ఆలోచనలకు అందలం
బాలల సైన్సు కాంగ్రెస్‌కు ఏర్పాట్లు
భావి శాస్త్ర వేత్తలకు ఆహ్వానం
గైడ్ టీచర్లకు వర్చువల్ విధానంలో శిక్షణ
కర్నూలు విద్య, న్యూస్‌టుడే : విద్యార్థుల్లో పరిశీలన, ఆలోచన శక్తిని పెంపొందించి పరిశోధన వైపు దృష్టిని మళ్లించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేలా లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆ దిశగా ఆసక్తిని పెంచేందుకు ఈ ఏడాది ఆన్‌లైన్‌లో నిర్వహిస్తోంది. 2020-21 విద్యా సంవత్సరంలో తయారుచేసిన ప్రాజెక్టు వివరాలను ఈనెల 20లోపు జిల్లా కేంద్రంలో సమర్పించాల్సి ఉంది.
ఐదుకు తక్కువ కాకుండా..
☀️నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్సు అండ్ టెక్నాలజీ, ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి (ఆఫ్ కాస్ట్) సంయుక్త ఆధ్వర్యంలో 28వ జాతీయ బాలల సైన్సు కాంగ్రెస్ పోటీలు నిర్వహించేందుకు విద్యాశాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఒక పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులకు తక్కువ కాకుండా దరఖాస్తులు పంపాలని సూచించింది. ఆసక్తి కలిగినవారు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొనేందుకుగాను ఈనెల 10, 11 తేదీల్లో గైడ్ టీచర్లకు వర్చువల్ విధానంలో శిక్షణ ఇచ్చేలా అధికారులు చర్యలు చేపట్టారు.
విద్యార్థులు ఎంచుకున్న అంశానికి అనుగుణంగా ఆయా పాఠశాలల్లోని గైడ్ టీచర్ ప్రాజెక్టును తయారు చేయించాలి. ఈ ప్రాజెక్టు పనితీరు, ఉపయోగం తదితర అంశాలతో పుస్తకాన్ని పొందుపరచాలి. రూపొందించిన ప్రాజెక్టును 4 నిమిషాలకు మించకుండా వీడియోతోపాటు ప్రాజెక్టు వివరాలతో సంక్షిప్త సమాచారం (ఒక పేజీ)ను పీడీఎఫ్ రూపంలో వాట్సాప్, వెబ్‌నార్ లింక్‌కు ఈనెల 18, 19 తేదీల్లో పంపాలి.
ఎంపిక విధానం ఇలా..
☀️జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ప్రయోగాల ప్రదర్శనకు దరఖాస్తులు ఆహ్వానిస్తూనే పలు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఉన్నత పాఠశాలలో 6-10వ తరగతి చదివే విద్యార్థులు ఎవరైనా పోటీల్లో పాల్గొనవచ్ఛు గతంలో ఉన్న పరిమితులను తొలగించి ఒక పాఠశాల నుంచి ఎన్ని ప్రాజెక్టులైనా సమర్పించేందుకు అవకాశం కల్పించారు. ఈ ఏడాది జిల్లాలో దరఖాస్తు చేస్తున్నవారితో పోటీలు జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ని ప్రాజెక్టుల్లో అత్యుత్తమమైన 10 ప్రయోగ నమూనాలను ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ఇందులో నిబంధనల ప్రకారం సమ సమాజానికి ప్రయోజనం కలిగే ప్రయోగాలను న్యాయనిర్ణేతలు ఎంపిక చేసిన వాటిని జాతీయస్థాయి పోటీలకు పంపుతారు. గతంలో పలువురు జిల్లా నుంచి జాతీయస్థాయి పోటీల్లో రాణించి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు.
Thanks for reading Arrangements for the Children's Science Congress
No comments:
Post a Comment