Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, October 26, 2020

AP Jobs 2020: 168 jobs in Reliance Nippon Life Insurance ... for women only


AP Jobs 2020 : రిలయెన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్స్యూరెన్స్ లో 168 ఉద్యోగాలు ... మహిళలకు మాత్రమే

AP Jobs 2020: 168 jobs in Reliance Nippon Life Insurance ... for women only

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. రిలయెన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్-LPO పోస్టుల్ని భర్తీ చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 168 ఖాళీలున్నాయి. ఈ పోస్టులు మహిళలకు మాత్రమే. లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్-LPO రోజూ 3-4 కస్టమర్లకు లైఫ్ ఇన్స్యూరెన్స్‌పైన అవగాహన కల్పించాల్సి ఉంటుంది. మొదటి ఆరు నెలల్లో ప్రతీ నెల కనీసం ఒకరికి అంటే ఓ కుటుంబానికి ఇన్స్యూరెన్స్ కవరేజీ కల్పించాలి. ఆరు నెలల తర్వాత ప్రతీ నెలకు కనీసం ఇద్దరికి ఇన్స్యూరెన్స్ కవరేజీ కల్పించాలి. ప్రతీ నెల వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ ఉంటాయి.

ఈ నోటిఫికేషన్ వివరాలతో పాటు దరఖాస్తు చేయడానికి ఆసక్తి గల అభ్యర్థులు https://www.apssdc.in/ వెబ్‌సైట్ చూడాలి. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి అప్లై చేయాలి.

మొత్తం ఖాళీలు- 168

గుంటూరు- 20

విజయవాడ- 10

తెనాలి- 5

నరసరావుపేట- 8

సత్తెనపల్లి- 10

గుడివాడ- 10

మచిలీపట్నం- 10

రాజమండ్రి- 20

వైజాగ్- 15

తణుకు- 10

విజయనగరం- 10

అనంతపురం- 10

ధర్మవరం- 10

హిందూపూర్- 15

కడప- 5

భర్తీ చేసే పోస్టు- లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్-LPO. ఈ ఉద్యోగాలు మహిళలకు మాత్రమే.

వేతనం- మొదటి ఆరు నెలలు నెలకు రూ.10,000. ఆరు నెలల తర్వాత నెలకు రూ.12,500. ఏడాది తర్వాత ప్రమోషన్ పొందితే పోస్టుకు తగ్గట్టుగా వేతనం పెరుగుతుంది.

ఇన్సెంటీవ్- రోజూ 3-4 కస్టమర్లను కలిస్తే నెలకు రూ.2000 ఇన్సెంటీవ్ లభిస్తుంది. పాలసీ అమ్మితే రూ.2000 ఇన్సెంటీవ్ లభిస్తుంది. మొదటి 15 రోజుల్లో పాలసీ అమ్మితే రూ.800 ఇన్సెంటీవ్ లభిస్తుంది. వీటితో పాటు కస్టమర్ల ఫోన్ నెంబర్లు అప్‌డేట్ చేయడం, అడ్రస్ మార్పు, బ్యాంకు వివరాల అప్‌డేట్ లాంటి సేవల్ని అందిస్తే ఇన్సెంటీవ్స్ ఉంటాయి. ప్రతీ నెల వేతనంతో పాటు ఇన్సెంటీవ్ కలిపి ఇస్తారు.

వయస్సు- 30 నుంచి 45 ఏళ్లు.

విద్యార్హత- ఏదైనా డిగ్రీ పాస్ కావాలి.

ఇతర అర్హతలు- తప్పనిసరిగా స్మార్ట్‌ఫోన్ ఉండాలి. వాహనం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. స్థానికులకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు.

Thanks for reading AP Jobs 2020: 168 jobs in Reliance Nippon Life Insurance ... for women only

No comments:

Post a Comment