Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, September 8, 2020

PAN card: If you make this mistake in the case of PAN card, you will be fined Rs. 10,000 and How to surrender your second PAN card?


 PAN card : పాన్ కార్డ్ విషయంలో ఈ తప్పు చేస్తే రూ .10,000 ఫైన్

పాన్ కార్డ్... ఈ పర్మనెంట్ అకౌంట్ నెంబర్-PAN ఆర్థిక లావాదేవీలకు ముఖ్యమైన డాక్యుమెంట్. అంతేకాదు... ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా పాన్ నెంబర్ తప్పనిసరి. ఒకరి పాన్ నెంబర్‌తో వారి ఆర్థిక లావాదేవీల చరిత్ర మొత్తం తెలిసిపోతుంది. పాన్ నెంబర్ ఉంటే చాలు ఏఏ బ్యాంకుల్లో అకౌంట్స్ ఉన్నాయి, ఎన్ని క్రెడిట్ కార్డులున్నాయి, ఎన్ని లోన్లు తీసుకున్నారు, ఏఏ రకాల రుణాలు తీసుకున్నారు, ఎన్ని రుణాలు పూర్తిగా చెల్లించారు, పెద్దపెద్ద లావాదేవీలు ఏమేమీ చేశారు... ఇలా ఆర్థిక వ్యవహారాల చిట్టా మొత్తం ప్రభుత్వం సులువుగా తెలుసుకుంటుంది. అందుకే పాన్ కార్డ్ విషయంలో ఏవైనా తప్పులు చేస్తే తిప్పలు తప్పవు. భారీగా జరిమానాలు కూడా చెల్లించాల్సి వస్తుంది.
ఓ తప్పు చేస్తే రూ.10,000 ఫైన్ చెల్లించక తప్పదు. మరి ఆ తప్పేంటో, మీరూ ఆ తప్పు చేయకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

రెండుసార్లు పాన్ కార్డులు తీసుకున్నవారు చాలామంది ఉన్నారు. గతంలో ఇది సాధ్యమయ్యేది. అయితే ఆర్థిక మోసాలకు పాల్పడాలనుకునేవారు ఇలా రెండు పాన్ కార్డులు తీసుకున్న సందర్భాలు ఎక్కువ. మరికొందరైతే ఒక పాన్ కార్డు పోయిందమని మరో కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. మీ పాన్ కార్డు పోతే మళ్లీ కొత్త పాన్ కార్డుకు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. డూప్లికేట్ పాన్ కార్డ్ తీసుకుంటే చాలు. పాత నెంబర్‌పైనే డూప్లికేట్ పాన్ కార్డ్ వస్తుంది. రెండు పాన్ కార్డులు మెయింటైన్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం రెండు పాన్ కార్డులు మెయింటైన్ చేస్తే రూ.10,000 జరిమానా చెల్లించక తప్పదు. కాబట్టి మీ దగ్గర పొరపాటున రెండు పాన్ కార్డులు ఉంటే ఒక కార్డును ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు సరెండర్ చేయాలి. మీపై చట్టపరమైన చర్యలు తీసుకోకముందే వీలైనంత త్వరగా కార్డు సరెండర్ చేయాలి. 

మీ రెండు పాన్ కార్డును ఎలా సరెండర్ చేయాలో తెలుసుకోండి


ముందుగా NSDL వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.అందులో Application Type డ్రాప్ డౌన్‌లో Changes or Correction in existing PAN Data/Reprint of PAN Card ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
వివరాలన్నీ పూర్తిగా ఎంటర్ చేసి Submit పైన క్లిక్ చేయండి.
ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత టోకెన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ టోకెన్ నెంబర్ మీ ఇమెయిల్ ఐడీకి వస్తుంది.
ఆ తర్వాత Continue with PAN Application Form బటన్ పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
అందులో స్కాన్ చేసిన ఇమేజెస్ ఇ-సైన్ ద్వారా సబ్మిట్ చేయాలి.
ఆ తర్వాత మీ దగ్గర ఉండాలనుకుంటున్న పాన్ నెంబర్‌ను వివరించాలి.
ఆ తర్వాత మీ వ్యక్తిగత వివరాలు, కాంటాక్ట్ డీటైల్స్ ఎంటర్ చేయాలి.
చివరి పేజీలో మీ దగ్గర అదనంగా ఉన్న, సరెండర్ చేయాలనుకున్న పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత మీ ఐడెంటిటీ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి.
మీ ఫోటో, సంతకం, ఇతర డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.

Thanks for reading PAN card: If you make this mistake in the case of PAN card, you will be fined Rs. 10,000 and How to surrender your second PAN card?

No comments:

Post a Comment