Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, September 13, 2020

Pancha Sutras for forgetfulness


మతిమరుపు మాయం అవ్వాలంటే పంచ సూత్రాలు

చాలా మంది నోట మర్చిపోతున్నాను అనే మాట తరచూ వినిపిస్తుంది. అప్పుడే విన్న విషయాలను మర్చిపోవటం,వస్తువులు పెట్టిన చోటు మర్చిపోవటం వంటివి చిన్నవిగా కనిపించినా అవి విసుగుని,చికాకును కలిగిస్తాయి. ఈ సమస్యను అదికమించటానికి పంచ సూత్రాల గురించి తెలుసుకుందాము.

చురుకుగా ఉండుట
శారీరకంగా చురుకుగా ఉంటే ఎంత ఆరోగ్యంగా ఉంటామో,మానసికంగా ఆరోగ్యంగా ఉంటే మెదడు అంత చురుకుగా పనిచేస్తుంది. మతిమరుపును దూరం చేస్తుంది. న్యూస్ పేపర్స్,వీక్లీ లలో వచ్చే పజిల్స్ పూర్తి చేయుట వలన మెదడు చురుకుగా ఉంటుంది. వ్యాయామం మిమ్మల్ని శారీరకంగా,మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. మీకు కనుక వాహనం నడపటం వస్తే కొత్త కొత్త దారుల గుండా ప్రయాణం చేయండి.
అలా వెళ్ళుతూ దారులను గుర్తూ పెట్టుకోవటం వలన కూడా మెదడుకు వ్యాయామం అవుతుంది.

సామజిక సంబందాలు
సామజిక సంబందాలు పెంపొందిచు కోవటం వలన ఒంటరితనము నుంచే కాకుండా ఒత్తిడి నుండి కూడా తప్పించుకోవచ్చు. ఒంటరితనం,ఒత్తిడి అనేవి మతిమరుపును పెంచుతాయి. వీటి బారిన పడకుండా ఉండాలంటే సామజిక సంబందాలను పెంపొందిచు కోవటం ఒక మార్గం అని చెప్పవచ్చు. ఒంటరితనం అనిపించినప్పుడు స్నేహితులను లేదా ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతూ ఉండాలి. లేనిచో మీరే వెళ్లి వారితో సరదాగా గడపవచ్చు. ఇలా చేయుట వలన శారీరకంగా,మానసికంగా రీచార్జ్ అవుతారు.

డైరీ రాయటం
డైరీ రాయటం అన్నది అలవాటు చేసుకోవటం ప్రారంభించండి. మీ పాత జ్ఞాపకాలు తీపి గుర్తుగా ఉంటాయి. డైరీ మీ మతిమరుపును పోగొడుతుంది. ఎలాగంటే.. ఉదాహరణకు వారం రోజుల తర్వాత మీరో ఒక ముఖ్యమైన పని చేయాలి. దాన్ని మీ డైరిలోను,క్యాలెండర్ లోను గుర్తు పెట్టుకోండి. ప్రతి రోజు దాన్ని చూస్తూ ఉండండి. ఇక ఆ పనిని మర్చిపోకుండా ఉంటారు.

ఏకాగ్రత
ఒకేసారి పది విషయాలను గుర్తు పెట్టుకొనే ప్రయత్నం చేయకండి. అసలుకే మోసం రావచ్చు. ఏ పని చేసిన ఏకాగ్రతతో చేయటం అలవాటు చేసుకోండి.

ఆహారం
మంచి ఆహారం ఆరోగ్యానికే కాదు జ్ఞాపకశక్తిని కూడా రెట్టింపు చేస్తుంది. తాజా పండ్లు,కూరగాయలతో పాటు తృణ ధాన్యాలు,తక్కువ కొవ్వు ఉన్న ప్రోటీన్స్ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. కొబ్బరి నీళ్ళు ఎక్కువగా త్రాగితే మంచిది. అలాని మరి ఎక్కువగా త్రాగకకూడదు. రోజుకి పది నుంచి పదకొండు గ్లాసుల నీరు త్రాగితే మంచిది.

Thanks for reading Pancha Sutras for forgetfulness

No comments:

Post a Comment