Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, October 6, 2020

MDM workers should not wear these: Central Education Conditions


 MDM workers should not wear these: Central Education Conditions



మధ్యాహ్నభోజన కార్మికులు ఇవి ధరించకూడదు : కేంద్ర విద్యాశాఖ షరతులు


✰ mid-day meal workers పిల్లలు మధ్యాహ్న భోజన సమయంలో గుంపులుగా ఉండకుండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.


✰ అలాగే భోజనాన్ని శుభ్రమైన ప్రదేశాల్లో చేయాలని, వంట చేసే వారు రింగులు, గాజులు ధరించకూడదని వెల్లడించింది.


✰ గోళ్ల రంగు కూడా వేసుకోకూడదని పేర్కొంది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు గైడ్‌లైన్స్‌ని తయారుచేసుకోవచ్చునని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొక్రియల్ నిషాంక్ తెలిపారు.


𒊹︎︎︎ మార్గదర్శకాలివే:


✰ మధ్యాహ్న భోజనం తయారుచేసే వారిలో ఎవరికీ పాజిటివ్‌ లేకుండా జిల్లా స్థాయి అధికారులు చూసుకోవాలి.


✰ పాఠశాలలు ప్రారంభం అవ్వకముందే వంట మనుషులు, వారికి సహాయం చేసే వారి ఆరోగ్యం, అలాగే వారి ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ధ్రువీకరణ తీసుకోవాలి.


✰ పాఠశాలలో ప్రవేశించేముందు వారికి థర్మల్ పరీక్షలు చేయాలి.


✰ మధ్యాహ్న భోజన కార్మికులు కచ్చితంగా మాస్క్‌ ధరించాలి.


✰ నెయిల్ పాలిస్‌(గోళ్ల రంగు) లేదా ఆర్టిఫిషియల్ గోళ్లు ధరించకూడదు.


✰ వంట చేసేటప్పుడు, వడ్డించేటప్పుడు మధ్యాహ్న భోజన కార్మికులు చేతి గడియారం, రింగులు, గాజులు, బంగారంను ధరించకూడదు.


✰ ఉమ్మివేయం, ముక్కును తడుముకోవడం నిషేధం.


✰ మధ్యాహ్న భోజన కార్మికులు శుభ్రమైన ఆప్రాన్లను ధరించాలి.


✰ కూరగాయలను ఉప్పు-పసుపు లేదా 50 పీపీఎమ్‌ క్లోరిన్‌తో కడగాలి.


✰ అన్నం వడ్డించే సమయంలో భౌతిక దూరం పాటించేలా బ్యాచ్‌లుగా విద్యార్థులను విభజించాలి.


✰ అలా కుదరకపోతే వారి వారి క్లాస్ రూమ్‌లలో భోజనం వడ్డించాలి.


✰ సీటింగ్ అరేంజ్‌మెంట్‌లో మార్కింగ్‌ ఉండాలి.


✰ భోజనం 65డిగ్రీల సెల్సియస్‌ ఉండాలి. అన్నం వండిన వెంటనే వడ్డించకూడదు.

Thanks for reading MDM workers should not wear these: Central Education Conditions

No comments:

Post a Comment