Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, September 30, 2020

The ministry of home affairs has announced a detailed guideline for Unlock 5.0


The ministry of home affairs has announced  detailed guidelines for Unlock 5.0

దిల్లీ: దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే చర్యల్లో భాగంగా కేంద్ర హోంశాఖ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. మరిన్ని మినహాయింపులతో బుధవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల ఈ నెల 15 నుంచి సినిమా థియేటర్లు/ మల్టీప్లెక్సులు తెరిచేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే, 50 శాతం సీట్ల సామర్థ్యంతో తెరిచేందుకు అనుమతిచ్చింది. అక్టోబర్‌ 15 నుంచి స్కూళ్లు తెరుచుకోవచ్చని, ఆ నిర్ణయాన్ని రాష్ట్రాలకు విడిచిపెట్టింది. అలాగే, 15 నుంచి కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఎగ్జిబిషన్లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు తెరుచుకోవచ్చంది. క్రీడాకారుల శిక్షణార్థం స్విమ్మింగ్‌ పూల్స్‌ తెరిచే వెసులుబాటు కల్పించింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో మాత్రం అక్టోబర్‌ 31 వరకు లాక్‌డౌన్‌ యథాతథంగా కొనసాగుతుందని కేంద్రం స్పష్టంచేసింది.

తాజా మార్గదర్శకాల ప్రకారం.. విద్యాసంస్థల తెరిచే అంశాన్ని కేంద్రం ప్రత్యేకంగా పేర్కొంది. అక్టోబర్‌ 15 నుంచి స్కూళ్లు, కోచింగ్‌ సెంటర్లు దశలవారీగా తెరిచేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విడిచిపెట్టింది. ఆన్‌లైన్‌ క్లాసులు కొనసాగించుకోవచ్చంది. అయితే, పిల్లల్ని పంపే అంశంపై తల్లిదండ్రుల లిఖిత పూర్వక అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. విద్యాసంస్థలు తెరిచే విషయంలో రాష్ట్రాలు సొంత మార్గదర్శకాలు రూపొందించుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. కళాశాలలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు తెరిచే అంశాన్ని ఉన్నత విభాగాలకు విడిచి పెట్టింది. ఆన్‌లైన్‌ తరగతులకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది.

Thanks for reading The ministry of home affairs has announced a detailed guideline for Unlock 5.0

No comments:

Post a Comment