Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, October 20, 2020

Neurological complications caused by Kovid and precautions to be taken.


 మన జాగ్రత్తలే.. మనకు రక్ష 



కరోనా వైరస్​ మనిషి ఆరోగ్యంపై ఎంత తీవ్ర పరిణామాలను చూపిస్తోందో వింటూనే ఉన్నాం. అయితే మామూలుగా మనకు తెలిసినంతవరకు కోవిడ్ ప్రైమరీగా ఊపిరితిత్తుల మీదనే ఎఫెక్ట్​ చూపిస్తోంది. కానీ గుండె, మెదడుపైన కూడా ఈ కరోనా వైరస్​ డైరెక్ట్​గా ఎఫెక్ట్​ అయిన కేసులు కూడా రెగ్యులర్​గా వస్తున్నాయంటున్నారు న్యూరో డాక్టర్లు. కోవిడ్​ వల్ల వస్తున్న న్యూరోలాజికల్​ కాంప్లికేషన్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి న్యూరో సర్జన్​ డాక్టర్​ నరేశ్​ గజ్జల వివరంగా చెప్తున్నారు.


పోస్ట్​ కోవిడ్​ నొప్పులు

కరోనా వచ్చి తగ్గిన చాలామంది పేషెంట్లలో తలనొప్పి, కండరాల నొప్పులు ఉంటున్నాయి. అయితే ఇవి ప్రతి వైరల్​ ఫీవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండేవే. కాకపోతే, కోవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాధితుల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఈ నొప్పులు నెగెటివ్​ రిపోర్ట్​ వచ్చాక కూడా కొంతమందికి చాలారోజుల వరకు ఉంటున్నాయి. వీటితో పాటు త్వరగా అలసిపోవడం కామన్​గా కనిపిస్తోంది. ఇలాంటి సమస్యలు ఒక నెలవరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. వీటికోసం స్పెషల్​గా మెడిసిన్​ తీసుకోనవసరం లేదు. హెల్దీ ఫుడ్​ తింటూ ఐదారు లీటర్ల నీళ్లు తాగుతుండాలి.


స్ట్రోక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి కారణాలు

కరోనా పేషెంట్లలో స్ట్రోక్స్​ వస్తున్న కేసులు కూడా బాగా పెరిగాయి. కారణం కోవిడ్​ పేషెంట్ల రక్తంలో డీ– డైమర్స్, ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీహెచ్, ఫెరెటిన్​ లెవల్స్​పెరగడం. దీనివల్ల రక్తం గడ్డ కట్టే స్వభావం ఏర్పడుతుంది. అలా గుండె, మెదడులో రక్తం గడ్డలు కట్టి బ్రెయిన్​ స్ట్రోక్, హార్ట్​ స్ట్రోక్స్​ వస్తున్నాయి. బ్రెయిన్​ స్ట్రోక్​ వల్ల పేషెంట్లకి పక్షవాతం, మాట పడిపోవడం, మూతి వంకరవ్వడం వంటి పరిస్థితులను చూస్తున్నాం. నార్మల్​ పేషెంట్లలో వచ్చే స్ట్రోక్​ కంటే కోవిడ్​ పేషెంట్లలో డెత్​రేట్​ఎక్కువగా ఉంటోంది. గడ్డ కట్టిన రక్తాన్ని పల్చబర్చడానికి ఇచ్చే ట్రీట్​మెంట్ టైమ్​కూడా కోవిడ్​ పేషెంట్లలో ఎక్కువ పడుతోంది.


మతిమరుపు

కోవిడ్​ నుంచి కోలుకున్న వాళ్లలో కొందరు మతిమరుపుతో బాధపడుతున్నట్లు స్టడీస్​​చెప్తున్నాయి. ఇదే సమస్య ఎక్కువకాలం కొనసాగితే దాన్ని డిమెన్షియా అంటారు. అరవయ్యేళ్లు దాటిన పేషెంట్లలో ఈ సమస్య లాంగ్​టర్మ్​గా ఉండే అవకాశం ఉంది. దీనికి సెపరేట్ ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్​అంటూ ఏమీ ఉండదు. కాకపోతే కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్, మెమొరీ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెంచే ట్యాబ్లెట్స్​ వేసుకోవచ్చు.


రకరకాల న్యూరో ఇన్ఫెక్షన్లు

కోవిడ్​ పేషెంట్లలో ఎన్నోరకాల న్యూరోలాజికల్​ ఇన్ఫెక్షన్స్​ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా  నరాల బలహీనతకు సంబంధించిన గ్వెలెన్​ బార్​ సిండ్రోమ్​(జీబీఎస్​) అనే సమస్య కరోనా వల్ల కనిపిస్తోంది. ఇది మన దేశంలో తక్కువగా ఉన్నా వెస్ట్రన్​ కంట్రీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. అలాగే ఎన్కెఫలైటిస్ ​అనే మెదడుకు సంబంధించిన ఇన్ఫెక్షన్​ కూడా కోవిడ్​ పేషెంట్లలో వస్తోంది. ఈ ఇన్ఫెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి రికవరీ రేట్​​చాలా తక్కువ. అందువల్ల సమస్య వచ్చాక ట్రీట్​మెంట్​ కోసం ఎదురుచూసేకంటే.. కరోనా వైరస్​ బారినపడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.


పోస్ట్​ కోవిడ్​ జాగ్రత్తలు

తాజా పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ ​వంటివి తినాలి. జంక్​ఫుడ్​ జోలికి పోవద్దు. రోజుకు కనీసం ఆరు లీటర్ల మంచినీళ్లు తాగాలి.

జింక్, క్యాల్షియం, విటమిన్ డి–3 సప్లిమెంట్లను మూడు నెలలపాటు వాడాలి.

హై ప్రొటీన్​ ఫుడ్, ప్రొటీన్​ పౌడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని రెగ్యులర్​గా తీసుకోవాలి.

బేసిక్​ఎక్సర్​ సైజులు, వాకింగ్, యోగ వంటివి పోస్ట్​ కోవిడ్​ సమస్యల నుంచి రిలీఫ్​ ఇస్తాయి.

స్ట్రోక్​ వచ్చిన పేషెంట్లు డాక్టర్ల సలహాతోనే మెడిసిన్​ తీసుకోవాలి. బాగానే ఉన్నామనుకుని డాక్టర్లను అడగకుండా మెడిసిన్​ని మధ్యలోనే ఆపొద్దు.

Thanks for reading Neurological complications caused by Kovid and precautions to be taken.

No comments:

Post a Comment