Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, October 17, 2020

Central Government plan for early vaccine distribution


 తొలిదశ టీకా పంపిణీకి కేంద్రం కార్యాచరణ


దిల్లీ: కరోనా టీకా తొలిదశ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. తొలి దశలో దేశంలోని 23 శాతం మంది జనాభాకు కరోనా టీకా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా మొదటి దశలో ఆరోగ్య కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు సైతం వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. వీరిలో అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ వ్యాక్సిన్ల ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన క్లినికల్‌ ప్రయోగాల దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే ఎవరికి ముందు ఇవ్వాలన్న దానిపై కేంద్రం కసరత్తు మొదలు పెట్టినట్లు ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. వ్యాక్సిన్‌ ఎవరికి ఇవ్వాలి? అన్న విషయంలో నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఇందులో 50-70 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు, 2కోట్ల మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌(పోలీస్‌, మున్సిపల్‌, సైనిక బలగాలు), 50ఏళ్ల వయసు దాటిన 26కోట్ల మంది ఉండగా, నాలుగో కేటగిరిలో 50 ఏళ్లు కన్నా తక్కువ వయసు వారిని చేర్చినట్టు సమాచారం. 


ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. పుణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ కూడా‌ ఫేజ్‌-3 ట్రయల్స్‌ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన పూర్తి నివేదికలు నవంబరు చివరికి లేదా డిసెంబరు మొదటి వారంలో వస్తాయని ఇటీవల కేంద్రం తెలిపింది. ఇందులో భాగంగానే కేంద్రం వ్యాక్సిన్‌ తొలిదశ పంపిణీకి కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

వ్యాక్సిన్‌ పంపిణీ ఏర్పాట్లపై మోదీ కీలక సమీక్ష

దేశంలో కరోనా వైరస్‌ పరిస్థితి, వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలా పంపిణీ చేయాలనే అంశంపై చర్చించారు. ప్రజలందరికీ ఈ వ్యాక్సిన్‌ను త్వరగా అందించేలా ఏర్పాట్లు చేయాలని ప్రధాని సూచించారు. ఈ ఏర్పాట్లు చేసేటప్పుడు దేశ భౌగోళిక పరిస్థితులు, వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. దేశంలో మూడు వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయని పీఎంవో తెలిపింది. వీటిలో రెండు వ్యాక్సిన్లు రెండో దశలో ఉండగా.. ఒక వ్యాక్సిన్‌ మూడో దశ ప్రయోగాల్లో ఉన్నట్టు పేర్కొంది. కరోనా వైరస్‌ జన్యుపరంగా స్థిరంగా ఉందని  పాన్‌ ఇండియా సర్వేలు తెలిపాయని పీఎంవో పేర్కొంది. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్దన్‌, ప్రధాని ప్రిన్సిపల్‌ సెక్రటరీ, నీతి ఆయోగ్‌ (వైద్యం) సభ్యుడు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నట్టు పీఎంవో తెలిపింది.

Thanks for reading Central Government plan for early vaccine distribution

No comments:

Post a Comment