Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, October 20, 2020

Rajiv Gandhi University of Knowledge Technologies (RGUKT) - Alteration of the first statutes


🅰️🅿️ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు

★ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్‌జీయూకేటీ) ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

★ ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ విజయవాడలో ఫలితాలనువిడుదల చేశారు.

★ గుర్రం వంశీకృష్ణ(గుంటూరు),

★ జకీర్‌ హుసేన్‌(కడప) టాపర్లుగా నిలిచారు. 

★ జనవరి 4 నుంచి కౌన్సెలింగ్‌, 

★ 18 నుంచి తరగతులు మొదలవుతాయని మంత్రి వెల్లడించారు. 

★ ఈనెల 5న తెలుగు రాష్ట్రాల్లో 638 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.

★ మొత్తం 85,760 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు.

★ ఫలితాల కోసం క్రింద డైరెక్ట్ లింక్ ని ఉపయోగించండి.

Download RGUKT CET Results...Click here

Official website..Click here

RGUKT CET QUESTION PAPER DOWNLOAD BELOW

Booklet Code - B

Booklet Code - C

Booklet Code - D

Initial Key....Click here

Download RGUKT CET Results...Click here

Official website..Click here

27.11.20

In view of the impact of severe cyclone in few districts of Andhra Pradesh, RGUKT CET- 2020 scheduled to be held on 28-11-2020 is postponed to 05-12-2020 (Saturday). Students appearing for the Test are advised to note of this change. The test will be held between 11.00 AM and 01.00 PM on 05-12-2020 in designated centers. There is no change in the examination centers or hall tickets allotted to the candidates. Candidates are required to report at the allotted centers two hours before the commencement of the examination along with the hall ticket and any identity proof.



●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

26.11.20  పత్రికా ప్రకటన


●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

ఆర్జీయూకేటీ సెట్‌కు నిమిషం ఆలస్యం నిబంధన

రేపు ప్రవేశ పరీక్ష

 అమరావతి: ఏపీ, తెలంగాణలో శనివారం జరగనున్న రాజీవ్‌ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని కన్వీనరు హరినారాయణ స్పష్టం చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పరీక్షకు 88,972 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, వీరిలో ఏపీకి చెందినవారు 86,617 మంది ఉన్నారని తెలిపారు. 53 మంది అంధ విద్యార్థులు హాజరు కానున్నారని వెల్లడించారు. ఏపీలో 630, తెలంగాణలో 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో 4వేల సీట్లు, ఎన్జీ రంగా వ్యవసాయ, శ్రీవేంకటేశ్వర వెటర్నరీ, వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో డిప్లామా కోర్సులకు 6 వేల సీట్లు భర్తీ చేయనున్నట్లు తెలిపారు


●●●●○●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

IIIT HALLTICKET DOWNLOAD LINK⤵️

Hall tickets download.... Click Here


GOVERNMENT OF ANDHRA PRADESH  Rajiv Gandhi University of Knowledge Technologies (RGUKT) - Alteration of the first statutes i.e. Statute 13(4) of RGUKT - Orders - Issued - Reg.

రాష్ట్రవ్యాప్తంగా ఆర్​జీయూకేటీ పరీక్ష నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా 4 రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో ఆరేళ్ల బీటెక్ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. నవంబర్ 28న పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేశ్ వివరాలు వెల్లడించారు.

రాష్ట్రంలోని 4 రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో ఆరేళ్ల సమీకృత విద్యతో కూడిన బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి పరీక్ష నిర్వహణకు నోటిఫికేషన్‌ విడుదలైంది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి విజయవాడలో ఆర్​జీయూకేటీ పరీక్ష తేదీలను ప్రకటించారు. నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళంలలో ప్రవేశాలను ఇప్పటివరకు పదో తరగతి పరీక్షలో గ్రేడ్‌ ఆధారంగా నిర్వహించేవారు. ఈసారి కరోనా దృష్ట్యా పదో తరగతి పరీక్షల నిర్వహణ రద్దు చేయడం.. గ్రేడింగ్‌లు ఇవ్వలేకపోవటంతో ఉమ్మడి ప్రవేశ పరీక్ష అనివార్యమైందని మంత్రి సురేశ్ తెలిపారు.
పదో తరగతి సిలబస్‌ ఆధారంగా బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఆఫ్‌లైన్‌లోనే ఓఎమ్​ఆర్ షీట్‌లో సమాధానాలు రాయాల్సి ఉంటుందన్నారు. పదో తరగతి గణిత శాస్త్రం నుంచి 50 మార్కులు.. భౌతిక, జీవశాస్త్రాల నుంచి చెరో 25 మార్కులకు ప్రశ్నలు ఉంటాయని మంత్రి చెప్పారు. తప్పు సమాధానాలకు నెగెటివ్‌ మార్కులు ఉండవని స్పష్టంచేశారు. నమూనా ప్రశ్నపత్రం, సిలబస్‌ వివరాలను www.rgukt.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు.ఆర్​జీయూకేటీతోపాటు గుంటూరు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తిరుపతి వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్సాఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో రెండు, మూడేళ్ల డిప్లమో కోర్సుల్లో ప్రవేశానికి కూడా ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఈ తేదీల్లోనే నిర్వహిస్తున్నట్లు మంత్రి సురేశ్ వెల్లడించారు.
ఫీజు చెల్లించవలసిన తేదీలు : అక్టోబర్ 28-నవంబర్-10
అపరాధ రుసుముతో ఫీజు చెల్లింపునకు ఆఖరు తేదీ: నవంబర్ -15
హాల్ టికెట్ల డౌన్​లోడ్ : నవంబర్ -22 నుంచి
పరీక్ష నిర్వహణ : నవంబర్ -28
ఫలితాల వెల్లడి: డిసెంబర్ -5
100 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసిన ప్రతి మండలంలోనూ ఒక కేంద్రాన్ని ఎంపిక చేస్తామని.. ఒకవేళ వంద కంటే తక్కువ మంది ఉంటే దగ్గరగా ఉన్న సెంటర్‌కు వారిని కేటాయిస్తామన్నారు. తెలంగాణ ప్రాంతంలో రాయదలచుకున్న అభ్యర్ధుల కోసం 10 కేంద్రాలను గుర్తించామని తెలిపారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్గొండ కేంద్రాల్లో తెలంగాణ ప్రాంత అభ్యర్ధులు పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేశ్ వివరించారు.

IIIT HALLTICKET DOWNLOAD LINK⤵️

Hall tickets download.... Click Here






  SSC Board could not conduct the SSC Public examination March 2020 and marks secured in the SSC are not available for the AY 2019-20, the merit of the students cannot be prepared for admission in various courses offered by the RGUKT. Therefore, there is a need to conduct an entrance test based on 10th class syllabus prescribed by the Government of Andhra Pradesh to determine the merit of the student for the Academic Year 2020-21.





Thanks for reading Rajiv Gandhi University of Knowledge Technologies (RGUKT) - Alteration of the first statutes

No comments:

Post a Comment