Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, October 4, 2020

papaya .. This is the best fruit for immunity!


బొప్పాయితో కరోనాకు చుక్కలే.. రోగ నిరోధక శక్తికి ఇదే బెస్ట్ ఫ్రూట్!

రోగ నిరోధక శక్తి పెంచుకోడానికి ప్రయత్నిస్తున్నారా? అయితే, తప్పకుండా ఈ పండును మీ డైట్‌లో చేర్చుకోండి. అన్నిరకాలకు ఇదే సరైన మందు.

కరోనా వైరస్ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడం పైనే ఉంది. ఈ నేపథ్యంలో చాలామంది ఇంటి చిట్కాలను పాటిస్తున్నారు. గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాడగడం, పసుపు పాలను సేవించడం అలవాటు చేసుకుంటున్నారు. కొందరు వ్యాయామాలతో ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. వీటితోపాటు వివిధ పండ్లను తీసుకుంటూ ఆరోగ్యంగా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ పండ్లలో రోగ నిరోధక శక్తిని పెంచే బెస్ట్ ఫ్రూట్ ఏమిటనే సందేహం చాలామందికి ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పండ్లలో బొప్పాయే మంచి రోగ నిరోధక శక్తిని అందించే ఫ్రూట్ అని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఈ పండు వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేమిటో చూసేద్దామా!

బొప్పాయితో ఆరోగ్యం

కరోనా వైరస్ మొదలైన రోజు నుంచి సోషల్ మీడియాలో రోగనిరోధక శక్తి పెంచే ఆహారాల గురించి అనేక పోస్టులు షేరవ్వుతున్న సంగతి తెలిసిందే. అల్లం, వెల్లులి, తేనె, తులసి వంటివి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయిని చెబుతున్నారు. అయితే, వీటిని రోజు తీసుకోవడం కొంచెం కష్టమే. పైగా ఇవి నోటికి పెద్దగా రుచించవు కూడా. అలాగని, వాటిని మానేయడం కూడా అంత శ్రేయస్సు కాదు. అయితే, బొప్పాయి పండు మీ నోటిని తీపి చేయ్యడమే కాకుండా వైరస్‌తో కూడా పోరాడుతుంది. ఇది దీర్ఘాకాలిక రోగాలను సైతం దూరంగా ఉంచుతుంది.

రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుతుంది?

బొప్పాయిని ఇన్నాళ్లు మనం సాధారణ పండుగానే భావిస్తున్నాం. భిన్నమైన రుచితో తినేకొద్ది తినాలనిపిస్తుంది. బొప్పాయి, వాటిలోని ఇతరాత్ర పదార్థాలను ఔషదాలను తయారీకి ఉపయోగిస్తారనే సంగతి మీకు తెలుసా? ఆయుర్వేదంలో కూడా బొప్పాయి ఏ విధంగా ఆరోగ్యాన్ని అందిస్తుందనే విషయం ప్రస్తావనలో ఉంది. బొప్పాయిలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో బోలెడంత ఫైబర్ ఉంటుంది. ఫోలేట్, B6, కాల్షియం, మ్యాగ్నిషియం, విటమిన్ A, C, B1, B3, E, K, పొటాషియం వంటివి ఇందులో ఉన్నాయి. బొప్పాయిలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లెమ్యాటరీ లక్షణాలు క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటాయి. బొప్పాయి పండు మాత్రమే కాదు, ఆకులు కూడా ఆరోగ్యకరమేనని ఆహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు రక్తంలో ప్లేట్‌లెట్ట కౌంట్ పెంచేందుకు ఆకులు ఉపయోగపడతాయట.

జీర్ణక్రియకు మంచిది

బొప్పాయి పండు జీర్ణశక్తిని పెంపొందించడంలో కీలకంగా పనిచేస్తుంది. విరేచన సమస్యలను సహస సిద్ధంగా నివారిస్తుంది. అందుకే బొప్పాయి జీర్ణక్రియకు సంజీవని వంటిందని అంటారు. ఇది పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. బొప్పాయిలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ మూత్ర విసర్జన సక్రమంగా జరిగేందుకు ఉపయోగపడుతుంది. శరీరానికి పోషకాలను అందించేందుకు సహకరిస్తుంది. బొప్పాయి రోగ నిరోధక శక్తి పెంచేందుకు దోహదం చేస్తుంది. ఎందుకంటే.. అత్యధిక రోగ నిరోధక కణాలన్నీ ఆంత్రము లేదా పెద్ద, చిన్న పేగుల్లోనే ఉంటాయి. బొప్పాయి వల్ల అవి ఆరోగ్యంగా ఉండి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

రోగాలతో పోరాడుతుంది

బొప్పాయిలో ఉండే అత్యధిక యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్.. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడతాయి. దీనివల్ల శరీరానికి వైరస్, బ్యాక్టీరియాల, సూక్ష్మ జీవులపై పోరాడే శక్తి లభిస్తుంది. బొప్పాయిలోని విటమిన్ C, E, బీటా కారోటీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఊపిరితీత్తులు, నాసికా కుహరం (ముక్కు రంథ్రాలు)లో గాలి ప్రసరణ సమస్యలను తగ్గిస్తాయి. జ్వరం, గొంతు మంట, జలుబు వల్ల కలిగే బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది

బొప్పాయిలో విటమిన్ C, E తోపాటు లైకోపీన్, బీటా కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొవ్వులను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా ధమనుల్లో పేరుకుపోయే కొవ్వులను తగ్గిస్తాయి. దీనివల్ల గుండెకు హాని చేసే చెడు కొవ్వు పేరుకుపోకుండా రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. ఫలితంగా భవిష్యత్తులో గుండె సమస్యలే ధరిచేరవు. బొప్పాయి కణితులు, క్యానర్స్‌ కణాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రొమ్ము క్యాన్సర్ చికిత్సలో భాగంగా బొప్పాయిని తీసుకోవడం మంచిదని చెబుతారు. అయితే, దీన్ని డైట్‌లో చేర్చుకోడానికి ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

రక్తపోటు, మధుమేహం సమస్యలు నివారిస్తుంది

బొప్పాయిలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల శరీరంలో హై బ్లడ్ ప్రెజర్‌ను నియంత్రించి బ్యాలెన్స్ చేస్తుంది. శరీరంలో అధిక సోడియంను సైతం ఇది బ్యాలెన్స్ చేస్తుంది. స్క్రోక్స్ వంటి సమస్యలు కూడా రానివ్వదు. అలాగే, మధుమేహం రోగులకు సైతం బొప్పాయి మంచిదే. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మధుమేహాన్ని సహజంగా నయం చేయడానికి ఉపయోగపడతాయి. బొప్పాయిలో కేలరీలు తక్కువ. కాబట్టి బరువు పెరగరు. మధుమేహం ఉన్న వారు, వస్తాదని భయపడేవారు బొప్పాయిని తినొచ్చు. అయితే, ఇందులో సహజసిద్ధ చక్కెర్లు ఉంటాయి. కాబట్టి మితంగానే తినాలి. బొప్పాయిలో ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. లంచ్, డిన్నర్‌కు మధ్యలో సాయంత్రం వేళ కొన్ని బొప్పాయి ముక్కలను తింటే మంచిది. కరోనా వల్ల మధుమేహం రోగులకే ఎక్కువ ప్రమాదం కాబట్టి.. వైద్యుల సలహా తర్వాతే ఈ డైట్‌ను తీసుకోండి.

గమనిక: వైద్య నిపుణుల సూచనలు, పరిశోధనలు ఆధారంగా ఈ సమాచారాన్ని మీకు అందించాం. మీకు ఈ పండ్ల వల్ల అలర్జీలు, మరే ఇతర సమస్యలు ఉన్నా.. తప్పకుండా వైద్యుల సూచనలు తీసుకోవాలి.

Thanks for reading papaya .. This is the best fruit for immunity!

No comments:

Post a Comment