Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, October 1, 2020

AP Media bulletin: Details of today's Covid-19 cases


AP Media bulletin: Details of today's Covid-19 cases
04.11.20


03.11.20
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 8 లక్షలు దాటింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 84,534 కరోనా పరీక్షల నిర్వహించగా.. 2,849 కొత్త కేసులు నమోదయ్యాయి. 15 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,30,731కి చేరింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,734 మంది కొవిడ్‌తో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 3,700 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,672 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 82,66,800 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.


02.11.20
అమరావతి: ఏపీలో కొత్తగా 1,916 కరోనా కేసులు నమోదయ్యాయి. 64, 581 నమూనాలను పరీక్షించగా తాజా కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,27,882కి చేరింది. ఈ మేరకు ప్రభుత్వం బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 13 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందారు. అనంతపురం జిల్లాలో 3, కృష్ణా 3, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, ప్రకాశం, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,719కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 3,033 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా.. 22,538 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 81,82,266 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.


01.11.20
అమరావతి: ఏపీ ప్రభుత్వం కరోనా బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 88,780 నమూనాలను పరీక్షించగా 2,618 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,25,966కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో కొవిడ్‌ చికిత్స పొందుతూ 16 మంది మృతిచెందారు. కృష్ణా జిల్లాలో 4, చిత్తూరు 3, గుంటూరు 3, అనంతపురం 2, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6,706కి చేరింది. 24 గంటల వ్యవధిలో 3,509 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 23,668 యాక్టివ్‌  కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 81,17,685 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.


31.10.20
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరీక్షల సంఖ్య 80 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 82,045 కరోనా పరీక్షలు నిర్వహించగా .. 2,783 కొత్త కేసులు నమోదు కాగా.. 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,23,348కి చేరింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,690 మంది కొవిడ్‌తో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 3,708 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 7,92,083కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 24,575 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 80,28,905 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో అత్యధికంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు, విశాఖ, పశ్చిమ గోదావరిలో ఇద్దరు చొప్పున మృతి చెందగా.. అనంతపురం, తూర్పు గోదావరిలో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది.


29.10.20
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 88,778 కరోనా పరీక్షల నిర్వహించగా.. 2,905 కొత్త కేసులు నిర్ధారణ కాగా.. 16 మంది బాధితులు మృతి చెందారు. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,14,784కి చేరింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,659 మంది కొవిడ్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 3,243 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 7,84,752కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 26,268 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 78,62,459 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ముగ్గురు మృతి చెందగా.. అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, కడప జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు, నెల్లూరు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఒక్కరు చొప్పున కరోనాతో చనిపోయారు.


28.10.20


27.10.20
అమరావతి: ఏపీలో కరోనా బులెటిన్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో 74,757 నమూనాలను పరీక్షించగా 2,901 మందికి కొవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,11,825కి చేరింది. 24 గంటల వ్యవధిలో 19 మంది కరోనా చికిత్స పొందుతూ మృతిచెందారు. 
కడప జిల్లాలో 4, చిత్తూరు 3, కృష్ణా 3, తూర్పుగోదావరి 2, ప్రకాశం 2, అనంతపురం, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 6,625కి చేరింది. ఒక్కరోజులో 4,352 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 27,300 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 76,96,653 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.


25.10.20
అమరావతి: ఏపీలో కొత్తగా 2,997 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 67,419 నమూనాలను పరీక్షించగా తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 8,07,023కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ 21 మంది మృతిచెందారు. చిత్తూరులో ఐదుగురు, కడప ముగ్గురు, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున, నెల్లూరు, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,587కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 3,585 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 30,860 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 75,70,352 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.


24.10.20
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 74,919 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 3,342 కొవిడ్‌ కేసులు నిర్ధారణ కాగా.. 22 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,04,026కు చేరింది. తాజాగా ప్రాణాలు కోల్పోయినవారితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,566 మంది బాధితులు కొవిడ్‌కు బలయ్యారు. గడిచిన 24 గంటల్లో 3,572 మంది కోలుకోగా.. రాష్ట్రంలో పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య 7,65,991కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,469 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 75,02,933 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.గడిచిన 24 గంటల్లో చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నలుగురు చొప్పున కరోనాతో మరణించారు. అనంతపురం, తూర్పు గోదావరి, విశాఖలో ఇద్దరు చొప్పున మృతి చెందగా.. కడప, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.


23.10.20
రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 8 లక్షలు దాటాయి. ఇవాళ తాజాగా 3,765 మందికి కొవిడ్‌ సోకినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి బాధితుల సంఖ్య 8,00,684కు చేరింది. రాష్ట్రంలో కరోనాతో మరో 20  మంది మృతి చెందారు. కాగా ఇప్పటి వరకు వైరస్ కారణంగా 6,544 మంది ప్రాణాలు విడిచారు. ఇప్పటివరకు 7,62,419 మంది బాధితులు కోలుకోగా...ప్రస్తుతం 31,721 యాక్టివ్‌ కేసులున్నాయి. గడచిన 24 గంటల వ్యవధిలో 80,238 మందికి పరీక్షలు నిర్వహించగా...ఇప్పటివరకు మెుత్తం 74.28 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించారు.  జిల్లాల వారీగా కేసులు...పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 532 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరు 523, తూర్పుగోదావరి 475, కృష్ణా 460, చిత్తూరు 347, ప్రకాశం 317, కడప 225, విశాఖ 218, శ్రీకాకుళం 199, అనంతపురం 152, విజయనగరం 126, నెల్లూరు 122, కర్నూలు 69  చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.  జిల్లాల వారీగా మరణాలు...  గుంటూరు 4, కడప 3, కృష్ణా 3, అనంతపురం 2, చిత్తూరు 2, తూర్పుగోదావరి 2, కర్నూలు 1, ప్రకాశం 1, విశాఖ 1, పశ్చిమగోదావరి ఒకరు చొప్పున ప్రాణాలు విడిచారు.


22.10.20
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 76,726 కరోనా పరీక్షల నిర్వహించగా.. 3,620 కొత్త కేసులు నమోదు కాగా.. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,96,919కి చేరింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,524 మంది కొవిడ్‌తో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 3,723 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 7,58,138కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,257 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 73,47,776 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.కరోనాతో అత్యధికంగా గుంటూరు జిల్లాలో నలుగురు మృతి చెందారు. చిత్తూరు, తూర్పు గోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, అనంతపురం, కడప, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు.


21.10.20
అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 74,422 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 3,746 కొవిడ్‌ కేసులు నిర్ధారణ కాగా.. 27 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,93,299కు చేరింది. తాజాగా ప్రాణాలు కోల్పోయినవారితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,508 మంది బాధితులు కొవిడ్‌కు బలయ్యారు. గడిచిన 24 గంటల్లో 7,739 మంది కోలుకోవడంతో రాష్ట్రంలో పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య 7,54,415కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,376 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ వివరించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 72,71,050 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది.
కృష్ణా జిల్లాలో ఐదుగురు కరోనాతో మృతి చెందగా.. అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. కడప, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లా్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.


20.10.20


19.10.20
అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మరో 2,918 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. 24 మంది ఈ మహమ్మారి కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,86,050కు చేరింది. ప్రస్తుతం 35,065 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు కరోనా కారణంగా 6,453 మంది మృత్యువాత పడ్డారు.గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 61,330 శాంపిళ్లను పరిశీలించినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో నలుగురు చొప్పున మరణించారు. కడపలో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో 4,303 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 71,27,533 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది.


18.10.20
అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 74,945 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 3,986 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. 23 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,83,132కు చేరింది. తాజాగా ప్రాణాలు కోల్పోయినవారితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,429 మంది బాధితులు కొవిడ్‌కు బలయ్యారు. గడిచిన 24 గంటల్లో 4,591 మంది కోలుకోవడంతో రాష్ట్రంలో పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య 7,40,229కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 36,474 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ వివరించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 70,66,203 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది.గడిచిన 24 గంటల్లో చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నలుగురు చొప్పున కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం, తూర్పు గోదావరి, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లా్లో ఇద్దరు చొప్పున, కడప, ప్రకాశం, విశాఖలో ఒక్కరు చొప్పున మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.


17.10.20
అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 70,881 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 3,676 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. 24 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,79,146కు చేరింది. తాజాగా ప్రాణాలు కోల్పోయినవారితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,406 మంది బాధితులు కొవిడ్‌కు బలయ్యారు. గడిచిన 24 గంటల్లో 5,529 మంది కోలుకోవడంతో రాష్ట్రంలో పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య 7,35,638కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 37,102 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ వివరించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 69,91,258 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది.


16.10.20
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 74,337 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,967 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 7,75,470కి చేరింది. తాజాగా మృతి చెందిన బాధితులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 6,382 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 5,010 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో 7,30,109 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 38,979 యాక్టివ్‌ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 69,20,377 సాంపుల్స్‌ని పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఐదుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా.. కడప, కృష్ణా జిల్లాల్లో నలుగురు చొప్పున, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, తూర్పు గోదావరిలో ఇద్దరు మృతి చెందారు. నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కరి చొప్పున ప్రాణాలు కోల్పోయారు.


15.10.20
అమరావతి: కరోనా బులెటిన్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో 73,767 నమూనాలను పరీక్షించగా 4,038 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7,71,503కి చేరింది. 24 గంటల్లో కరోనాతో చికిత్స పొందుతూ 38 మంది మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో 9 మంది, ప్రకాశం 7, కృష్ణా 5, తూర్పుగోదావరి 4, గుంటూరు 3, కడప 3, విశాఖపట్నం 3, అనంతపురం, కర్నూలు, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,357కి చేరింది. ఒక్కరోజులో 5,622 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా 40,047 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 68,46,040 నమూనాలను పరీక్షించినట్లు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది.


14.10.20
అమరావతి: ఏపీలో కరోనా కేసుల తగ్గుముఖం కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 69,463 నమూనాలను పరీక్షించగా 3,892 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కొవిడ్‌ కేసుల సంఖ్య 7,67,465కి చేరింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనాతో చికిత్స పొందుతూ 28 మంది మృతిచెందారు. చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో నలుగురు చొప్పున.. తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురేసి మరణించారు. అనంతపురం, శ్రీకాకుళంలో ఇద్దరు చొప్పున మృతిచెందగా.. కర్నూలు, విజయనగరం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,319కి చేరింది. 24 గంటల వ్యవధిలో 5,050 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా 41,669 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 67,72,273 నమూనాలను పరీక్షించినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు.


13.10.20
అమరావతి: ఏపీలో నిన్నటికి తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఒక్కరోజు వ్యవధిలో 72,082 నమూనాలను పరీక్షించగా 4,622 మంది కొవిడ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7,63,573కి చేరింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనాతో చికిత్స పొందుతూ 35 మంది మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో 7 మంది, కృష్ణా 5, కడప 4, ప్రకాశం 4, అనంతపురం 3, గుంటూరు 3, విశాఖపట్నం 3, తూర్పుగోదావరి 2, నెల్లూరు 2, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,291కి చేరింది. ఒక్కరోజులో 5,715 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా.. 42,855 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా  67,02,810 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.


12.10.20
అమరావతి: ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఒక్కరోజు వ్యవధిలో 61,112 నమూనాలను 3,224 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. నిన్నటితో పోలిస్తే సుమారు 2వేల కేసులు తగ్గాయి. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 7,58,951కి చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ చికిత్స పొందుతూ 31 మంది మృతిచెందారు. కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఐదు మంది చొప్పున, గుంటూరు 4, కడప 4, అనంతపురం 3, తూర్పుగోదావరి 3, చిత్తూరు 2, పశ్చిమగోదావరి 2, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,256కి చేరింది. 24 గంటల్లో 5,504 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 43,983 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 66,30,728 నమూనాలను పరీక్షించారు.


11.10.20
అమరావతి: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఒక్కరోజు వ్యవధిలో 75,517 నమూనాలను పరీక్షించగా 5,210 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7,55,727కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 30 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతూ మరణించారు. ప్రకాశం జిల్లాలో 8 మంది, చిత్తూరు 4, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, విశాఖపట్నం జిల్లాల్లో ముగ్గురేసి చొప్పున మృతిచెందగా.. అనంతపురం, కృష్ణాలో ఇద్దరేసి, శ్రీకాకుళం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,224కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 5,509 మంది పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 46,295 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 65,69,616 నమూనాలను పరీక్షించారు.


10.10.20
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 73,625 కరోనా పరీక్షలు చేయగా 5,653 మందికి కరోనా బారినపడగా.. 35 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిసి ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7,50,517కు చేరింది. గడిచిన 24 గంటల్లో 6,659 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. మొత్తంగా 6,97,699 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,194 మంది బాధితులు ప్రాణాలు కోల్పోగా.. 46,624 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 64,94,099 కరోనా శాంపిల్స్‌‌ పరీక్షించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.
ప్రకాశం జిల్లాలో అత్యధికంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. చిత్తూరులో ఐదుగురు చనిపోయారు. తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో నలుగురు చొప్పున, నెల్లూరు, విశాఖలో ముగ్గురు చొప్పున కొవిడ్‌కు బలయ్యారు. అనంతపురం, గుంటూరు, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందగా.. శ్రీకాకుళం, కడప జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.


09.10.20


08.10.20
అమరావతి: ఏపీ ప్రభుత్వం కరోనా బులెటిన్‌ విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో 66,944 నమూనాలను పరీక్షించగా 5,292 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 7,39,719కి చేరింది. 24 గంటల వ్యవధిలో 42 మంది కొవిడ్‌ చికిత్స పొందుతూ మృతిచెందారు. ప్రకాశం జిల్లాలో 6 మంది.. చిత్తూరు 5, తూర్పుగోదావరి 5, అనంతపురం, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో నలుగురు చొప్పున.. గుంటూరు, కడప, కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతిచెందారు. కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరేసి మరణించగా.. విజయనగరం జిల్లాలో ఒకరు మృతిచెందారు. తాజా మరణాలతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,128కి చేరింది. ఒక్కరోజులో 6,102 మంది పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 63,49,953 నమూనాలను పరీక్షించారు.


07.10.20
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 66,769 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా 5,120 మంది కరోనా బారినపడగా.. 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,34,427కు చేరింది. గడిచిన 24 గంటల్లో 6,349 మంది బాధితులు కొవిడ్‌ బారినుంచి కోలుకోగా.. ఇప్పటివరకు మొత్తంగా 6,78,828 మంది బాధితులు కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. రాష్ట్రంలో కరోనా బారినపడి ఇప్పటివరకు 6,086 మంది ప్రాణాలు కోల్పోగా.. 46,513 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 62,83,009 కొవిడ్‌ నమూనాలు పరీక్షించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
గడిచిన 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఐదుగురు, అనంతపురం, చిత్తూరు, కృష్టా జిల్లాల్లో నలుగురు చొప్పున, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కడప, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, ప్రకాశం జిల్లాల్లో ఒకరు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.


06.10.20
అమరావతి: ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నట్టే కనిపించినా మళ్లీ పెరిగాయి. ఒక్కరోజు వ్యవధిలో 65,889 నమూనాలను పరీక్షించగా 5,795 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 7,29,307కి చేరింది. ఈ మేరకు ఏపీ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 33 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందారు. కృష్ణా జిల్లాలో 6 మంది, ప్రకాశం 5, తూర్పుగోదావరి 4, విశాఖపట్నం 4, అనంతపురం 3, చిత్తూరు 3, గుంటూరు, నెల్లూరు, పశ్చిమగోదావరిలో ఇద్దరేసి.. కడప, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. తాజా మరణాలతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 6,052కి చేరింది. 24 గంటల్లో 6,046 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 62,16,240 నమూనాలను పరీక్షించినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు.

05.10.20
అమరావతి: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఒక్కరోజు వ్యవధిలో 56,145 నమూనాలను పరీక్షించగా 4,256 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌ సోకిన వారి సంఖ్య 7,23,512కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 38 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందారు. కృష్ణా జిల్లాలో ఏడుగురు, చిత్తూరు 5, కడప 5, గుంటూరు 4, విశాఖపట్నం 4, తూర్పుగోదావరి 3, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరేసి.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 6,019కి చేరింది. ఒక్కరోజులో 7,558 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు 61,50,351 నమూనాలను పరీక్షించినట్లు అధికారులు బులెటిన్‌లో పేర్కొన్నారు.

04.10.20
అమరావతి: ఏపీ ప్రభుత్వం కరోనా బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఒక్కరోజు వ్యవధిలో 72,811 నమూనాలను పరీక్షించగా 6,242 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,19,256కి చేరింది. 24 గంటల వ్యవధిలో 40 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందారు. కృష్ణా జిల్లాలో 6 మంది, అనంతపురంలో 5, చిత్తూరు 5, తూర్పుగోదావరి 4, గుంటూరు 4, నెల్లూరు 4, ప్రకాశం 3, విశాఖపట్నం 3, శ్రీకాకుళం 2, పశ్చిమగోదావరి 2, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 5,981కి చేరింది. ఒక్కరోజులో 7,084 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 60,94,206 నమూనాలను పరీక్షించినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు.

03.10.20
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. 24 గంటల్లో (శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు) 72,861 నమూనాలను పరీక్షించగా 6,224 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య  7,13,014కి చేరింది. కరోనాతో ఇవాళ మరో 41 మంది ప్రాణాలు విడిచారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడి 5,941 మంది మృతి చెందారు. వివిధ కొవిడ్‌ ఆసుపత్రులు, హోం ఐసోలేషన్‌లో 55, 282 మంది చికిత్స పొందుతుండగా.. 6,51,791 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం తెలిపింది. కరోనాతో ఇవాళ కృష్ణా జిల్లాలో ఆరుగురు, చిత్తూరు జిల్లాలో ఐదుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, ప్రకాశంలో నలుగురు, విశాఖ పట్నంలో నలుగురు, నెల్లూరు ముగ్గురు, అనంతపురం, కడప, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరేసి, విజయనగరం, పశ్చిమగోదావరిలో ఒక్కరు మరణించారు. గడిచిన 24 గంటల్లో 7,798 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. నేటి వరకు రాష్ట్రంలో 60,21,395 నమూనాలను పరీక్షించినట్లు వైద్య శాఖ వెల్లడించింది.

02.10.20
అమరావతి: ఏపీలో కొత్తగా 6,555 కరోనా పాజిటివ్‌ కేసులు, 31 మరణాలు సంభవించినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,06,790కు చేరింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి కారణంగా 5,900 మంది మృత్యువాత పడ్డారు. గడిచిన 24 గంటల్లో వ్యవధిలో 70,399 నమూనాలను పరీక్షించారు. 
కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 6,43,993 మంది డిశ్చార్జి అవ్వగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 56,897 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 59,48,534 పరీక్షలు నిర్వహించారు. కొవిడ్‌ కారణంగా గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఆరుగురు; అనంతపురం, తూ.గోదావరిలో నలుగురు; చిత్తూరు, కర్నూలు, విశాఖలో ముగ్గురు; గుంటూరు, ప్రకాశం, ప.గోదావరిలో ఇద్దరు; కడప, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

01.10.20
అమరావతి: ఏపీలో కరోనా కేసులు 7లక్షలు దాటాయి. 24 గంటల వ్యవధిలో 71,577 నమూనాలను పరీక్షించగా 6,751 మందికి కొవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,00,235కి చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో 41 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో 7 మంది, కృష్ణా 6, ప్రకాశం 5, విశాఖపట్నం 5, అనంతపురం 4, తూర్పుగోదావరి 4, గుంటూరు 3, కడప 3, పశ్చిమగోదావరి 2, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 5,869కి చేరింది. 24 గంటల వ్యవధిలో 7,297 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 58,78,135 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది. ప్రస్తుతం 57,858 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది.


Thanks for reading AP Media bulletin: Details of today's Covid-19 cases

No comments:

Post a Comment