Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, October 1, 2020

8 thousand teacher posts in Army schools


8 thousand teacher posts in Army schools
 ఆర్మీ స్కూల్స్ లో 8 వేల టీచర్ పోస్టులు
దేశవ్యాప్తంగా వివిధ కంటోన్మెంట్లు, మిలటరీ స్టేషన్లలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టుల భర్తీకి ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యు్కేషన్‌ సొసైటీ (ఏడబ్ల్యూఈఎస్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆస్తకి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 8 వేల టీజీటీ, పీజీటీ, పీఆర్‌టీ పోస్టులను భర్తీచేయనుంది. ఆన్‌లైన్‌లో అక్టోబర్‌ 20లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తామని వెల్లడించింది. అయితే ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే విషయాన్ని సంబంధిత పాఠశాలలు వెల్లడిస్తాయని తెలిపింది. దేశంలోని 137 ఆర్మీ పబ్లిక్‌ స్కూల్స్‌ (ఏపీఎస్‌)లో వీరిని నియమిస్తామని ప్రకటించింది
మొత్తం పోస్టులు: 8000

అర్మతలు: పీజీటీకి బీఈడీతోపాటు సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత, టీజీటీ పోస్టులకు బీఈడీతోపాటు డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత, పీఆర్‌టీ పోస్టులకు బీఈడీ లేదా రెండేండ్ల డిప్లొమా, డిగ్రీ పూర్తిచేసి ఉండాల. అభ్యర్థులు 40 ఏండ్లలోపువారై ఉండాలి. అనుభవం ఉన్నవారికైతే 57 ఏండ్ల వయస్సు ఉండాలి. స్క్రీనింగ్‌ టెస్టుకు సీటెట్‌ లేదా టెట్‌లో అర్హత సాధించాల్సిన అవసరం లేదు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, టీచింగ్‌ స్కిల్స్‌ ఎవాల్యుయేషన్‌

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

అప్లికేషన్‌ ఫీజు: రూ.500

దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్‌ 1

దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్‌ 20

అడ్మిట్‌ కార్డులు: నవంబర్‌ మొదటి వారంలో

పరీక్ష తేదీ: నవంబర్‌ 21, 22

ఫలితాల విడుదల: డిసెంబర్‌ మొదటి వారంలో

వెబ్‌సైట్‌: http://aps-csb.in

Thanks for reading 8 thousand teacher posts in Army schools

No comments:

Post a Comment