద్ధీకరించే మందులు ఇస్తారు.
ఐసీడీ: గుండె చాలా వేగంగా కొట్టుకోవటం అనేది ఒకోసారి గుండె ఆగిపోవటానికి దారితీయొచ్చు. ఇలాంటి సమయాల్లో గుండెకు చిన్నగా విద్యుత్ షాక్ ఇచ్చి దాన్ని గాడిలో పెడతారు. ఇది ఆసుపత్రిలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. ఆసుపత్రిలో లేని సమయాల్లో అలాంటి పరిస్థితి వస్తే ఉపయోగపడేందుకు 'ఇంప్లాంటేబుల్ కార్డియోవెర్టర్ డిఫిబ్రిలేటర్ (ఐసీడీ)'ని అమరుస్తారు. ఇది గుండె ఆగిపోవటానికి దారితీసే ప్రమాదకరమైన స్పందనని ముందే గుర్తించి ఒకసారి షాక్‌ను వెలువరిస్తుంది. దీంతో గుండె లయ మళ్లీ గాడిలో పడుతుంది.
రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్: గుండెకు విద్యుత్‌ను సరఫరా చేసే మార్గాల్లో అడ్డంకులు ఏర్పడితే 'రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్' చికిత్స ఉపయోగపడుతుంది. ఇందులో రక్తనాళం ద్వారా సన్నటి తీగలను గుండెలోకి పంపించి తరంగాల సాయంతో... గుండె లయ తప్పటానికి కారణమయ్యే సంకేతాలను ధ్వంసం చేస్తారు.
చిన్నకోత!
హృదయం చాలా సున్నితమైనది. పైగా అది నిరంతరాయంగా పని చేస్తూనే ఉంటుంది! అందుకే గుండెకు ఆపరేషన్లు చెయ్యటమన్నది చరిత్రలో కాస్త ఆలస్యంగానే మొదలైంది. ఆపరేషన్ సమయంలో గుండెను ఆపితే... ఆ సమయంలో రక్తసరఫరా ఎలా? 1953లో గుండె పనిని కృత్రిమంగా బయటి నుంచి చేస్తుండే 'హార్ట్-లంగ్ మెషీన్'ను రూపొందించారు. దీంతో 'ఓపెన్ హార్ట్ సర్జరీ' అన్నది సురక్షితంగా తయారైంది. అయితే ఇలా ఆపరేషన్ చేస్తే- ఎదరొమ్ము ఎముకల్ని కట్‌చేసి, ఛాతీ మీద 10-12 అంగుళాల కోత పెట్టక తప్పదు. ఈ ఛాతీ ఎముక తిరిగి అతుక్కోవటానికి, ఆ గాయం మానటానికి ఎక్కువ సమయమే పడుతుంది. వారంపది రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాలి, ఆ తర్వాత 3 నెలల పాటు ఇంట్లో పూర్తి విశ్రాంతి తప్పదు. పైగా ఛాతీని తెరచి ఆపరేషన్ చేసేటప్పుడు చాలామందికి కృత్రిమంగా 'హార్ట్-లంగ్ మెషీన్' వాడటం వల్ల రక్తస్రావం, రక్తం ఎక్కువగా ఎక్కించాల్సి రావటం వంటి ఇబ్బందులూ ఉంటాయి. ఇన్‌ఫెక్షన్లు, పక్షవాతం వంటివి వచ్చే అవకాశమూ ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు చిన్నకోతతో గుండె ఆపరేషన్ పూర్తిచేసే 'కీ హోల్ సర్జరీ' ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఛాతీ ఎముకలను కట్‌చేసి తెరవాల్సిన పనిలేకుండా చిన్న రంధ్రాన్ని మాత్రమే చేసి.. థొరాకోస్కోపీ సాయంతో బైపాస్ సర్జరీ, కవాట మార్పిడి వంటివి చేయొచ్చు. పెద్దకోత ఉండదు కాబట్టి చాలా త్వరగా కోలుకుంటారు!
లాభాలేమిటి?
గుండె కొట్టుకోవటాన్ని ఆపాల్సిన పని లేదు కాబట్టి కృత్రిమమైన 'హార్ట్-లంగ్ మెషీన్'కు సంబంధించిన దుష్ప్రభావాలుండవు. కీహోల్ సర్జరీలో రక్తస్రావం తక్కువగా ఉంటుంది కాబట్టి రక్తం ఎక్కించాల్సిన అవసరం రాకపోవచ్చు. మూత్రపిండాలు దెబ్బతినటం, పక్షవాతం వంటివి వచ్చే అవకాశం తక్కువ. కోత చిన్నగా ఉంటుంది కాబట్టి గాయం త్వరగా మానిపోతుంది. ఆసుపత్రిలో మూడు, నాలుగు రోజులుంటే సరిపోతుంది. అనంతరం రెండు, మూడు వారాలకే పనులకు వెళ్లిపోవచ్చు. పైగా నొప్పి, ఇన్‌ఫెక్షన్ ముప్పు అంతగా ఉండదు. ఛాతీ మీద పెద్ద మచ్చా ఉండదు.
● గుండెలోని రక్తనాళాల్లో రెండు, మూడు చోట్ల పూడికలు ఏర్పడినా బైపాస్ సర్జరీ చేయటానికీ ఈ 'కీ హోల్ సర్జరీ' ఉపయోగపడుతుంది.
● కవాటాల మార్పిడి, పుట్టుకతో వచ్చే గుండె లోపాలను సవరించటానికీ తోడ్పడుతుంది.
రక్తనాళానికీ కొత్త పద్ధతి
మామూలుగా బైపాస్ సర్జరీలో అతికేందుకు తొడ దగ్గర నుంచి రక్తనాళాన్ని తీసుకుంటారు. సాధారణంగా ఎంత పొడుగు రక్తనాళం అవసరమైతే అంత పొడుగు కోత పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎండోస్కోపిక్ విధానంలో చిన్న రంధ్రం ద్వారానే మొత్తం రక్తనాళాన్ని తీసే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. 'ఎండోస్కోపిక్ వీన్ హార్వెస్టింగ్' అనే ఈ పద్ధతిలో పెద్ద గాయం అనేది ఉండదు. రక్తస్రావం, నొప్పి కూడా తక్కువే. ముఖ్యంగా ఇది వూబకాయలు, మధుమేహులు, స్త్రీలకు ఎంతో ఉపయోగపడుతుంది.
నివారణ మార్గాలు
గుండెలయ తప్పే ముప్పు బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించటం అత్యవసరం.
● పొగ తాగటం మానెయ్యాలి
●ఒకేచోట కదలకుండా కూచోవటం తగదు
● సమతులాహారం తీసుకోవాలి
● కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి
●రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి
●బరువు పెరగకుండా చూసుకోవాలి
●క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
●మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి
●తగినంత నిద్ర పోవాలి
●ఒత్తిడిని దరిజేరనీయరాదు
●ప్రపంచ వ్యాప్తంగా ఏటా సుమారు 1.71 కోట్ల మంది గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్నారు. వీరిలో 80 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందినవారే!
●మన దేశంలో చిన్నవయసులోనే ముఖ్యంగా 30, 40 ల్లోనే ఎంతోమంది గుండెపోటు బారిన పడుతున్నారు.
భయపెట్టే రంధ్రాలు
బిడ్డకు గుండెలో రంధ్రం ఉందంటే తల్లిదండ్రులు అనుభవించే వేదనకు అంతుండదు. అయితే అన్ని రంధ్రాలూ భయపడాల్సినవి కావు. కొన్నింటికే చికిత్స అవసరమవుతుంది. అందుకే వీటి గురించి అవగాహన పెంచుకోవటం అవసరం.
ప్రతి 1,000 మంది శిశువుల్లో సుమారు 8 మందిలో పుట్టుకతో గుండె లోపాలు కనబడుతుంటాయి. చాలాసార్లు ఎందుకొచ్చిందో చెప్పటం కష్టం. గర్భిణికి రుబెల్లా వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్ సోకటం, లేదా జన్యుపరమైన కారణాల వల్ల శిశువుల్లో ఈ సమస్య రావచ్చు.
సహజం!
పిల్లలందరికీ పుట్టుకతో గుండెలో పైగదుల మధ్య ఒక రంధ్రంలాంటి మార్గం ఉంటుంది. ఇది సహజం. తల్లికడుపులో పెరుగుతున్నప్పుడు బిడ్డ వూపిరితిత్తులు పనిచేయవు. కాబట్టి అప్పుడు గుండెలోని ఈ మార్గమే (ఫొరామెన్ ఒవేల్) రక్తం బిడ్డ వూపిరితిత్తుల్లోకి వెళ్లకుండా గుండె ద్వారానే ప్రసరణ జరిగేలా చూస్తుంది. శిశువు పుట్టిన తర్వాత శ్వాస తీసుకోవటం మొదలెట్టగానే ఈ ఖాళీ మూసుకుపోవటం ప్రారంభిస్తుంది. కొంతమందిలో కొంత ఆలస్యంగా మూసుకోవచ్చు. మొత్తానికి ఈ రంధ్రం గురించి పెద్దగా ఆందోళన అక్కర్లేదు. ఒకవేళ ఈ రంధ్రం మూసుకోకుండా అలాగే ఉండిపోయినా, లేక కింది గదుల మధ్య గోడకు రంధ్రం ఉన్నా, కర్ణికకూ-జఠరికకూ మధ్య రంధ్రాలున్నా 'గుండెలో రంధ్రం' సమస్యగా పరిగణించాల్సి ఉంటుంది.
ఏఎస్‌డీ
గుండెలో పైగదులైన కర్ణికల మధ్య రంధ్రం ఉంటే దాన్ని ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ (ఏఎస్‌డీ) అంటారు. పుట్టుకతో సహజంగానే ఉండే రంధ్రం పూడకపోవటం ఒకటైతే ఇదే గోడకు వేర్వేరు రంధ్రాలు కూడా ఉండొచ్చు. ఎడమ భాగంలో ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల ఈ రంధ్రం గుండా రక్తం ఎడమ నుంచి కుడి వైపు నెట్టుకొస్తుంది. ఫలితంగా కుడి కర్ణిక పెద్దగా మారుతుంది. దీనివల్ల శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, గుండె దడ, ఎదుగుదల లోపించటం వంటి లక్షణాలు మొదలవుతాయి. పుట్టుకతోనే రంధ్రం ఉన్నప్పటికీ ఈ లక్షణాలు చిన్నతనం నుంచే కనిపించాలనేం లేదు. కుడి కర్ణిక పెద్దగా అవుతుండటం వల్ల వయసు పెరుగుతున్నకొద్దీ ఇబ్బందులు మొదలవుతాయి. సాధారణంగా సుమారు 40 శాతం మందికి ఈ రంధ్రాలు రెండేళ్ల వయసు వచ్చేసరికి వాటికవే మూసుకుపోతాయి. కానీ రంధ్రం మూసుకుపోకుండా కుడి పైగది పెద్దగా అవుతూ తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడితే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. గతంలో దీనికి ఛాతీని తెరచి ఆపరేషన్ చేసేవారు. ఇప్పుడు రక్తనాళాల ద్వారా సన్నటి గొట్టం పంపి, రంధ్రాన్ని మూసేసే చికిత్సలూ అందుబాటులోకి వచ్చాయి. వీటిని చిన్నవయసులోనే చేస్తే పెద్దగా అయిన గుండె 4-6 నెలల్లోనే తిరిగి మామూలు సైజుకు వచ్చేస్తుంది.
వీఎస్‌డీ
గుండె కింది గదులైన జఠరికల మధ్య గోడలో రంధ్రం ఏర్పడటాన్ని వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ (వీఎస్‌డీ) అంటారు. సాధారణంగా ఎడమ జఠరిక మంచి రక్తాన్ని శరీర భాగాలకు పంప్ చేస్తుంటుంది. కానీ జఠరికల మధ్య రంధ్రం ఉన్నప్పుడు ఆ రక్తం కుడి జఠరికలోకి, అక్కడి నుంచి వూపిరితిత్తుల్లోకి తోసుకొస్తుంటుంది. దీంతో వూపిరితిత్తుల్లోని రక్త నాళాలు దెబ్బతింటాయి. ఈ రంధ్రం కారణంగా జఠరికలు బలంగా పనిచేస్తూ.. క్రమేపీ గుండె పెద్దగా అవటం ప్రారంభిస్తుంది. దీనివల్ల: ఎగశ్వాస, చర్మం పాలిపోవటం, నాడి వేగంగాకొట్టుకోవటం, తరచూ వూపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, ఎదుగుదల సరిగా లేకపోవటం వంటి లక్షణాలు కనబడతాయి. చాలామందిలో ఈ రంధ్రాలు 7 ఏళ్లు వచ్చేసరికి వాటికవే మూసుకుపోతాయి. కొందరిలో ఇవి పూర్తిగా మూసుకుపోకపోయినా పెద్దగా ప్రమాదం కలిగించని చిన్న రంధ్రాలుగా మారుతాయి. ఒకవేళ రంధ్రం పెద్దగా ఉంటే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. తాత్కాలిక ఉపశమనం కోసం వూపిరితిత్తులకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనికి బ్యాండ్ బిగిస్తారు. దీంతో వూపిరితిత్తుల్లోకి రక్త సరఫరా తగ్గి, వాటిపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. పిల్లలు కొంచెం పెద్దయ్యాక ఆ బ్యాండ్‌ని తొలగించి, ఛాతీని తెరచి రంధ్రాన్ని మూసేస్తారు.
● కొన్నిసార్లు గుండె గోడల మధ్య రకరకాలుగా పెద్ద రంధ్రాలూ కూడా పడుతుంటాయి. వీటినే 'కెనాల్ డిఫెక్ట్స్' అంటారు. ఇటువంటి రంధ్రాలున్న పిల్లలు శ్వాస సరిగా తీసుకోలేరు. ఎదుగుదల కూడా లోపిస్తుంది. దీనిని పిల్లలు పుట్టిన తొలి నెలల్లో ఆపరేషన్ చేసి సరిచేస్తారు.
The best way to keep your heart in a healthy state is by eating right, sleeping right and not taking stress. Sending my best wishes on World Heart Day to you
Your life will keep on beating until your healthy heart keeps on beating. Happy World Heart Day 2024
If you have a healthy heart, you can enjoy a happy and long life. So encourage your loved ones to go for heart checkup this World Heart Day for a smooth life ahead
On this World Heart Day, let’s make sure that each and every individual knows how important it is to take proper care of the Heart. Happy World Heart Day 2024
Let us celebrate World Heart Day by going for heart checkups and promising ourselves to eat healthy and live happy. Best wishes on World Heart Day to you
Keep smiling and stay happy, that’s all to keep your heart healthy. Happy World Heart Day 2024
Thanks for reading On the occasion of World Heart Day
No comments:
Post a Comment