Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, September 30, 2020

schools reopen: This is the opinion of parents on sending their children to schools.


schools reopen : పిల్లలను స్కూల్స్ కు పంపడంపై తల్లిదండ్రుల అభిప్రాయం ఇదే ..

దేశంలో కరోనా వ్యాప్తి రోజురోజుకు విజృంభిస్తున్నా.. చిన్నారులు విద్యా సంవత్సరం మిస్ అవొద్దనే ఉద్దేశంతో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలు తెరిచేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఆన్లైన్ క్లాసుల పేరిట పలు ప్రయివేటు విద్యా సంస్థలు క్లాసులు చెబుతున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో నెట్ సరిగా రాక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే ప్రభుత్వాలు కూడా పలు మార్గదర్శకాలతో పాఠశాలలు తెరుస్తున్నా.. చిన్నారులను బడికి పంపించడానికి వారి తల్లిదండ్రులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. సెప్టెంబర్లోనే పలు రాష్ట్రాలలో బడులు తెరుచుకున్నా.. అవీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. అక్టోబర్లోనూ అవే పరిస్థితులు కనిపించేలా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా దాదాపు 71 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను వచ్చే నెలలోనూ బడికి పంపించమని చెబుతున్నారు.
అసలు ఈ ఏడాది పూర్తయ్యే దాకా బడులు తెరవకపోవడమే మంచిదనే అభిప్రాయంలోనూ చాలా మంది ఉన్నారు. లోకల్ సర్కిల్స్ అనే సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.దేశవ్యాప్తంగా 217 జిల్లాల్లో.. సుమారు 15 వేల మంది విద్యార్థుల తల్లిదండ్రులను ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేసి నిర్వహించిన ఈ సర్వే వివరాలు కింది విధంగా ఉన్నాయి.
అక్టోబర్లో మీ పిల్లలను స్కూళ్లకు పంపిస్తారా అన్న ప్రశ్నకు.. 71 శాతం మంది తల్లిదండ్రులు నో చెప్పారు. 20 శాతం మంది మాత్రమే తాము పంపిస్తామని తెలిపారు. 9 శాతం మంది ఏ అభిప్రాయమూ వెల్లడించలేదు. కోవిడ్ విజృంభిస్తుండటం.. అక్టోబర్ చివరి వారం, నవంబర్ మొదట్నుంచి ఉత్తర భారతంలో చలి, పంజాబ్, హర్యానా, యూపీలలో రైతులు తమ పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల అక్క మంచుపొగ ఆవరించి ఉంటుంది. దీనిని కూడా దృష్టిలో ఉంచుకున్న పిల్లల అమ్మనాన్నలు.. వారిని బడికి పంపించమని చెబుతున్నారు.

అంతేగాక వచ్చే రెండు నెలల్లో దేశవ్యాప్తంగా దసరా, దీపావళి, ఇతర పండుగల సీజన్ ఉంది. సాధారణ సమయాల్లోనూ ఈ సమయంలో నెల రోజుల దాకా సెలవులే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పూర్తయ్యే దాకా బడులు తెరవొద్దని చిన్నారుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని వాళ్లు సర్వేలో వెల్లడించారు. మొత్తంగా చూస్తే.. 34 శాతం మంది డిసెంబర్ 31 దాకా బడులు తెరవొద్దని తెలపగా.. మరో 31 శాతం మంది ఈ విద్యా సంవత్సరం మొత్తం స్కూళ్లు మూసే ఉంచాలని కోరుకుంటున్నారు. 19 శాతం మంది వచ్చే రెండు నెలల దాకా ఓపెన్ చేయొద్దని అభిప్రాయపడుతున్నారు.

Thanks for reading schools reopen: This is the opinion of parents on sending their children to schools.

No comments:

Post a Comment