Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, October 14, 2020

Good news for AP students .. 5 new courses in Polytechnic ..


 ఏపీ విద్యార్దులకు గుడ్ న్యూస్ .. పాలిటెక్నిక్ లో కొత్తగా 5 కోర్సులు ..


ఏపీ విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలోని పలు ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్తగా ఐదు డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టేందుకు అనుమతించింది. వెబ్ డిజైనింగ్, 3-డీ యానిమేషన్ గ్రాఫిక్స్, యానిమేషన్-మల్టీమీడియా టెక్నాలజీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ, సీఎస్సీ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) డిప్లొమా కోర్సులను ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకొస్తూ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది, శిక్షణా శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. (New courses sanctioned for private polytechnics)

గుంటూరు జిల్లా చెబ్రోలు మండలంలోని సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 3-డీ యానిమేషన్ గ్రాఫిక్స్, యానిమేషన్- మల్టీమీడియా టెక్నాలజీ, వెబ్ డిజైనింగ్‌లో డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టడానికి అనుమతించింది.

అలాగే తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం కిమ్స్ కాలేజీలో ప్యాకేజింగ్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వగా.. కోరంగిలోని కిమ్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్‌లో 3-డీ యానిమేషన్ గ్రాఫిక్స్ డిప్లొమా కోర్సును అనుమతించింది.

అటు రాజానగరంలోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఫర్ విమెన్‌లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)లో డిప్లొమా కోర్సును మంజూరు చేసింది. ఈ కోర్సుల్లో ప్రవేశం పొందే అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కోర్సుల వ్యవధి మూడేళ్గుగా నిర్ణయించారు. కాగా, SBTET నిబంధనల ప్రకారం పాలీసెట్ ద్వారా ప్రవేశాలను నిర్వహించనున్నారు.

Thanks for reading Good news for AP students .. 5 new courses in Polytechnic ..

No comments:

Post a Comment