Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, September 23, 2020

Shock to SBI customers .. New rule comes into effect from October 1!


SBI కస్టమర్లకు భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ అమలులోకి!
Shock to SBI customers .. New rule comes into effect from October 1!

మీకు స్టేట్ బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. మోదీ సర్కార్ తీసుకువచ్చిన కొత్త రూల్ ఎస్‌బీఐకి కూడా వర్తించనుంది. దీంతో ఖాతాదారులపై ఎఫెక్ట్ పడొచ్చు.


దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా తన కస్టమర్లకు ఝలక్ ఇచ్చింది. ఖాతాదారులకు ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. పన్ను అంశానికి సంబంధించి వివరణ ఇచ్చింది. దీంతో కొంత మంది కస్టమర్లపై నేరుగానే ప్రతికూల ప్రభావం పడనుంది.

కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే కొత్త రూల్ తీసుకువచ్చింది. ఇది అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది. ఈ కొత్త నిబంధన వల్ల ఎస్‌బీఐ కస్టమర్లపై కూడా ప్రభావం పడబోతోంది. మోదీ సర్కార్ అక్టోబర్ 1 నుంచి విదేశాలకు పంపించే డబ్బులపై ట్యాక్స్ విధిస్తోంది. ఈ రూల్ స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు కూడా వర్తిస్తుంది.


ఫైనాన్స్ యాక్ట్ 2020 ప్రకారం.. మన దేశం నుంచి విదేశాలకు డబ్బులు పంపించే వారిపై టీసీఎస్ పడుతుంది. ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (TCS) 5 శాతంగా ఉంటుంది. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.7 లక్షలకు పైన డబ్బులు పంపే వారికి మాత్రమే టీసీఎస్ వర్తిస్తుంది. అంటే ఈ మొత్తం కన్నా తక్కువ డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తే టీసీఎస్ పడదు.

అంతేకాకుండా ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఆ డబ్బులను విద్యార్థులకు పంపితే అప్పుడు టీసీఎస్‌లో తగ్గింపు ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ పాన్ కార్డు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మీ వద్ద పాన్ కార్డు ఉంటే టీసీఎస్ రేటు 5 శాతంగా ఉంటుంది. పాన్ కార్డు లేకపోతే మాత్రం 10 శాతం టీసీఎస్ కట్ అవుతుంది. ఎడ్యుకేషన్ లోన్ విషయానికి వస్తే టీసీఎస్ పాన్ కార్డు ఉంటే 0.5 శాతంగా, లేకపోతే 5 శాతంగా ఉంటుంది.

Thanks for reading Shock to SBI customers .. New rule comes into effect from October 1!

No comments:

Post a Comment