ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ పలు అంశాలకు మంత్రివర్గం ఆమోదం.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది . రైతు భరోసా పథకం , ఇన్‌పుట్ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది . ఇళ్ల పట్టాల పంపిణీ , పక్కా ఇళ్ల నిర్మాణంపై చర్చ జరగడంతో పాటు , ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏర్పాటు ఆర్డినెన్సకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది . ఏపీ సర్వే అండ్ బౌండరీ చట్ట సవరణ , ఆంధ్రప్రదేశ్ పర్యాటక పాలసీని కేబినెట్ ఆమోదించింది . 6 జిల్లాల్లో వాటర్ షెడ్ల అభివృద్ధి పథకం అమలుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది .
ఈ క్యాబినెట్ నిర్ణయాల గురించి మంత్రి పేర్ని నాని మీడియాకి సమాచారం ఇచ్చారు . మంత్రి చెప్పిన వివరాల ప్రకారం రైతు భరోసా మూడవ సీసన్ కు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది . అలానే డిసెంబర్ 29 న రైతుల అకౌంట్ లో రైతు భరోసా వారి అకౌంట్ ల లో జమ చేయనున్నారు . అధిక వర్సాల మూలం గానో ప్రకృతి వైపరీత్యాల మూలం గా 1200 కోట్లు ఇన్పుట్ సబ్సిడి ని ఇప్పటికే చెల్లించామని నివర్ తుఫాన్ వల్ల బాధితులు నష్టపోయారో వారి కతాల్లోకి ఈ నెల 29 న 718 కోట్లు నేరుగా డబ్బు జమచేస్తామని మంత్రి పేర్కొన్నారు . పశుసంవర్ధక శాఖ లో కాంట్రాక్ట్ పద్ధతి లో పోస్ట్ లు భర్తీ కి కాబినెట్ లో నిర్ణయం తీసుకున్నామన్న ఆయన పులివెందుల లో ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మనేజ్మెంట్ ఏర్పాటు కు కాబినెట్ ఆమోదం తెలిపింది . ఏ పి ఎం ఈ ఆర్ ని అనే సంస్థ ను ఆర్డినెన్స్ ద్వారా ఏర్పాటుకు కాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు . 16 కొత్త మెడికల్ కాలేజీ ల ఏర్పాటుకు అవసరం అయిన కార్పొరేష ఏర్పాటు అయిన 16000 కోట్లు సమకూర్చుకోవడానికి ఆమోదం తెలుపగా సమగ్ర సర్వే ద్వారా ప్రతి భూమికి సబ్ డివిసిన్ ప్రకారం మార్క్ చేయాలనీ నిర్ణయం తీసుకుంది . కొత్త పర్యాటక విధానానికి ఆమోదం తెలిపిన కేబినెట్ , కోవిడ్ 19 కారణంగా దెబ్బతిన్న పర్యాటక ప్రాజెక్టులకు రీస్టార్ట్ ప్యాకేజికి ఆమోదించింది . రూ 198.05 కోట్ల పర్యాటక ప్రాజెక్టులకు రీస్టార్ట్ ప్యాకేజి ఆర్ధిక సాయం ఇవ్వనున్నారు తద్వారా 3910 పర్యాటక సంస్థలకు ఆర్ధికంగా లబ్ధి కలగనుంది . కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న హోటళ్లు , రెస్టారెంట్లు , టూర్ ఆపరేటర్లు , ట్రావెల్ ఏజెంట్లకు కూడా సాయం చేయనుంది ప్రభుత్వం .
Thanks for reading AP Cabinet meeting Highlights 18.12.20
No comments:
Post a Comment