Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, October 9, 2020

Unlock 5: These are the rules to follow in AP


అన్ లాక్ 5 : ఏపీలో పాటించాల్సిన నిబంధనలివే



అమరావతి: ఇటివల కేంద్ర ప్రభుత్వం ఆన్‌లాక్‌ 5 మార్గదర్శకాలను ప్రకటించడంతో.. కరోనా నుంచి ప్రజల జీవన విధానం సాధారణ స్థితికి వచ్చింది. దాదాపు అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు యతావిధిగా సాగుతున్నాయి. అక్టోబర్‌ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధిదంచిన అన్‌లాక్‌ 5.0 గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు, భౌతికదూరం తప్పనిసరి అని పేర్కొంది

సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్, షాపుల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రజారవాణాలో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ప్రార్థనా మందిరాల్లో కూడా కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. 

మాస్క్‌ లేకుంటే షాపింగ్ మాల్స్‌, సినిమా హాల్స్‌లో ప్రవేశం నిరాకరించాలని తెలిపింది. కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి ఉండేలా నిర్ణయించిన ప్రభుత్వం బస్టాండ్, రైల్వేస్టేషన్లలో మాస్క్‌లు ధరించేలా ప్రచారం నిర్వహించాలని, మైక్ అనౌన్స్‌మెంట్ ఏర్పాటు చేయాలని పేర్కొంది. సినిమా హాల్స్‌లో కోవిడ్ నిబంధనలపై టెలీ ఫిల్మ్ ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాని వెల్లడించింది. స్కూళ్లు, విద్యా సంస్థలు, పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహించే చోట కేంద్ర మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. విద్యార్థులు, అధ్యాపకులు ప్రతి పీరియడ్ తర్వాత శానిటైజేషన్ చేసుకునేలా యాజమాన్యాలకు ఆదేశాలు ఇవ్వాలని తెలిపింది.

Thanks for reading Unlock 5: These are the rules to follow in AP

No comments:

Post a Comment