Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, October 19, 2020

Indian Navy Jobs 2020: Jobs in Indian Navy


 Indian Navy Jobs 2020: ఇంటర్ పాసైనవారికి ఇండియన్ నేవీలో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా



Indian Navy 10+2 (B.Tech) Cadet Entry Scheme  ఇంటర్ పాసయ్యారా? బీటెక్ కోర్సులో జాయిన్ కావాలనుకుంటున్నారా? ఇండియన్ నేవీ అకాడమీలో బీటెక్ చదివి అక్కడే ఉద్యోగం పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.


ఇండియన్ నేవీలో ఉద్యోగం కోరుకునేవారికి శుభవార్త. క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ద్వారా పలు ఖాళీలను భర్తీ చేస్తోంది ఇండియన్ నేవీ. 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌ను ప్రకటించింది. మొత్తం 34 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 అక్టోబర్ 6న ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 20 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.joinindiannavy.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్ 2020 పరీక్ష రాసినవారు దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేయడానికి పెళ్లి కాని యువకులకు మాత్రమే అర్హత ఉంటుంది. ఎంపికైనవారు 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ద్వారా కేరళలోని ఇండియన్ నేవల్ అకాడమీలో నాలుగేళ్ల బీటెక్ కోర్సు చేయొచ్చు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసినవారిని ఎడ్యుకేషన్, ఎగ్జిక్యూటీవ్, టెక్నికల్ బ్రాంచ్‌లల్లో నియమిస్తుంది ఇండియన్ నేవీ.

Indian Navy 10+2 (B.Tech) Cadet Entry Scheme: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


మొత్తం ఖాళీలు- 34


ఎడ్యుకేషన్ బ్రాంచ్- 5


ఎగ్జిక్యూటీవ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్- 29


దరఖాస్తు ప్రారంభం- 06.10.2020


దరఖాస్తుకు చివరి తేదీ- 20.10.2020

ఇంటర్వ్యూ- 2020 నవంబర్ నుంచి 2021 జనవరి మధ్య

విద్యార్హత:10+2 లేదా తత్సమాన పరీక్ష పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో కనీసం 70% మార్కులు ఉండాలి. ఇంగ్లీష్‌లో 50% మార్కులుండాలి.


వయస్సు- 2001 జూలై 2 నుంచి 2004 జనవరి 1 మధ్య జన్మించినవారు అప్లై చేయాలి.


ఎంపిక విధానం- జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ రెండు దశల్లో ఉంటుంది. స్టేజ్ 1 లో ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్, గ్రూప్ డిస్కషన్ ఉంటాయి. స్టేజ్ 1 క్వాలిఫై అయినవారికి సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టెస్టింగ్, ఇంటర్వ్యూ ఉంటాయి. రెండు దశల ఇంటర్వ్యూ విజయవంతంగా పూర్తి చేసిన వారికి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.


ఇంటర్వ్యూ నిర్వహించే ప్రాంతం- విశాఖపట్నం, బెంగళూరు, కోల్‌కతా, భోపాల్.

Thanks for reading Indian Navy Jobs 2020: Jobs in Indian Navy

No comments:

Post a Comment