Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, October 20, 2020

Advance arrangements for the distribution of the Kovid vaccine


          కొవిడ్ టీకా పంపిణీకి ముందస్తు ఏర్పాట్లు

కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే కొవిడ్‌ టీకా పంపిణీకి అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. టీకాను భద్రపరిచేందుకు కేంద్రం నుంచి 3 ‘వాక్‌ ఇన్‌ కూలర్స్‌’ రానున్నాయి. వీటికి తగ్గట్టుగా పీహెచ్‌సీలలో ఉన్న ఐస్‌ లైన్డ్‌ రిఫ్రిజిరేటర్‌లు పెంచనున్నారు.

కేంద్రం నుంచి వచ్చే కొవిడ్‌-19 టీకాను రాష్ట్రంలో పంపిణీ చేసేందుకు ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ దృష్టిపెట్టింది. ప్రస్తుత ‘వ్యాధి నిరోధక టీకాల పట్టిక’కు అదనంగా కొవిడ్‌ టీకా పంపిణీ కోసం చేపట్టాల్సిన చర్యలపై అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. టీకాను భద్రపరిచేందుకు కేంద్రం నుంచి అదనంగా 48వేల లీటర్ల సామర్థ్యం కలిగిన మూడు ‘వాక్‌ ఇన్‌ కూలర్స్‌’ రానున్నాయి. వీటికి తగ్గట్టుగా పీహెచ్‌సీలలో ఉన్న ఐఎల్‌ఆర్‌ (ఐస్‌ లైన్డ్‌ రిఫ్రిజిరేటర్‌)లు పెంచబోతున్నారు. రాష్ట్ర స్థాయి వ్యాక్సిన్‌ స్టోర్‌ నుంచి ప్రాంతీయ, జిల్లా, స్థానిక ఆరోగ్య కేంద్రాల వరకూ అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. డిసెంబరు నాటికి ఆయా ఏర్పాట్లను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.


విజయవాడ, విశాఖ, రాయలసీమలో 

ఏర్పాటుకు..విజయవాడ శివారు గన్నవరంలో రాష్ట్ర వ్యాక్సిన్‌ స్టోర్‌ ఉంది. దీనికి అదనంగా 4 ప్రాంతీయ స్టోర్లు, 1,677 కోల్డ్‌చైన్‌ పాయింట్లు ఉన్నాయి. 1.45 లక్షల లీటర్ల వ్యాక్సిన్‌ను భద్రపరిచేందుకు ప్రస్తుతం సౌకర్యాలు ఉన్నాయి. రాష్ట్రానికి రానున్న మూడు ‘వాక్‌ ఇన్‌ కూలర్స్‌’ను గన్నవరం, విశాఖ, రాయలసీమలో తిరుపతి లేదా కడపలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రత్యేక వాహనాల ద్వారా వచ్చే వ్యాక్సిన్‌ను ఈ ‘వాక్‌ ఇన్‌ కూలర్స్‌’లో ఉంచుతారు. ఇక్కడి నుంచి ప్రాంతీయ, జిల్లా కేంద్రాల ద్వారా మండల స్థాయిలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిస్తారు. అక్కడ నుంచి పంపిణీ ప్రదేశాలకు చేరవేసేందుకు అవసరమైన ‘క్యారియర్లు’ ఎన్ని అవసరం ఉంటుందో లెక్కలు వేస్తున్నారు.


2 లక్షల పంపిణీ పాయింట్లు!

ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాలు, జన సమర్థం కలిగిన కూడళ్లు, దేవాలయాలు, ప్రాథమిక, ఉప ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీలు, ఇతర చోట్ల కలిపి రాష్ట్రంలో 2 లక్షల వరకూ పంపిణీ ప్రదేశాలు ఉన్నాయి. ఈ వివరాలను పంపాలని కేంద్రం వైద్య ఆరోగ్య శాఖను కోరింది. రాష్ట్ర జనాభా వివరాలను వయసుల వారీగా వెబ్‌సైట్‌లో నమోదుచేయాలని సూచించింది. ఆ మేరకు ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది.


ఆరోగ్య సిబ్బందికి తొలి ప్రాధాన్యం

కొవిడ్‌-19 టీకాల పంపిణీలో ఆరోగ్య సిబ్బందికి తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వీరి సంఖ్య రాష్ట్రంలో 75వేల వరకు ఉంది. కేంద్రం నుంచి వచ్చే వ్యాక్సిన్‌ను అనుసరించి పంపిణీ ప్రణాళికలు తయారవుతాయి. దీనిపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు త్వరలో జరగనున్నాయి.

Thanks for reading Advance arrangements for the distribution of the Kovid vaccine

No comments:

Post a Comment