Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, October 5, 2020

ISRO Recruitment 2020: Jobs in Isro... Ten passers can apply


ISRO Recruitment 2020 :ISRO లో ఉద్యోగాలు ... టెన్ పాసైనవారూ అప్లై చేయొచ్చు

కరోనా వైరస్ సంక్షోభం కారణంగా వాయిదా పడ్డ జాబ్ నోటిఫికేషన్లకు ఆయా సంస్థలు దరఖాస్తు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. అందులో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ISRO నోటిఫికేషన్ కూడా ఒకటి. మొత్తం 55 పోస్టులతో ఈ విడుదలైంది. గతంలోనే దరఖాస్తు గడువు ముగిసినా అప్లై చేయనివారికి మరో అవకాశాన్ని కల్పించింది ఇస్రో. ఇన్నాళ్లూ చివరి తేదీ ప్రకటించకుండా దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఇప్పుడు చివరి తేదీ ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు గడువు 2020 అక్టోబర్ 15న ముగుస్తుందని ఇస్రో ప్రకటించింది. కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 15 లోగా దరఖాస్తు చేయాలి. ముందే ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం జూన్ 7న స్క్రీనింగ్ టెస్ట్ పూర్తి కావాలి.


కానీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ పరీక్షవాయిదా పడింది. త్వరలో స్క్రీనింగ్ టెస్ట్ వివరాలను కూడా ప్రకటించనుంది ఇస్రో. ఇక ఈ నోటిఫికేషన్ వివరాలు చూస్తే అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో టెక్నీషియన్ బీ, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇస్రో. మొత్తం 55 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు నోటిఫికేషన్ వివరాలను https://recruitment.sac.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

TCS National Qualifier Test: ఈ పరీక్ష పాసైతే కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగావకాశాలు... అప్లై చేయండిలా Online Courses: కేరళ యువతి సంచలనం... 90 రోజుల్లో 350 ఆన్‌లైన్ కోర్సులు పూర్తి

మొత్తం ఖాళీలు- 55
సైంటిస్ట్ / ఇంజనీర్- 21
టెక్నికల్ అసిస్టెంట్- 6టెక్నీషియన్ బీ - 28
ఫిట్టర్-6
మెషినిస్ట్-3
ఎలక్ట్రానిక్స్-10
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-2
ప్లంబర్-1
కార్పెంటర్-1
ఎలక్ట్రీషియన్-1
మెకానికల్-3
కెమికల్-1

దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 14
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 అక్టోబర్ 15 సాయంత్రం 5 గంటలు
స్క్రీనింగ్ టెస్ట్- త్వరలో తేదీలను వెల్లడించనున్న ఇస్రో
విద్యార్హత- సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టుకు ఎలక్ట్రానిక్స్‌లో పీహెచ్‌డీ, ఎంఎస్సీ ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్‌, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఎంఈ లేదా ఎంటెక్. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. టెక్నీషియన్ బీ పోస్టులకు 10వ తరగతి, ఐటీఐ.
వయస్సు- 2020 మార్చి 27 నాటికి 18 నుంచి 25 ఏళ్లు

అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.
ఆ తర్వాత https://recruitment.sac.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
పేజీలో Apply Online పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
ఆ తర్వాత continue పైన క్లిక్ చేయాలి.
పోస్టులు, విద్యార్హతల వివరాలు ఉంటాయి.
మీరు దరఖాస్తు చేయాలనుకున్న పోస్టు చివర్లో Apply పైన క్లిక్ చేయాలి.
మీ పేరు, అడ్రస్, ఇతర వివరాలన్నీ ఎంటర్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
దరఖాస్తు చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

Thanks for reading ISRO Recruitment 2020: Jobs in Isro... Ten passers can apply

No comments:

Post a Comment