Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, September 20, 2020

School bells are ringing today .. these rules are mandatory ..!


నేడు బడి గంటలు మోగుతున్నాయి .. ఈ నిబంధనలు తప్పనిసరి .. !


లాక్‌డౌన్‌తో గత విద్యాసంవత్సరం పూర్తికాకుండానే పాఠశాలలు మూతపడ్డాయి. అనంతరం జూన్‌లో తిరిగి తెరవాల్సి ఉన్నా…కరోనా ఉద్ధృతి తగ్గని కారణంగా మూసే ఉంచారు. ఎట్టకేలకు కేంద్ర మార్గదర్శకాల ప్రకారం కంటైన్మెంట్‌ జోన్లకు వెలుపల ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు విద్యా సంస్థలు నేటి నుంచి తెరుచుకుంటున్నాయి. 9 నుంచి ఇంటర్‌ వరకు చదివే విద్యార్థులు తమ సందేహాల నివృత్తికి తల్లిదండ్రుల అనుమతితో పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు వెళ్లొచ్చని… విద్యాశాఖ స్పష్టం చేసింది.

1 నుంచి 8 తరగతుల వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలకు పిలిపించకూడదని తెలిపింది. వీరికి తల్లిదండ్రుల ద్వారానే మార్గదర్శనం చేయాల్సి ఉంటుంది.


  వీరికి ఆన్‌లైన్‌, వీడియో పాఠాలే కొనసాగుతాయి. వర్క్‌షీట్లను అభ్యాస యాప్‌లో అందుబాటులో ఉంచారు. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకొని అభ్యాసనం కొనసాగించేలా ఉపాధ్యాయులు మార్గనిర్దేశం చేస్తారు.విద్యార్థులు కూర్చునే సీట్ల మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు నోటుపుస్తకాలు, పెన్నులు, తాగునీటి సీసాలు పరస్పరం మార్చుకోకుండా ప్రతి ఒక్కరిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని ఉపాధ్యాయులకు ఆదేశాలిచ్చారు.

  పాఠశాలలకు, కళాశాలకు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించేలా చూడాలని సూచించారు. పంచాయతీరాజ్‌, పురపాలక విభాగాలను సంప్రదించి ప్రధానోపాధ్యాయులు పాఠశాల పరిసరాలను శానిటైజ్‌ చేయించాలని విద్యాశాఖ నిర్దేశించింది.

  డైరక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ఆదేశాల మేరక ఆంథ్ర ప్రదేశ్ లోని ప్రాథమిక,ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు అందరూ ది21-9-2020 సోమవారం100% హాజరు కావాలి.ది22-9-2020 మంగళవారం నుండి ప్రతిరోజు 50% ఉపాధ్యాయులు హాజరు కావాలి.కోవిడ్ నిబంధనలు పాటించాలి.

గమనిక:9,10 తరగతుల విద్యార్థుల హాజరు వారి తలిదండ్రుల రిక్వెస్ట్ లెటర్ పై సందేహా నివృత్తి కొరకు మాత్రమే.విద్యార్థుల హాజరు ఐచ్చికం.తప్పని సరి కాదు

1నుండి8 తరగతుల విద్యార్థులకు పాఠశాల ప్రవేశం లేదుPrecautions to be taken by teachers before going to school from home, at the school and after coming home.
Precautions to be taken by teachers before going to school from home, at the school and after coming home.
పాఠశాలలు తెరుస్తున్నారు...ఇంటి నుండి పాఠశాలకు వెళ్ళే ముందు, పాఠశాల వద్ద మరియు ఇంటికి వచ్చిన తరువాత ఉపాధ్యాయులు తీసుకోవలసిన జాగ్రత్తలు.

చాలా కాలం ఇంట్లో ఉన్న టీచర్లు ఇప్పుడు బడి బాట పట్టబోతున్నారు...ఈ సందర్భంగా టీచర్లు ఖచ్చితంగా కొన్ని స్వయం నిబంధనలు పాటించాలి.

ఇంటి నుండి బడికి వెళ్లే ముందు....

1. మాస్కు ధరించాలి.

2. బ్యాగ్ లో సబ్బు, sanitiser అదనపు మాస్కు ఉంచుకోవాలి.

3. ఎవరి ప్లేట్, వాటర్ bottle, స్పూన్ వారే తీసుకువెళ్లాలి.

4. పవర్ బ్యాంక్, చార్జర్ లు వంటివి కూడా ఎవరివి వారే తీసుకువెళ్లాలి.

5. Two వీలర్ పై ఒక్కరు మాత్రమే వెళ్ళాలి.

6. కార్లో ఇద్దరు మాత్రమే ఒకరు ముందు సీట్లో ఇంకొకరు వెనుక సీట్లో కూర్చోవాలి. కార్ కిటికీలు తెరిచి ఉంచాలి.

7. బస్ లో వెళ్లే వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

8. అనవసరముగా ఎవరితో ముచ్చటించరాదు ప్రయాణంలో.

9. అనారోగ్యముగా ఉంటే బడికి వెళ్లకూడదు.

10. అవసరమైన మందులు వెంట తీసుకివెళ్లాలి.

 బడిలో.....
1. అనవసరంగా వస్తువులను తాకారాదు.

2. భౌతిక దూరం పాటించాలి.

3. మాస్కు, ఫేస్ షీల్డ్ నిరంతరం ధరించాలి.

4. మీరు వాడే వస్తువులను రోజు శుద్ధి చేసుకోవాలి.

5. కరచాలనం వద్దు,నమస్కారం ముద్దు.

6. సమావేశాలు భౌతిక దూరం తో నిర్వహించాలి.

7. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి.

8. భోజనాలు సామూహికంగా చేయరాదు..ఎవరి స్థానంలో వారే తినడం మంచిది.

9. బడికి వచ్చే బయటి వారితో తగు జాగ్రత్తలు పాటించాలి.

10. అత్యంత సన్నిహితులతో కూడా జాగ్రత్తలు పాటించాలి.

ఇంటికి వచ్చిన తరువాత......

1. ఇంటికి రాగానే వెంటనే స్నానం చేయండి.

2. విడిచిన బట్టలు డిటర్జెంట్ లో నాన పెట్టండి.

3. తీసుకు వెళ్లిన వస్తువులను శుద్ధి చేయండి.

4. మోబైల్ ని శుభ్రం చేయండి.

5. ఇవన్నీ పూర్తయ్యేదాకా ఇంట్లో వారికి దూరంగా ఉండండి.

6. ఆవిరి పట్టుకోండి.

7. గొంతుని ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి.


వీటితో పాటు మంచి ఆహారం, వ్యాయామం, నిద్ర ఖచ్చితంగా అలవర్చుకోండి. అనవసర ఆందోళనలు వద్దు !..............జాగ్రత్తే కరోనాకు మందు.

Thanks for reading School bells are ringing today .. these rules are mandatory ..!

No comments:

Post a Comment