Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, November 29, 2020

Find out your Aadhaar card is Active or De active.


 ●మీ ఆధార్‌ కార్డు యాక్టివ్‌గా ఉందా? ఆధారమేంటి?

●యాక్టివో, డియాక్టివో తెలుసుకోండి..

Find out your Aadhaar card is Active or De active.


మీ ఆధార్‌ కార్డు యాక్టివ్‌గానే ఉందా? డీయాక్టివ్‌ అయ్యిందా? లేక హోల్డ్‌లో ఉందా? ఆధార్‌ కార్డుల మార్ఫింగ్‌, దుర్వినియోగం వంటి సంఘటనల నేపథ్యంలో యూఐడీఏఐ అనుమానిత ఆధార్‌లను డియాక్టివేట్‌ చేస్తోంది. ఈ జాబితాలో మీ ఆధార్‌ కూడా ఉందా? లేదా? అన్నది తక్షణం తెలుసుకోండి. ఎలాగంటే..

●మీ ఆధార్‌ కార్డు యాక్టివ్‌గా ఉందో, లేదో తక్షణం మీరు తె లుసుకోవాలి. ఇందుకు యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) https://uidai.gov.in వెబ్‌ పోర్టల్‌లో వెరిఫై అవకాశాన్ని కల్పించింది. వెబ్‌ పోర్టల్‌ ఓపెన్‌ చేశాక గెట్‌ ఆధార్‌, అప్‌డేట్‌ ఆధార్‌, ఆధార్‌ సర్వీసెస్‌ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో మూడో ఆప్షన్‌ అయిన ఆధార్‌ సర్వీసెస్‌లో సబ్‌ ఆప్షన్స్‌లో ఐదు రకాల సేవలను యూఐడీఏఐ అందిస్తోంది. ఇందులో మొదటిది ‘వెరిఫై యాన్‌ ఆధార్‌ నెంబర్‌’. దీనిని క్లిక్‌ చేయగానే మీ ఆధార్‌ నెంబరును అడుగుతుంది. ఆధార్‌ నెంబర్‌ ఇచ్చాక కింద క్యాప్చాను కచ్చితంగా ఎంటర్‌ చేయాలి. అప్పుడు మీ ఆధార్‌ యాక్టివ్‌గా ఉందా? డీ యాక్టివ్‌గా ఉందా? హోల్డ్‌లో ఉందా? అన్న మూడు ఆప్షన్లను చూపిస్తుంది. మీ ఆధార్‌ కార్డు కనుక డీయాక్టివ్‌ అయితే రెడ్‌ మార్క్‌తో డీ యాక్టివ్‌ అని సూచిస్తుంది. మీ ఆధార్‌ యాక్టివ్‌గా ఉంటే గ్రీన్‌ మార్కుతో యాక్టివ్‌గా చూపిస్తుంది. అదే పసుపు రంగులో మార్క్‌ చూపిస్తే మాత్రం తాత్కాలికంగా హోల్డ్‌లో ఉన్నట్టు. యాక్టివ్‌గా ఉంటే సమస్య లేదు. డీ యాక్టివ్‌గా చూపిస్తే మాత్రం కొత్త ఆధార్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హోల్డ్‌లో ఉంటే మాత్రం యూఐడీఏఐ అధికా రులను సంప్రదించి పరిష్కరించుకోవాలి.


●ఎలాంటి పరిస్థితిలో డీయాక్టివ్‌ కావొచ్చు..?


ఆధార్‌ డీయాక్టివేట్‌ కావటానికి అనేక కారణాలున్నాయి. ఇటీవల కాలంలో దొంగ ఆధార్‌లను సృష్టించటంతో పాటు అనేక దుర్వినియోగాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో యూఐడీఏఐ వ్యవస్థను మరింత స్ర్టీమ్‌లైన్‌ చేస్తోంది. ఈ క్రమంలో అనుమానాస్పద ఆధార్‌లను డీయాక్టివేట్‌ చేయటంతో పాటు హోల్డ్‌లో ఉంచుతోంది. డీయాక్టివేట్‌ చేయటానికి ఫిర్యాదులు అందుకున్న ఆధార్‌లే కాకుండా సాధారణ ఆధార్‌లకు సంబంధించి కూడా జరుగుతున్నాయి. ఆధార్‌ కార్డు పొందినవారు ఎప్పుడూ దానిని ఉపయోగించకపోయినా డీయాక్టివ్‌గా గానీ, హోల్డ్‌లో గానీ ఉంటోంది. అలాగే, ఎప్పుడూ బయోమెట్రిక్స్‌ ఇవ్వని వారికి సంబంధించిన ఆధార్‌ కార్డు కూడా డీయాక్టివ్‌, హోల్డ్‌లోకి వెళ్తోంది. అందుకే యూఐడీఏఐ వెరిఫై చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇటీవల ఆధార్‌లో అడ్రస్‌, పుట్టిన తేదీలు, వయస్సు, లింగం మార్పులు ఎవరికి వారు చేసుకోవటానికి ఆన్‌లైన్‌లో అవకాశం కల్పించారు. ఈ క్రమంలో చాలామంది పదేపదే తమ ఆధార్‌లలో వివరాలను మార్పు చేసుకుంటున్నారు. అడ్రస్‌ మార్పుల వరకు అయితే సమస్య లేదు కానీ, ఒకటికి మించి ఎక్కువ సార్లు పుట్టిన తేదీలను మారిస్తే ఆ ఆధార్‌ కార్డును డీయాక్టివేట్‌ చేయటం కానీ, ఉపయోగించటానికి వీల్లేకుండా హోల్డ్‌లో పెట్టడం కానీ చేస్తున్నారు.

Thanks for reading Find out your Aadhaar card is Active or De active.

No comments:

Post a Comment