Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, November 3, 2020

9th class BASE LINE TEST GUIDELINES AND MODEL PAPERS


9th class BASE LINE TEST GUIDELINES AND MODEL PAPERS

✨ ప్రారంభ పరీక్ష నిర్వహణ సూచనలు

★ బాలల పఠన సామర్ధ్యాన్ని పరీక్షించడానికి బేస్ లైన్ టెస్ట్ నిర్వహించాలి.

★ కోవిడ్-19 నేపధ్యంలో కేవలం 9వ తరగతి చదువుతున్న బాలలకు మాత్రమే ప్రారంభ పరీక్ష నిర్వహించాలి.

★ తేది:04.11.2020న ఉదయం 10గం. నుండి 1గం.. వరకు ప్రారంభ పరీక్ష నిర్వహించాలి.

★ ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లీషులలో ఉంటుంది. ప్రశ్న పత్రంలో రెండు సెట్లు ఉంటాయి.

★ మొదటి విద్యార్ధి కి సెట్-1, రెండో విద్యార్ధి కి సెట్ -2, మూడవ విద్యార్థికి సెట్-1, నాలుగో విద్యార్ధి కి సెట్ -2 ప్రశ్న పత్రాలతో బేస్ లైన్ పరీక్ష నిర్వహించాలి.

★ ప్రతి విద్యార్థితో తెలుగు ప్రశ్న పత్రాన్ని, ఇంగ్లీషు ప్రశ్న పత్రాన్ని రెండింటిని చదివించాలి.

★ ఏ మీడియం వారైనప్పటికీ రెండు ప్రశ్న పత్రాలనూ చదవాలి. మైనర్ మీడియం పాఠశాలలో తెలుగు ప్రశ్న పత్రాన్ని ప్రధానోపాధ్యాయుడు అనువాదం చేయించి ఉపయోగించాలి.

★ ప్రతి విద్యార్థికి 10 నిముషాల సమయం కేటాయించాలి.

★ ఒక్కొక్క విద్యార్థితో ఒకసారే చదివించాలి. విద్యార్థి సొంతంగా చదవాలే తప్ప ఉపాధ్యాయుడు సూచనలు ఇవ్వకూడదు. ప్రశ్నలు వేయకూడదు. ముందుగా కథను చదివించాలి. కథను ధారాళంగా చదవగలిగితే మిగిలిన ప్రశ్న పత్రంలోని అంశాలు చదివించనవసరంలేదు.

★ కథలో పూర్తి వాక్యం చదవ లేకపోయినా, పదాలు పదాలుగా చదివిన తరువాత విభాగం చదివించాలి.

★ వాక్యాలు చదవలేకపోతే పదాలను, పదాలు కూడా చదవలేకపోతే అక్షరాలు చదివించాలి.

★ అక్షరాలు మాత్రమే చదవగలిగితే L1, పదాల వరకు చదవగలిగితే L2, వాక్యాల వరకు చదవగలిగితే L 3, కథ మొత్తం చదవగలిగితే L 4 స్థాయిలో ఉన్నట్లు నిర్ధారించి ఫార్మాట్ లో నమోదు చేయాలి.

★ 9వ తరగతికి బోధించే టీచర్లందరూ పరీక్ష నిర్వహణలో పాల్గొనాలి.

★ ఉదాహరణకు ఒక పాఠశాలలో 60మంది బాలలు 6 మంది టీచర్లు ఉన్నారు అనుకుందాం. ప్రతి టీచరు 10 మంది పిల్లలకు బేస్ లైన్ టెస్ట్నిర్వహించాలి.

★ ఇందుకోసం ప్రధానోపాధ్యాయుడు ప్రతి టీచరుకు తెలుగు, ఇంగ్లీష్ ప్రశ్న పత్రాలు ఒక్కొక్కటి చొప్పున సెట్-1, సెట్-2 ప్రశ్న పత్రాలు ఇవ్వాలి.

★ కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పరీక్ష నిర్వహించాలి.

★ ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లయితే ఒక రోజు సగం మందికి రెండోరోజు సగం మందికి పరీక్ష నిర్వహించాలి.

★ పరీక్ష పూర్తయిన తర్వాత ప్రధానోపాధ్యాయుడు నిర్ధారిత ప్రోఫార్మ లో పిల్లల స్థాయిని నమోదు చేసి CRP కిఅందచేయాలి.


★ CRP వివరాలను ఆన్ లైన్ లో పొందుపరచాలి.

DOWNLOAD SECTION

Thanks for reading 9th class BASE LINE TEST GUIDELINES AND MODEL PAPERS

No comments:

Post a Comment