Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, October 10, 2020

UPSC Recruitment 2020 : ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ ... ఖాళీల వివరాలు ఇవే


 UPSC Recruitment 2020 : ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ ... ఖాళీల వివరాలు ఇవే



యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. కంబైన్డ్ జియో సైంటిస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కోసం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సైంటిస్ట్ బీ, కెమిస్ట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది యూపీఎస్‌సీ. జియాలజిస్ట్, జియోఫిజిసిస్ట్ పోస్టులు ఖాళీ లేనందున వాటిని నోటిఫై చేయలేదు. ఈ ఎగ్జామినేషన్‌కు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 27 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://upsc.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలున్నాయో లేదో తెలుసుకోవాలి.

మొత్తం ఖాళీలు- 40

సైంటిస్ట్ బీ (హైడ్రోజియాలజీ) గ్రూప్ ఏ- 16

కెమిస్ట్, గ్రూప్ ఏ- 15

సైంటిస్ట్ బీ (జియో ఫిజిక్స్) గ్రూప్ ఏ- 6

సైంటిస్ట్ బీ (కెమికల్) గ్రూప్ ఏ- 3

దరఖాస్తు ప్రారంభం- 2020 అక్టోబర్ 7

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 అక్టోబర్ 27 సాయంత్రం 6 గంటలు

దరఖాస్తు విత్‌డ్రాకు అవకాశం- 2020 నవంబర్ 4 నుంచి 10 సాయంత్రం 6 గంటల వరకు

విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

వయస్సు- 2021 జనవరి 1 నాటికి 21 నుంచి 32 ఏళ్లు

దరఖాస్తు ఫీజు- రూ.200. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.

ఎంపిక విధానం- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ


అభ్యర్థులు ముందుగా https://upsconline.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

హోమ్ పేజీలో ONLINE APPLICATION FOR VARIOUS EXAMINATIONS OF UPSC లింక్ పైన క్లిక్ చేయాలి.

కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో COMBINED GEO-SCIENTIST (Preliminary) EXAMINATION పార్ట్ 1 రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.

పార్ట్ 1 రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత పార్ట్ 2 రిజిస్ట్రేషన్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.

Thanks for reading UPSC Recruitment 2020 : ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ ... ఖాళీల వివరాలు ఇవే

No comments:

Post a Comment