Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, September 3, 2020

Rejection of Government Request on English Medium.


ఆంగ్ల మాధ్యమంపై ప్రభుత్వ అభ్యర్థన తిరస్కరణ.
Rejection of Government Request on English Medium.

 ఆంగ్లమాధ్యమం విషయంలో హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూ ఏపీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది. ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం 81, 85 జీవోలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.


 ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది కేవీ విశ్వనాథన్‌ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్లమాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను రద్దు చేయడం సరికాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని విద్యాహక్కు చట్టంలో లేదని ఆయన కోర్టుకు తెలియజేశారు. దీనిపై స్పందించిన జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌పై స్పందించేందుకు నోటీసులు ఇస్తామని చెప్పింది. నోటీసులతో స్టేకూడా ఇవ్వాలని విశ్వనాథన్‌ ధర్మాసనాన్ని కోరారు.  కేవియట్‌ వేసిన విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రొఫెసర్లు రెండు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 25కి వాయిదా వేసింది. 

Thanks for reading Rejection of Government Request on English Medium.

No comments:

Post a Comment