Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, September 6, 2020

Rank-wise masks


                    ఏ మాస్కుకు యే ర్యాంక్
ప్రపంచంలో ఇప్పుడు మోస్ట్‌ వాంటెడ్‌... మాస్క్‌ అది లేకుండా బయటికెళ్లే ధైర్యం ఎవరికీ లేదిప్పుడు. అనేక రకాల మాస్క్‌లు వచ్చాయిప్పుడు. కొందరు సర్జికల్‌ మాస్కులు వాడితే, మరికొందరు ఇంట్లో ఉండే ఏదో ఒక వస్త్రాన్నే మాస్క్‌లా కుట్టి ఉపయోగిస్తున్నారు. అసలు ఏ మాస్కులు సురక్షితం? ఈ విషయాన్ని తెలుసుకునేందుకు డ్యూక్‌ యూనివర్సిటీ వారు అధ్యయనం చేశారు. అందులో పద్నాలుగు రకాల మాస్క్‌లపై పరిశోధనలు చేసి ర్యాంకులు కేటాయించారు. కరోనా వైరస్‌ ను అడ్డుకోవడంలో ప్రభావవంతమైనదిగా మొదటిస్థానంలో ఫిట్టెడ్‌ ఎన్‌ 95 మాస్క్‌ నిలిచింది. తరువాతి స్థానాల్లో ఏ మాస్క్‌లు నిలిచాయో మీరే చూడండి...

1. ఫిట్టెడ్‌ ఎన్‌95

చాలా పరిశోధనలు చెప్పినట్టే డ్యూక్‌ అధ్యయనం కూడా 'ఫిట్టెడ్‌ ఎన్‌95' మాస్క్‌కే మొదటి స్థానాన్ని ఇచ్చింది.

ఇదే కరోనా వైరస్‌ని అడ్డుకోవడంలో బాగా పనిచేస్తున్నట్టు తేల్చింది. 0.1 శాతం కన్నా అతి తక్కువగా వైరస్‌ డ్రాప్లెట్స్‌ ఈ మాస్క్‌ ద్వారా ట్రాన్స్‌ మిట్‌ అయ్యే అవకాశం ఉంటుంది.

2 సర్జికల్‌ మాస్క్‌

అతి తక్కువ ధరకు దొరికే మాస్క్‌ ఇది. మూడు పొరల్లో ఉండే సర్జికల్‌ మాస్క్‌లు ముక్కు, నోటిలోకి వైరస్‌ ప్రవేశించకుండా అడ్డుకుంటున్నాయి. ఇవి కాస్త వదులుగా ఉంటాయి కాబట్టి ఎన్‌95తో పోలిస్తే వాటంత ప్రభావవంతమైనవి కావు. వీటికి డ్యూక్‌ పరిశోధనలో రెండో స్థానం దక్కింది.

3 మూడు పొరల కాటన్‌ పోలీప్రోపైలీన్‌

కాటన్‌-పోలీప్రొపైలీన్‌ కాంబినేషన్‌తో రూపొందించిన మాస్క్‌ ఇది. దీనిలో రెండు కాటన్‌ పొరల మధ్య ఒక పోలీప్రోపైలీన్‌ పొరను పెట్టి తయారుచేస్తారు. పోలీప్రొపైలీన్‌ అనేది ప్లాస్టిక్‌ లాంటిది. ఇది ఫిల్టర్‌లా ఉపయోగపడుతుంది. రెండు చేనేత వస్త్ర పొరల మధ్య ఇది కాస్త విద్యుత్‌ శక్తిని కలిగి ఉండి, వైరస్‌ ను అడ్డుకుంటుంది.

4 రెండు పొరల పోలీప్రొపైలీన్‌ ఆప్రాన్‌

ఈ మాస్క్‌ లోని రెండు పొరలను సింథటిక్‌ మెటీరియల్‌తో తయారుచేస్తారు. ఇది కూడా కరోనా వైరస్‌ను అడ్డుకోవడంలో కాస్త మెరుగా పనిచేస్తున్నట్టు డ్యూక్‌ అధ్యయనంలో తేలింది.

5 రెండు పొరల కాటన్‌ ప్లీటెడ్‌ (మల్టిపుల్‌ స్టింగ్స్‌)

కాటన్‌ వస్త్రంతో తయారు చేసిన మాస్క్‌ ఇది. చాలా చవక కూడా. రెండు పొరల్లో ఈ మాస్క్‌కు రెండు కన్నా ఎక్కువ తాళ్లు ఉంటాయి. గాలి చొరబడకుండా ఉండేలా ఈ తాళ్లతో మాస్క్‌ను గట్టిగా కట్టుకోవాలి.

6 రెండు పొరల కాటన్‌ ప్లీటెడ్‌ (టూ సెట్స్‌ఆఫ్‌ స్టింగ్స్‌)

రెండు పొరల కాటన్‌ మాస్క్‌లు ఎంత ప్రభావవంతమైనవో ఇది కూడా అంతే. కాకపోతే దీనికుండే రెండు జతల తాళ్లు మాస్క్‌ జారిపోకుండా పట్టి ఉంచుతాయి.

7 వాల్వ్‌డ్‌ ఎన్‌95

ఎన్‌ 95 మాస్క్‌కు చిన్న ఫిల్టర్‌ ను ఫిట్‌ చేసి ఉండేదే 'వాల్వ్‌డ్‌ ఎన్‌95' మాస్క్‌. ఆ ఫిల్టర్‌ ద్వారా గాలిలోని హానికారక అణువులు లోపలికి చేరకుండా అడ్డుకోవచ్చు. కానీ ఇది వస్త్రంతో కుట్టిన మాస్క్‌లంత మేలైనది కాదు.

8 రెండు పొరల కాటన్‌ (ఓస్లోన్‌ స్టైల్‌)

ఈ మాస్క్‌లను ఇంటి దగ్గరే తయారుచేసుకోవచ్చు. వీటిని ఎక్కువగా వైద్యరంగంలోని వారు ఉపయోగిస్తారు. సర్జికల్‌, ఎన్‌ 95 మాస్క్‌లు అందుబాటులో లేనప్పుడు ఈ మాస్క్‌లను వాడతారు. ముక్కు, నోరు దగ్గర శంఖుకారంలో ఉంటుంది ఈ మాస్క్‌.

9 ఒక పొర పోలిస్టర్‌ వొవెన్‌ ఫాబ్రిక్‌

ఒక పొర లేదా రెండు పొరలతో కూడిన చేనేత వస్త్రంతో కుట్టిన మాస్క్‌లతో పోలిస్తే ఒక పొర పోలిస్టర్‌ మాస్క్‌ ఉత్తమ మైనదేనంటోంది ఉత్తరమెరికా సంస్థ మాక్సిమా.

10 ఒక పొర కాటన్‌ ప్లీటెడ్‌ మాస్క్‌

వీటినే ఎక్కువగా ఇప్పుడు వాడుతున్నారు. కాటన్‌ వస్త్రంతో కేవలం ఒకే పొరతో కుట్టిన మాస్క్‌ ఇది. ఇంట్లోనే సులువుగా దీన్ని కుట్టేసుకోవచ్చు కాబట్టి వాడకం అధికంగా ఉంది.

11 రెండు పొరల కాటన్‌ ప్లీటెడ్‌ (విత్‌ ఇయర్‌ లూప్స్‌)

ఒక పొరతో పోలిస్తే రెండు పొరలతో ఉన్న కాటన్‌ మాస్క్‌ కాస్త ఉత్తమం. అధ్యయన కర్తలు దీనికి పదకొండో స్థానాన్ని ఇచ్చారు.

12 అల్లిన మాస్క్‌

ఊలుతో అల్లిన మాస్క్‌ మంచి ఎంపిక కాదు. అల్లిన మాస్క్‌లకు అధికంగా రంధ్రాలు ఉంటాయి కాబట్టి వైరస్‌ త్వరగా చొరబడే ప్రమాదం ఉంటుంది.

13 బందనా

ఇది కూడా అల్లిన మాస్క్‌ లాంటిదే. వాడడం సురక్షితం కాదు. ఇవి కరోనాను అడ్డుకోలేవు. కాబట్టి వాడొద్దు.

14 ఫ్లీస్‌ నెక్‌ గెయిటర్‌

ఇది మెడకు భద్రతను కల్పించడానికే కానీ వైరస్‌ నుంచి ఎలాంటి రక్షణను ఇవ్వలేదని అధ్యయనకర్తలు తేల్చేశారు. ఇలాంటివి వద్దు.

Thanks for reading Rank-wise masks

No comments:

Post a Comment