Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, October 29, 2020

IBPS PO Recruitment 2020: Good News ... 3517 New Notification for Bank Job Replacement


 IBPS PO Recruitment 2020 : గుడ్ న్యూస్ ... 3517 బ్యాంకు ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్


ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్-IBPS ప్రొబెషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే 1167 పోస్టులతో కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్-CRP-X నోటిఫికేషన్ విడుదలైంది. నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఆ నోటిఫికేషన్‌కు సప్లిమెంటరీగా కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అనుబంధ నోటిఫికేషన్ ద్వారా 3517 ప్రొబెషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఐబీపీఎస్. కెనరా బ్యాంక్, యుకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుల్లో ఈ పోస్టులున్నాయి. దరఖాస్తు ప్రక్రియ 2020 అక్టోబర్ 28న ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2020 నవంబర్ 11 చివరి తేదీ.

2020 నవంబర్ 11 నాటికి విద్యార్హతలు సాధించినవారికి, 2020 ఆగస్ట్ 5 నాటికి రిజిస్టర్ చేసుకోలేనివారికి దరఖాస్తుచేయడానికి అవకాశం ఉంటుందని ఐబీపీఎస్ ప్రకటించింది. ఐబీపీఎస్ పీఓ ప్రిలిమినరీ ఎగ్జామ్ 2021 జనవరి 5, 6 తేదీల్లో జరుగుతుంది. ఈ సప్లిమెంటరీ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.ibps.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా చదివి ఐబీపీఎస్ తెలిపినట్టు విద్యార్హతలు, ఇతర అర్హతలు ఉన్నవారే అప్లై చేయాలి. ఆగస్టు 5 నుంచి 26 వరకు దరఖాస్తు చేసినవాళ్లు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. వారికి అక్టోబర్‌లోనే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది.

మొత్తం ఖాళీలు- 3517

కెనరా బ్యాంక్- 2100

యుకో బ్యాంక్- 350బ్యాంక్ ఆఫ్ ఇండియా- 734

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర- 250

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్- 83


దరఖాస్తు ప్రారంభం- 2020 అక్టోబర్ 28

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 నవంబర్ 11

దరఖాస్తుల ఎడిటింగ్, మాడిఫికేషన్- 2020 అక్టోబర్ 28 నుంచి నవంబర్ 11

ప్రిలిమినరీ ఎగ్జామ్- 2021 జనవరి 5 లేదా 6

కాల్ లెటర్ విడుదల- పరీక్షకు 10 రోజుల ముందు

విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి.

వయస్సు- 20 నుంచి 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు- రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175.

అభ్యర్థులు ముందుగా https://www.ibps.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

హోమ్ పేజీలో CRP PO/MT నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

అందులో నోటిఫికేషన్, ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్స్ ఉంటాయి.

ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

అందులో Click here for New Registration పైన క్లిక్ చేయాలి.

మీ పేరు, ఇతర వివరాలన్నీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

దరఖాస్తు సబ్మిట్ చేసే ముందు వివరాలన్నీ చెక్ చేసుకోవాలి.

దరఖాస్తు సబ్మిట్ చేసి ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

Thanks for reading IBPS PO Recruitment 2020: Good News ... 3517 New Notification for Bank Job Replacement

No comments:

Post a Comment