Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, October 27, 2020

SBI ATM cash: ATM with draw limit has changed ... how much can be drawn with your SBI card


 SBI ATM cash : ఏటీఎం విత్ డ్రా లిమిట్ మారింది ... మీ ఎస్బీఐ కార్డుతో ఎంత డ్రా చేయొచ్చంటే


 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఖాతాదారులకు అలర్ట్. ఇటీవల ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయల్ లిమిట్ మార్చింది ఎస్‌బీఐ. కార్డును బట్టి విత్‌డ్రా లిమిట్ మారుతుంది. అన్ని ఎస్‌బీఐ డెబిట్ కార్డులకు విత్‌డ్రా లిమిట్ వర్తిస్తుంది. ఎస్‌బీఐ వేర్వేరు రకాల డెబిట్ కార్డులను కస్టమర్లకు ఇస్తుందన్న సంగతి తెలిసిందే. కార్డు వేరియంట్‌ను బట్టి రోజూ రూ.20,000 నుంచి రూ.1,00,000 మధ్య విత్‌డ్రా లిమిట్ ఉంటుంది. రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లు ప్రతీ నెల ఏటీఎంలల్లో 8 ఉచిత ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. ఆ తర్వాత ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. లిమిట్ తర్వాత ప్రతీ లావాదేవీకి ఛార్జీలు చెల్లించాలి. మరి ఎస్‌బీఐ డెబిట్ కార్డుల్లో ఏ కార్డుకు ఎంతవరకు విత్‌డ్రా లిమిట్ ఉందో తెలుసుకోండి.


SBI Classic and Maestro Debit Cards: ఎస్‌బీఐ క్లాసిక్, మ్యాస్ట్రో డెబిట్ కార్డులకు ఏటీఎం విత్‌డ్రా లిమిట్ రూ.20,000.


SBI Global International Debit Card: ఎస్‌బీఐ గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డులకు ఏటీఎం విత్‌డ్రా లిమిట్ రూ.40,000.


SBI Gold International Debit Card: ఎస్‌బీఐ గోల్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డులకు ఏటీఎం విత్‌డ్రా లిమిట్ రూ.50,000.


SBI Platinum International Debit Card: ఎస్‌బీఐ ప్లాటినమ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డులకు ఏటీఎం విత్‌డ్రా లిమిట్ రూ.1,00,000.


SBIINTOUCH Tap & Go Debit Card: ఎస్‌బీఐ ఇన్‌టచ్ ట్యాప్ డెబిట్ కార్డులకు ఏటీఎం విత్‌డ్రా లిమిట్ రూ.40,000.


SBI Mumbai Metro Combo Card: ఎస్‌బీఐ ముంబై మెట్రో కాంబో కార్డులకు ఏటీఎం విత్‌డ్రా లిమిట్ రూ.40,000.


SBI My Card International Debit Card: ఎస్‌బీ మైకార్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డులకు ఏటీఎం విత్‌డ్రా లిమిట్ రూ.40,000.


ఇక ఇటీవల ఓటీపీ ద్వారా ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే విధానాన్ని 24 గంటలు అమలు చేస్తున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలోని అన్ని ఏటీఎంలకు ఇది వర్తిస్తుంది. రూ.10,000 కన్నా ఎక్కువగా ఎవరైనా డబ్బులు డ్రా చేయాలంటే కార్డు స్వైప్ చేసి పిన్ నెంబర్ ఎంటర్ చేయడంతో పాటు తప్పనిసరిగా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాల్సిందే. గతంలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు రూ.10,000 కన్నా ఎక్కువ విత్‌డ్రాయల్స్‌కు ఈ అదనపు సెక్యూరిటీ ఫీచర్ ఉండేది. కానీ ప్రస్తుతం 24 గంటలు ఈ విధానాన్ని అమలు చేస్తోంది ఎస్‌బీఐ.

Thanks for reading SBI ATM cash: ATM with draw limit has changed ... how much can be drawn with your SBI card

No comments:

Post a Comment