Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, October 24, 2020

RBI's key decision on QR codes ...!


          క్యూఆర్ కోడ్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం ... !


 డిజిటల్ చెల్లింపుల కోసం పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్(పీఎస్‌వోస్) పేమెంట్ ట్రాన్సాక్షన్స్ కోసం కొత్తగా క్యూఆర్ కోడ్‌లను ప్రవేశపెట్టకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నిషేధం విధించింది. ఇప్పుడు వాడుకలో ఉన్న యూపీఐ క్యూఆర్, భారత్‌ క్యూఆర్‌ కోడ్ లను మాత్రమే కొనసాగించేందుకు అనుమతి ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. సొంత క్యూఆర్‌ కోడ్‌ లు వాడుకుంటున్న పీఎస్‌వో సంస్థలు ఈ రెండింటికీ మారాలని ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31లోగా అన్ని పీఎస్‌వోలూ యూపీఐ, భారత్ కోడ్ లను మాత్రమే వాడాలని తెలిపింది. ప్రస్తుతం ఇండియాలో భారత్, యూపీఐ క్యూఆర్ లతో పాటు పలు సంస్థలు సొంత కోడ్ లను వాడుతున్నాయి..

కాగా, క్యూఆర్ కోడ్స్ లో రెండు డైమెన్షనల్ మిషిన్, రీడబుల్ బార్‌కోడ్స్ ఉంటాయి. పాయింట్ ఆఫ్ సేల్ వద్ద మొబైల్ చెల్లింపులు సులభతరం చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. క్యూఆర్ కోడ్స్ పెద్ద మొత్తంలో సమాచారాన్ని నిల్వచేయగలవు. దేశంలో ఇలాంటి క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ వ్యవస్థను సమీక్షించేందుకు, వివిధ సూచనలు చేసేందుకు ఆర్బీఐ దీపక్ పాటక్ నేతృత్వంలో ఓ కమిటీని వేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు ప్రస్తుతం ఉన్న రెండు క్యూఆర్ కోడ్స్‌ను కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది.. యూపీఐ క్యూఆర్ కోడ్, భారత్ క్యూఆర్ కోడ్స్ కొనసాగుతాయని నోటిఫికేషన్‌లో పేర్కొంది ఆర్బీఐ.

Thanks for reading RBI's key decision on QR codes ...!

No comments:

Post a Comment