Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, September 7, 2020

Register to vote


Register to vote
ఓటు నమోదు చేసుకోండి

Register to vote

●అక్టోబరు 31 వరకూ గడువు విధింపు
●డిసెంబరు 12 వరకూ మార్పులు చేర్పులు
●ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరణ

18 ఏళ్ల వయసు నిండుతున్న వారంతా కొత్తగా ఓటు హక్కు కోసం, అలాగే చిరునామా, పేర్లలో మార్పులు, చేర్పులకు కూడా డిసెంబర్ 12వ తేదీ వరకు అవకాశం కల్పించిన భారత ఎన్నికల సంఘం..

 వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు వయసు నిండుతున్న వారంతా కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు . అలాగే చిరునామా , పేర్లలో మార్పులు చేర్పులకు భారత ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది . ఫారం -6 కొత్త ఓటరు నమోదుకు , ఫారం -1 జాబితాలో మార్పులకు , ఫారం -8 పోలింగ్ బూత్ మార్పుల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం , వెబ్ సైట్ ceoandhra.nic.in లోకి వెళ్లి సంబంధిత దరఖాస్తును పూర్తి చేయాలి . ఇందుకు అవసరమైన ఆధార్  , పుట్టినరోజు ధ్రువీకరణ పత్రం , పదో తరగతి సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు , రెండు పాస్ పోర్టు ఫొటోలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి . దీనిని పూర్తి చేసిన తర్వాత పత్రాలను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని స్థానిక తహసీల్దార్  కార్యాలయంలోని ఎన్నికల విభాగంలో అందజేయాలి.

బూత్ లెవల్ అధికారి దరఖాస్తుదారుడి నివాసానికి వెళ్లి విచారణ నిర్వహించి , అర్హులను ఓటరుగా గుర్తిస్తారు . ఆ తర్వాత ఓటు గుర్తింపు కార్డులను మీ సేవ కేంద్రాల ద్వారా పొందవ చ్చు . ఓటర్ల నమోదుకు అక్టోబరు 31 వరకు గడువు విధించారు . అలాగే ఓటర్ల నమోదు , మార్పులు చేర్పుల అనంతరం  తుది జాబితా విడుదల చేసే షెడ్యూలును ప్రకటించారు . వార్డులో 1400 కు మించి ఓటర్లు ఉంటే అదనపు పోలింగ్ బూతు ఏర్పాటు చేస్తారు . ఒక వ్యక్తికి ఒకటికంటే ఎక్కువ ఓట్లు ఉంటే తొలగిస్తారు . డ్రాఫ్ట్ రోలను నవంబర్ 15 న , ముసాయిదా ఓటరు జాబితాను నవంబర్ 16 న విడుదల చేస్తారు . 

మార్పులు , చేర్పులను డిసెంబర్ 12 వరకూ నమోదు చేసుకుంటారు . డిసెంబర్‌లోని ప్రత్యేక తేదీల్లో ప్రచారం నిర్వహిం చి బూత్ లలో DLO  దర ఖాస్తులు స్వీకరిస్తారు . వచ్చే ఏడాది జనవరి 5 వ తేదీ నాటికి అభ్యంతరాలను పరిశీలించి , జనవరి 15 న తుది జాబితా ప్రకటిస్తారు . ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని అధికారులు పిలుపునిస్తున్నారు .

Thanks for reading Register to vote

No comments:

Post a Comment