Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, October 22, 2020

One DA along with a November salary


 నవంబరు జీతంతో పాటు ఒక డీఏ

*ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం అన్న సజ్జల

  ముఖ్యమంత్రి సూచన మేరకే సమావేశాలు

ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలని గట్టిగా అడిగాం

*కె ఆర్ సూర్యనారాయణ వెల్లడి


ఉద్యోగులకు అంత ఆశాజనకమైన సమాచారం ఏమీ లేదు. ప్రభుత్వం ప్రస్తుతానికి ఒక్క  డీ ఏ మాత్రమే ఇవ్వడానికి సిద్ధంగా  ఉందని చెప్పింది.


నవంబరు నెల జీతంతో పాటు డిసెంబర్లో ఒక డీ ఏ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.ఆర్. సూర్యనారాయణ ‘ ఉద్యోగులు న్యూస్’కు చెప్పారు. ముఖ్యమంత్రి సూచన మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘ నాయకులతో విడివిడిగా సమావేశమయ్యారు. కె.ఆర్.సూర్యనారాయణతోను విడిగా మాట్లాడారు. ప్రధానంగా రాష్ర్ట ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉందని ఈ సమావేశంలో ఆయన నేతలకు వివరించేందుకు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకే తాను ఉద్యోగ సంఘ నాయకులతో మాట్లాడుతున్నట్టు చెప్పారు . వీటిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాల్సిందేనని డిమాండ్ చేసినట్లు సూర్యనారాయణ చెప్పారు.

ముఖ్యమంత్రి జగన్ తో తమ సంఘానికి విడిగా అపాయింట్ మెంట్ ఇప్పించాలని కూడా కె.ఆర్.సూర్యనారాయణ విన్నవించారు.

Thanks for reading One DA along with a November salary

No comments:

Post a Comment